BigTV English

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

Brahmamudi Serial Today September 19th Episode : రాజ్‌ వెటకారంగా బతిమాలుతుంటే కావ్య  నన్ను తీసుకెళ్లడానికి వచ్చారా? ఇక ఎప్పటికీ రాకుండా చేయడానికి వచ్చారా? అని  ప్రశ్నిస్తుంది. ఇంట్లోంచి అత్తమామలు రాగానే మీ అమ్మాయి మాటలకు నేను ఇక ఎప్పటీకీ మీ ఇంటి గడప తొక్కను అంటాడు రాజ్‌. అయితే నువ్వు కూడా మీ అమ్మకు చెప్పు నేను ఇక జన్మలో ఆ ఇంటి గడపే తొక్కనని అంటుంది.


కోడలిగా నటించడానికి చెక్ ఇస్తాను.

కావ్య మాటలకు రాజ్‌ వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన రాజ్‌కు నువ్వు ఏం చేసైనా నా కొడలిని ఇంటికి తీసుకురావాలి అని అపర్ణ చెప్పిన  మాటలు గుర్తుకువచ్చి రాజ్‌  కారులో ఉన్న చెక్‌ బుక్‌ తీసుకుని మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. మళ్లీ వచ్చిన రాజ్‌ చూసిన కావ్య. మీరు అనాల్సిన మాటలు ఇంకా ఏమైనా మిగిలిపోయాయా? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ కూడా నువ్వు వదలాల్సిన తూటాలు ఏమైనా మిగిలిపోతే పక్కన పెట్టు.. పెట్టి చెప్పే మాటలు శ్రద్దగా విను..అంటాడు. విని ఏం చేయాలి కావ్య అడగ్గానే నేను ఒక అద్భుతమైన ఆఫర్‌ ఇవ్వడానికే వచ్చాను. ఇది ఏ భర్త ఏ భార్యకు ఇవ్వని ఆఫర్‌ నేను నీకు ఇస్తున్నాను అంటాడు రాజ్‌. ముందు అదేంటో చెప్పండి.


అది అద్భుతమో.. అమోఘమో.. చెండాలమో నేను డిసైడ్‌ చేస్తాను అంటుంది కావ్య. దీంతో దీన్నే పొగరు అంటారు. తగ్గించుకుంటే మంచిది అంటాడు రాజ్‌. మామూలుగా అయితే తగ్గేదాన్నేమో.. కానీ ఈ గడప తొక్కనని శపథం చేసిన రెండు నిమిషాల్లోనే మళ్లీ గడప తొక్కారు కదా? నేను గెలిచాను కదా? తగ్గను అంటుంది కావ్య. అవన్నీ నాకనవసరం ఇప్పుడు నాకు మా అమ్మ ముఖ్యం. మా అమ్మకు నువ్వు ఆ ఇంట్లో కోడలిగా ఉండటం ముఖ్యం. కాబట్టి నీకొక  సెన్సెషన్‌ ఆఫర్‌ ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు రాజ్‌. ముందు అదేంటో చెప్పండి.. మాటలే చెప్తున్నారు కానీ ఆఫర్‌ ఏంటో చెప్పడం లేదు అంటుంది కావ్య. దీంతో రాజ్‌ నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించడానికి నీకెంత కావాలి.. ?  ఫ్యాకేజీ కావాలా? జీతం కావాలా? ఎలా కావాలంటే అలా ఇస్తాను ఎంత కావాలంటే అంత ఇస్తాను.. ఇదిగో చెక్‌ బుక్‌ తెచ్చా..? అని రాజ్‌ చెప్పగానే  ఎంత కావాలిస్తే అంత ఇస్తారా..? అని అడుగుతుంది. ఎంతైనా తీసుకో ఇదిగో సంతకం పెట్టాను ఎంమ్టీ చెక్‌ తీసుకో అంటాడు రాజ్‌.

