BigTV English

Gundeninda GudiGantalu Serial Today Episode September 24 : రవి పెళ్లి ఫిక్స్ చేసిన బాలు.. రిజెక్ట్ చేసిన పార్వతి.. బాలు చేసిన పనికి షాక్ లో మీనా..

Gundeninda GudiGantalu Serial Today Episode September 24 : రవి పెళ్లి ఫిక్స్ చేసిన బాలు.. రిజెక్ట్ చేసిన పార్వతి.. బాలు చేసిన పనికి షాక్ లో మీనా..

Gundeninda GudiGantalu Serial Today Episode September 24 : స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న డైలి సీరియల్స్ లలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ కూడా ఒకటి.. నిన్నటి ఎపిసోడ్ లో రవి, శృతి ల ప్రేమ వ్యవహారం గురించి బయట పెడుతుంది. నేను అనుకున్నదే జరిగింది. ఆ రవికి ముందే చెప్పాను ఇలాంటివి చేస్తే ఊరుకొనేది లేదని కానీ ఇలా చేస్తాడా.. దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా వద్దనకుండా అని అంటాడు బాలు… రవి కి శృతిని మర్చిపో అని రెస్టారెంట్ కు వెళ్లి వార్నింగ్ ఇస్తాడు బాలు.. నాన్న తల దించుకొనే పనిని ఎందుకు చేస్తున్నావ్.. ఇక ప్రభావతి కృష్ణ మూర్తిని మంచి సంబంధం చూడమని చెబుతుంది.. ఇక రాత్రి మీనా, బాలు మాట్లాడుకుంటారు. ప్రేమికులను విడదీయం మహా పాపం అని అంటాడు. ఇక మీనా మీరు మొండిగా ఉంటే ఎలా అని అడుగుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు నిద్ర పోతున్న మీనాను లేపుతాడు. పూల గంప లేవు అంటాడు. ఏంటీ ముళ్ల కంప అని అంటాడు. నిద్ర పోతున్నావా.. అవును అంటే లాగి ఒకటి ఇస్తాను మత్తు వదులుతుంది. అంటాడు. ఏంటో చెప్పు అంటాడు.. శృతినీ రవి మర్చిపోతాడుగా ఏమో నాకు తెలియదు. అసలే రవి భోజనం కూడా చెయ్యలేదు అంటుంది. ప్రేమికులను విడగొట్టడం పాపం అంటుంది. రవి మర్చిపోకుంటే ఈసారి చెంప పగులుతుంది అంటాడు. రెండు రోజులుగా మాట్లాడకుంటే మర్చిపోతాడులే అని బాలు అంటాడు. అవునా రెండు రోజులు పోతే ఎలా మర్చి పోతారని అంటారు అని అడుగుతుంది.. అమ్మమ్మ గారి ఊర్లో లవ్ లాంటివి ఏమి లేవా అని అడుగుతుంది.. నాకు ఇలాంటివి సెట్ అవ్వవు అని అంటాడు బాలు.. ఇక బాలును ఒక సంబంధం చూసానని చెప్పారు కదా అది ఎవరో చెప్పండి అంటూ మీనా అడుగుతుంది.. రేపు చెబుతాను అని చెప్పి పడుకుంటాడు..

Gundeninda GudiGantalu Serial Today Episode September 24
Gundeninda GudiGantalu Serial Today Episode September 24

నిద్రపోతున్న దాన్ని లేపి మీరు పడుకుంటారా అని మీనా అంటుంది. ఇక పొద్దున్నే పోదాం అంటున్నాడు ఎక్కడికై ఉంటుంది అని మీనా ఆలోచిస్తుంది. కట్ చేస్తే.. ఉదయం కారులో బాలు, మీనా బయలుదేరుతారు. బాలు పాత పాటలు పాడుతుంటే మీనా ఆపుతుంది. నన్ను నేను పొగుడుకోడానికి మాటలు సరిపోవు. అందుకే పాటలతో పొగుడుకుంటున్నాను అని బాలు అంటాడు. ఎవరి వారిని పొగుడోకూకుడదు అని మీనా అంటుంది. ఇప్పుడు నేను చేయబోయే పనికి కథలు కథలుగా గొప్పగా చెప్పుకుంటారు. నీ భర్త మెదడులో ఇంత గొప్ప ఆలోచన మెదిలిందా అనుకుంటావ్ అని బాలు అంటాడు. తన గురించి తానే గొప్పగా చెప్తాడు.


