BigTV English

Gundeninda GudiGantalu Serial Today Episode : శృతికి సపోర్ట్ గా మీనా.. ప్రభావతికి మొదలైన అనుమానం..

Gundeninda GudiGantalu Serial Today Episode : శృతికి సపోర్ట్ గా మీనా.. ప్రభావతికి మొదలైన అనుమానం..

Gundeninda GudiGantalu Serial Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో రవికి పెళ్లి సంబంధం చూస్తుంది ప్రభావతి.. అయితే బాలు వల్ల ఆ సంబంధం చెడిపోతుంది. దాంతో కోపంతో రగిలిపోతుంది.. అంతా బాలు వల్లే అంటూ గొడవకు దిగుతుంది.. వీడో దరిద్రుడు అంటూ బాలును నానా మాటలు అంటుంది. దానికి మీనాకు కోపం వస్తుంది. నీ కళ్ళముందు నీ భర్తను అంటే భాద లేదేమో కానీ నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఊరుకోని అని వార్నింగ్ ఇస్తుంది. ఇక కొడుకు సంబంధం చెడిపోవడానికి బాలు, మీనా అని ఆలోచిస్తుంది. ఇక కోడలు రోహిణికి ఫోన్ చేసి పార్లర్ కు వస్తున్నా అని చెప్తుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి కి ప్రభావతి ఫోన్ చేసి అడుగుతుంది. ఎక్కడున్నావు రోహిణి అని, దానికి రోహిణి నేను పార్లర్ లో ఉన్నాను అంటుంది. అవునా నేను మీ పార్లర్ దగ్గరే ఉన్నాను అని చెబుతుంది. ఇక పార్లర్ అమ్మేసిన విషయం తెలియకుండా మ్యానేజ్ చెయ్యాలని అనుకుంటుంది. క్వీన్ పార్లర్ అనే బోర్డ్ ను కవర్ చెయ్యాలని అనుకుంటుంది. ఒక క్లాత్ తీసుకొచ్చి కవర్ చేస్తుంది.. అంతలోకే ప్రభావతి లోపలికి వస్తుంది. ఏంటమ్మా ఎలా ఉంది అంటే బాగానే సాగుతుంది అని చెబుతుంది. అవును ఈ పార్లర్ బోర్డుకు ముసుగు వేసావేంటి అని అడుగుతుంది. నా పేరు మీద ఒక ప్రాపర్టీ ఉందని ఇన్ని రోజులుగా అనుకున్న చూడని అంటుంది. లేదు అత్తయ్య మీ పేరును ఇంకా బాగా చూపించేందుకు డిజైన్ మారుస్తాను అంటుంది. అవునా ఒకసారి చూడొచ్చునా అంటే వద్దు అత్తయ్య పెయింటింగ్ ఉందని చెబుతుంది.

Gundeninda GudiGantalu Serial Today Episode
Gundeninda GudiGantalu Serial Today Episode

మీనా దగ్గరకు శృతి వస్తుంది. ఏమైంది శృతి అంటే చనిపోవాలని అనుకుంటున్నా అని రవి తో ప్రేమ విషయాన్ని బయట పెడుతుంది. అది విని మీనా షాక్ అవుతుంది. మీ ఇద్దరు ఇంట్లోంచి లేచిపోయి పెళ్లి చేసుకోండి అని సలహాలు ఇస్తుంది మీనా.. నేను రవి లేకుండా ఉండలేను అని చెప్తుంది. ఇక రోహిణి అత్తయ్య మీకు తల నొప్పి అన్నారుగా మసాజ్ చేస్తాను అని లోపలికి తీసుకెళ్తుంది. నీ చేత్తో చేస్తే బాగుంటుంది అంటుంది ప్రభావతి.. దాంతో ఇద్దరు లోపలికి వెళ్తారు. అంతలోనే క్వీన్ పార్లర్ ఓనర్ వస్తుంది.. ఫోన్ మాట్లాడుతూ అరుస్తుంది. రోహిణి ఫ్రెండ్ వస్తుంది. గుడ్ మార్నింగ్ మేడమ్ అని చెబితే.. రోహిణి గురించి అడుగుతుంది. లోపల కస్టమర్ తో ఉంది మేడమ్ అంటుంది. అవునా నేను ఒకసారి మాట్లాడాలని చెబుతుంది.


ఓనర్ వచ్చిన విషయాన్ని రోహిణికి చెబుతుంది. నేను వస్తున్నా నువ్వు వెళ్ళు అంటుంది. ఇక రోహిణిని పిలవవా నేను మాట్లాడాలి అంటుంది. వస్తుంది మేడమ్ అని చెబుతుంది. మీనాకు ఎంత పొగరు బాలు మీనా వల్లే సంబంధం చెడిపోయిందని చెబుతుంది. అంతలోపే ఓనర్ పిలుస్తున్నారని తన ఫ్రెండ్ చెబుతుంది. కీరా తీసుకొని రా అని చెప్పి తెప్పిస్తుంది రోహిణి. అత్తయ్య కీరాను కళ్ల మీద పెడుతున్న నేను చెప్పేవరకు తియ్యొద్దని చెబుతుంది.. ఇక బయటకు వెళ్ళిపోతుంది. ఓనర్ వచ్చి ఏదైన సమస్యలు ఉన్నాయా అంటే లేదని చెబుతుంది. అకౌంట్స్ చూడాలని చెప్పి చూస్తుంది. ఇక్కడ ఏమి ప్రాబ్లమ్ లేదు నేను వస్తాను అని చెబుతుంది.. ఇక ఆ తర్వాత రోహిణిని రవికి మంచి సంబంధం చూడమని చెబుతుంది.

ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతారు. అంతలోకే మీనా శృతి అక్కడకు వస్తారు. నా ఫ్రెండ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక మళ్లీ మీనా వచ్చి అత్తయ్య తీసుకురమ్మంటారా అంటుంది. దానికి కళ్ళు కనిపించలేదా నేను జ్యూస్ తాగుతున్నా అంటుంది.. అయితే అక్కడ నుంచి మీనా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే శృతి వాళ్ల పేరెంట్స్ తో గొడవ పడుతుంది. నాకు సంబంధం ఎవరు చూడమన్నారు అని దానికి ఇద్దరు అరుస్తారు.. ఇక మీనా బాలుకు ఈ విషయం చెబుతుంది.. రవి, శృతి ప్రేమ విషయాన్ని బయట పెడుతుంది. అది విన్న బాలు కోపంగా రవి దగ్గరకు వెళ్లి గొడవ పడతాడు.. ఇది జరిగితే అస్సలు ఊరుకొని అని వార్నింగ్ ఇస్తాడు. అంతే ఎపిసోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×