నెల జీతం ఆరు లక్షలు ఇస్తాను

అయితే ఒక్క నిమిషం ఉండండి సర్దుకుని వస్తాను అని లోపలిక వెళ్తుంది కావ్య. కొద్దిసేపటికి తిరిగి వచ్చిన కావ్య రాజ్‌ ముందు బంగారు నగలు ఉంచి మీ నెల జీతం ఎంత అని అడుగుతుంది. నేను జీతం ఎందుకు తీసుకుంటాను కంపెనీయే మాది కాదా? కాకపోతే నెల నెల ఖర్చుల కోసం ఓ ఐదు లక్షలు డ్రా చేస్తుంటాను అంతే అని రాజ్‌ చెప్పగానే అయితే ఈ నగలు తీసుకోండి బంగారు రేటు పెరిగింది కదా? ఓ ఆరు లక్షలు రావొచ్చు. ఇవి తీసుకుని ఓ నెల మా ఇంటి అల్లుడిగా నటించండి అని చెప్తుంది. కావ్య మాటలకు రాజ్‌ కు కోపం వస్తుంది. ఈ దుగ్గిరాల ఇంటి వారసుడినే కొంటావా? అసలు నీకెంత ధైర్యం అంటూ కావ్య మీద విరుచుకుపడతాడు రాజ్‌. నువ్వు ఎరైతే నాకేంటి. నీకు నెల జీతం కన్నా ఎక్కువే ఇస్తున్నాను కదా? నటిస్తావా? లేదా? అంటూ అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ ఉంటుంది. నువ్వు దుగ్గిరాల వారసుడివి అయినా  ఐ డోంట్‌ కేర్‌ అని కావ్య చెప్పడంతో రాజ్‌ అవమానంగా వెళ్లిపోతాడు.

Also Read: మహాకు వార్నింగ్‌ ఇచ్చిన మధు – మహాను అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి వచ్చిన పోలీసులు

రాజ్‌ ను తిట్టిన అపర్ణ, ఇందిరాదేవి

ఇంటికి ఒక్కడే వచ్చిన రాజ్‌ను ఇందిరాదేవి ఏమైందని అడుగుతుంది. అపర్ణ నా కొడలు ఎక్కడ అని నిలదీస్తుంది. దీంతో ఆ మహాతల్లి రాలేదని నేను కాళ్లా వేళ్లా పడ్డా తను రానని కావాలంటే ఒక బొమ్మను ఇస్తాను తీసుకెళ్లు అంటూ నన్ను అవమానించిందని రాజ్‌ చెప్పగానే అపర్ణ నాకు అర్థంమైంది అంటుంది. ఇందిరాదేవి కూడా నాకూ అర్థమైంది అంటుంది. ఇద్దరిని మీకు ఏం అర్థమైంది అని అడుగుతాడు రాజ్‌. అదే నువ్వు దాన్ని మనిషిలా కాకుండా బొమ్మలా చూశావని అందుకే నిన్ను బొమ్మను తీసుకెళ్లమంది. అంటారు. నువ్వు దాన్ని మనఃస్పూర్తిగా పిలవలేదు కాబట్టే అది రాలేదని అపర్ణ తిట్టగానే అవును నాకు దాన్ని తీసుకొచ్చే ఉద్దేశం లేదని చెప్పి లోపలకి వెళ్లిపోతాడు రాజ్‌.

రుద్రాణిని కాళ్ల బేరానికి పంపిద్దాం.

తర్వాత ఏం చేస్తే వాళ్లు కాపురం బాగుపడుతుంది. వాళ్లు ఇద్దరు ఒక్కటవుతారని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో రుద్రాణి వాళ్లకు కలవాలని ఇష్టం లేనప్పుడు మనమేం చేస్తాం చెప్పండి అంటుంది. దీంతో రుద్రాణిని స్వప్న తిడుతుంది. అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నారా? అంటూ ప్రశ్నిస్తుంది. మా అత్తనే కావ్యను తీసుకురావడానికి పంపిస్తే బాగుంటుంది. అని స్వప్న చెప్పడంతో ప్రకాష్‌ ఈ రుద్రాణి వెళితే కావ్య అసలు నమ్మదు అంటాడు.

కళ్యాణ్‌ నెల తప్పాడా? ఏంటి?

కళ్యాణ్‌ సంతోషంగా ఇంట్లోచి వచ్చి ఏయ్‌ పొట్టి నీకో గుడ్‌ న్యూస్‌ అంటాడు. ఏంటి కొంపదీసి నువ్వు కానీ నెల తప్పావా? ఏంటి? అని అప్పు వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో కళ్యాణ్‌ డిస్సపాయింట్‌ అవుతాడు. దీంతో అప్పు జోక్‌ చేశాను అని ఏంటి విషయం అని అడగ్గానే మా అన్నయ్య మీ ఇంటికి వెళ్లారంట. కానీ వదినను తీసుకెళ్లకుండానే వెళ్లిపోయారట అని కళ్యాణ్‌ చెప్పగానే బావ ఆ మాత్రం వెళ్లడమే గొప్ప ఆయనకు ఇగో ఎక్కువ కదా అంటుంది. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×