అయ్యయ్యో ఏమైంది ఈయనకు.. సొంత డబ్బా కొట్టుకునే దెయ్యం పట్టింది. బూత వైద్యుడిని కలవాలి. నిమ్మకాయ కొట్టాలి అని మీనా అంటుంది. నేను ఓ పని చేయాలనుకుంటున్నాను అని బాలు అంటాడు. ఏంటో తీసుకెళ్తున్నారు. కాఫీ, టీ ఇవ్వలేదని అత్తయ్య గారు అంటారని మీనా అంటే.. అఖండ జ్ఞానిని నేనున్నాగా.. నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. ఇక కారు ఆపి పండ్లు కొంటాడు. ఏంటంటీ పండ్లు కూడా కొన్నారని మధ్యలో మీనా అడుగుతుంది. కాస్త ఆగుతావా అని బాలు చెబుతాడు. మీనా ఇంటి దగ్గర ఆపి అత్తయ్య అత్తయ్య అని లోపలికి వెళ్తాడు బాలు. ఏదైనా గొడవ జరిగిందా అని మీనా తల్లి పార్వతి అంటుంది. నీకు కొంచెం కూడా అర్థం కాలేదా అని మీనా అంటే.. ఏమైందే అని కంగారుపడుతుంది పార్వతి. నాకు ఏం అర్థం కాలేదని మీనా అంటుంటే.. అత్తయ్య మీ ఇంట్లో ఇత్తడి పెళ్లెం ఉందా అని అడిగి తీసుకురమ్మంటాడు. దాంతో పార్వతి ఇత్తడిపళ్లెం తీసుకొస్తుంది. అందులో పూలు పండ్లు పెడతాడు.. అది చూసి షాక్ అవుతుంది పార్వతి. నేనేమైనా నాటు బాంబులు పెట్టానా. పళ్లే కదా పెట్టాను అని బాలు అంటాడు. దేవుడు ఫొటోల దగ్గరికి వెళ్లి మీనాను పిలిస్తే.. వెళ్తుంది. మావయ్య ఫొటో దగ్గర నిలబడండి అని పార్వతికి చెబుతాడు బాలు. దాంతో అలాగే చేస్తుంది పార్వతి. మీనాను తాంబూళం పట్టుకోమ్మంటాడు. నేను మీ ఇంట్లో మంచి చేయడానికి ఇలా వచ్చాను అని బాలు అంటాడు.

Gundeninda GudiGantalu Serial Today Episode September 24
Gundeninda GudiGantalu Serial Today Episode September 24

ఈ ఇంటి బరువు బాధ్యతలు నేను కూడా పంచుకోవాలి. పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉండటం బరువు. ఆ బరువును గుండెలమీదకెళ్లి దింపుకోడవం బాధ్యత అని బాలు అంటాడు. కరెక్టే కానీ, నాకేం అర్థం కావట్లేదు. మీరేమైనా తాగొచ్చారా అని పార్వతి అంటుంది.. మా రవి మంచోడు మీ సుమతిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతాడు. దానికి పార్వతి వద్దు బాబు మీనా పడుతున్న కష్టాలు సుమతి కూడా పడాలినా అని అంటుంది. ఇక మీనాను తీసుకొని బాలు వెళ్తాడు. మధ్యలో కారు ఆపుతాడు. గురించి మీరు ఏమనుకుంటున్నారే. ఇంత దారుణంగా మాట్లాడి పంపిస్తారా. మొహం మీద కొట్టినట్లు మాట్లాడుతుంది మీ అమ్మ. పెళ్లి చేసుకోవడం పిల్ల చెప్పాలి. పిల్ల తల్లికాదు అని బాలు అంటాడు. మీ అమ్మకు ఇష్టంలేకుండా నాకు పెళ్లి చేశారు. నేను పడే కష్టాలు చూడట్లేదా. రోహిణి వచ్చాక నన్ను ఎలా చూస్తున్నారు. పూలమ్ముకునేవాళ్లు మనుషులు కాదా అని మీనా అంటుంది..

అన్నం పెట్టనట్లు, చిత్రహింసలు పెడుతున్నట్లు చెబుతున్నావ్ అని బాలు అంటాడు. చిత్రహింసలు అంటే ఏంటండి.. కొట్టాలా తిట్టాలా, వాతలు పెట్టాలా. మనసు ముక్కలు అయ్యేలా ఒక్క మాట అంటే చాలు. చచ్చేంత వరకు గుర్తుంటుంది. మమ్మల్ని దొంగల కుటుంబం అంటున్నారు అది చాలదా. మా అమ్మను అడిగే ముందు మీ అమ్మను అడగలాని తెలియదా అని మీనా నిలదీస్తుంది.. తన తల్లీ చేస్తున్న అవమానాలా గురించి చెప్పి బాధ పడుతుంది. నన్ను అన్న మాటలు చాలు. నేను పడినట్లు నా చెల్లి కూడా పడాలా దానికి పెళ్లి కుదిరినప్పుడే అవ్వని మీరు జ్యోక్యం చేసుకోవద్దు అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

రేపటి ఎపిసోడ్ లో రోహిణి వాళ్ల అమ్మను చూస్తాడు బాలు.. నువ్వెంటి బాబు ఇక్కడ అని అడిగితే నా క్యాబ్ ఎవరో బుక్ చేసుకున్నారు అంటాడు. రండి మీరు వెళ్లిపోయారని మీనా ఫీల్ అయ్యింది. దారిలోనే మా ఇల్లు కలిసి వెళ్దాం అంటాడు. వీళ్లను రోహిణి చూస్తుంది. ఇక రోహిణి గురించి నిజం తెలిసిపోతుందా.. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి…

Related News

Big tv Kissik Talks: గుడ్ న్యూస్ చెప్పిన విష్ణు ప్రియ.. మరోసారి ప్రెగ్నెంట్ అంటూ?

Big tv Kissik Talks: అమ్మకు క్యాన్సర్.. ఆఖరి చూపు కూడా లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ!

Shobha Shetty: శోభా శెట్టి కొత్త వ్యాపారం.. దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కుటుంబాన్ని కలిపేందుకు నర్మద ప్లాన్.. సాగర్ సర్ప్రైజ్.. ధీరజ్ కు లవ్ లెటర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. షాకిచ్చిన శ్రీయా.. అవని ప్లాన్ సక్సెస్ అవుతుందా..?

Nindu Noorella Saavasam Serial Today october 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మిస్సమ్మ ల మధ్య గొడవ

Brahmamudi Serial Today October 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య  

GudiGantalu Today episode: ప్రభావతి కోరిక తీర్చిన కామాక్షి.. మగాళ్లకు షాకిచ్చిన నాట్యమయూరి.. బాలు సెటైర్స్..

Big Stories

×