BigTV English

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను వదిలేసిన రోహిణి.. చింటు రోహిణి కొడుకని తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను వదిలేసిన రోహిణి.. చింటు రోహిణి కొడుకని తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode march 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ఇన్ని రోజులు దాచిపెట్టి నిజాన్ని బాలు బయట పెట్టడంతో ప్రభావతి మనోజ్ బాలుపై కోపంగా ఉంటారు. ఇక రోహిణి ఎంత చెప్పినా కూడా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మనోజ్ రోహిణిని బ్రతిమలాడినా కూడా రోహిణి ఒప్పుకోదు. నిన్ను నేను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను నీకు తెలీదు అయితే నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావని నేను అనుకోలేదు అని బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ తలా ఒక మాట అనడంతో రోహిణి ఏడుస్తుంది. మనోజ్ మాత్రం రోహిణిని ఓదార్చలేక పోతాడు. రోహిణి మనోజ్ మోసం చేశాడని బాధపడుతుంది. తనలో తానే కుమిలిపోతుంది. తన ఫ్రెండ్ తో మనోజ్ మోసాన్ని బయట పెడుతుంది.. బాధ పడుతుంది. మనోజ్ కు దూరంగా వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే .. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో రోహిణిని అందరు నానా మాటలు అంటారు. రోహిణిని అనడంతో ఏం చెప్పాలో తెలియక ఫీల్ అవుతుంది. మనోజ్ క్షమించమనీ అడిగినా కూడా రోహిణి సహించలేకపోతుంది. ఇదంతా సహించలేకపోయిన రోహిణి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. మనోజ్ వచ్చి ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా కూడా రోహిణి మాత్రం అసలు వినదు. తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్లి మనోస్ నన్ను దారుణంగా మోసం చేశాడని బాధపడుతుంది. నేను ఒక పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు మనోజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాను నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతున్నాను అని అంటుంది. మనోజ్ జాబ్ లేదని చెప్పకపోవడం తప్పే కానీ నువ్వు ఎంత పెద్ద మోసం చేసి ఆ ఇంటికి కోడలు అయ్యావు ఆ విషయం తెలిస్తే మీ పరిస్థితి ఏంటి నువ్వు ఇప్పుడు ఎన్ని మాటలు అయితే మనోజ్ ను అన్నావో అవన్నీ రివర్స్ నీకే తగులుతాయి అని నువ్వు ఆలోచించవా అని విజ్జి హెచ్చరిస్తుంది..

ఇక మనోజ్ కి ఎలాగైనా దూరంగా ఉండాలని అప్పుడే తను జాబ్ తెచ్చుకొని దారిలోకి వస్తాడని ఆ తర్వాత నేను మనోజ్ దగ్గరికి వెళ్లొచ్చని రోహిణి అనుకుంటుంది. ఇక మనోజ్ కి దూరం గా వెళ్ళిపోతుంది. మనోజ్ కు విజ్జి ఫోన్ చేసి రోహిణి ని ఇంత మోసం చేస్తావా అని అడుగుతుంది. రోహిణికి ఒకసారి ఫోన్ ఇవ్వవా నేను మాట్లాడతానని అడుగుతాడు. కానీ రోహిణి లేదు ఎక్కడికో వెళ్లిపోయిందని విజ్జి చెప్పగానే మనోజ్ షాక్ అవుతాడు..


ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని మనోజ్ వస్తాడు అయితే హాల్లో ఉన్న బాలు దగ్గరికి వెళ్లి నేరుగా బాలు కాలర్ పట్టుకుని నా భార్యను అన్నావు అందుకే నా భార్య ఇంట్లోంచి వెళ్లిపోయింది అసలు నువ్వెవరు నా భార్యనుఅనడానికి నువ్వు ఎవరు? అంటూ కాలర్ పట్టుకుంటాడు. నువ్వు చేసిన మోసని భరించలేక నీ భార్య వెళ్ళిపోయింది అంతేకానీ నేను ఏదో అన్నానని కాదు అది నువ్వు గుర్తు పెట్టుకొని ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. అప్పుడే సత్యం అక్కడికి వచ్చి కొట్టుకొని చావండి లాగా ఉందా అసలు రోహిణికి ఏమైందన్న విషయం తెలుసుకోకుండా ఇలా కొట్టుకుంటున్నారు కొంచమైనా మీకు బుద్ధుందా ఇంకెన్నాళ్లు ఇలా కొట్టుకుంటారు..

ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం బాలునే అని ప్రభావతి అంటుంది అలాగే శృతి కూడా రోహిణి వెళ్ళిపోవడానికి బాలునే కారణమని అనగానే సత్యం ఇదంతా కాదు ముందు రోహిణి ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి అని మనోజ్ ని బాలుని బయటకు పంపిస్తాడు. వాళ్ళిద్దరూ రోహిణిని వెతుకుతూ ఉంటారు అయితే కేపీ పాలెం బస్సు ఎక్కిందని పార్లర్లో ఒక అమ్మాయి చెప్పడంతో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. మీనా ఫోన్ చేస్తే మీనా కూడా రమ్మని బాలు అంటాడు. ఇక ప్రభావతి మనోజ్ కి ఫోన్ చేసి రోహిణి దొరికిందా అని అడుగుతుంది. లేదమ్మా ఎక్కడికో వెళ్ళిందంట దొరకలేదు అని మనోజ్ అవుతాడు. నేను ఒక్కడినే వెళ్లి వెతుకుతాను కదా ఈ బాలుని ఎందుకు పంపించావ్ వీడు అడుగడికి నా తల తింటున్నాడు అని మనోజ్ అంటాడు. అన్ని ఊర్లు తెలిసింది వాడికి ఒక్కడికే వాడు ఏమన్నా ఒక చెవుల విని ఇంకొక చెవుతో వదిలేసేయాలి అని ప్రభావతి అంటుంది..  అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో సుగుణమ్మ దగ్గర రోహిణి ఉంటుంది. రోహిణి గురించి నిజం తెలిసి పోతుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×