E-Paper
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు రవి క్షమాపణలు .. తండ్రిని ఎదిరించిన శృతి .. సత్యం రిలీజ్ ?

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు రవి క్షమాపణలు .. తండ్రిని ఎదిరించిన శృతి .. సత్యం రిలీజ్ ?
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు రాజేష్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఎక్కడున్నా అసలు వదలకుండా చూసి తీసుకురండి ఒకవేళ దొరికితే వెంటనే నాలుగు తగిలించి పోలీస్ స్టేషన్ కి తీసుకురండి అనేసి బాలు రాజేష్ తో మాట్లాడుతాడు. బయటినుంచి బాలు సత్యం కోసం టిఫిన్ తీసుకొని వస్తాడు. మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే ఎలా నాన్న అనేసి బాలు అడుగుతాడు. అక్కడికి వచ్చిన మీనాను ఇంకా ఏం చూస్తున్నావే పాపిష్టిదానా. ఎక్కడ ఉండాల్సిన మనిషిని ఎక్కడ పడేశావే. ఇలాంటి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడే నా భర్త. నీకు కనీసం ఆ విశ్వాసం కూడా లేదా. నేను అప్పుడే తలబాదుకుని చెప్పాను. మృదుల పిలిచి సారీ అక్క. వాళ్లు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. మీ పరిస్థితి తెలిసి కూడా చెప్పకపోతే తప్పు అవుతుంది అని మృదుల అంటుంది. ఎక్కడున్నారో మీనాకు నిజం చెప్పేస్తుంది.. సంజు వాళ్ళ నాన్నకు నిజం తెలిసిపోతుంది . దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది ..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కొడుకు మాట‌లు విని నీల‌కంఠం ఆవేశ‌ప‌డ‌తాడు. సురేంద్ర‌కు ఫోన్ చేస్తాడు. శృతి లేచిపోయిన విష‌యం నీల‌కంఠానికి తెలిసింద‌ని భ‌య‌ప‌డిన సురేంద్ర ఫోన్ లిఫ్ట్‌చేయ‌డు. కోపం ప‌ట్ట‌లేక‌పోయిన నీల‌కంఠం.. సంజు పెళ్లిలో అత‌డి ప‌క్క‌న పెళ్లికూతురిగా శృతినే కూర్చోవాల‌ని త‌న మ‌నుషుల‌కు ఆర్డ‌ర్ వేస్తాడు. శృతిని ఎక్క‌డున్న వెతికి తీసుకుర‌మ్మ‌ని చెబుతాడు.రవి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఫోన్ చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే శృతి లేస్తుంది . ఇంటికి వెళ్ళొస్తాను అని శృతితో అంటాడు. దానికి శృతి వద్దని చెబుతుంది. అప్పుడే మీనా తలుపు కొడుతుంది ఎవరో వచ్చారని అనుకుంటుంది. తలుపు తియ్యగానే మీనా కనిపిస్తుంది . మీనాను చూసి షాక్ అవుతారు.

Advertisement

మీనాను చూసిన రవి వదిన నువ్వు ఇక్క‌డ అని మ‌ధ్య‌లోనే మాట ఆపేస్తాడు. ఏ రాలేన‌నుక‌కున్నారా…నాతో ఇంటికివ‌స్తాన‌ని అబ‌ద్ధం చెప్పి ఇక్క‌డికి వ‌చ్చి త‌ల‌దాచుకున్నారా సిగ్గుగా లేదా అంటూ ర‌వికి క్లాస్ ఇస్తుంది మీనా. ఇంట్లో చిన్న‌వాడివ‌ని నిన్ను కొడుకులా చూసుకున్నాన‌ని, మీ ప్రేమ కోసం ఇంట్లోవాళ్లంద‌రితో పోరాడాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని అంటాడు. నీ పెళ్లి నా చేతుల‌తోనే చేయాల‌ని ఆశ‌ ప‌డ్డాన‌ని మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. చివ‌ర‌కు నీ దొంగ‌పెళ్లికి నాతో సంత‌కం పెట్టించి న‌న్ను పావుగా వాడుకున్నావ‌ని మీనా క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. స‌త్యంపై సురేంద్ర కిడ్నాప్ కేసు పెట్టాడ‌ని, మావ‌య్య‌ను అరెస్ట్ చేసి లాక‌ప్‌లో ఉంచార‌ని జ‌రిగిన సంగ‌తి ర‌వి, శృతికి చెబుతుంది మీనా.

ఆయ‌న‌కు ఎందుకు ఇంత శిక్ష ప‌డాలి…నిన్ను క‌న్నందుకా…నీకు న‌చ్చిన చ‌దువు చెప్పినందుకా అంటూ ర‌వికి క్లాస్ ఇస్తుంది మీనా. పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఎవ‌రైనా క‌న్న‌తండ్రిపై ఇలా ప‌గ‌తీర్చుకుంటారా అని ర‌విని దులిపేస్తుంది మీనా. న‌న్ను క్ష‌మించ‌మ‌ని మీనా కాళ్లు ప‌ట్టుకుంటాడు ర‌వి. శృతి కూడా మీనాకు క్ష‌మాప‌ణ‌లు చెబుతుంది. మీనా వెంట ర‌వి వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు. శృతి కంగారుప‌డుతుంది. వ‌ద్ద‌ని అంటుంది. నేను ఇప్పుడు వెళ్ల‌క‌పోతే స‌త్యం కొడుకుగా తాను చ‌నిపోయిన‌ట్లేన‌ని ర‌వి అని శృతితో చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మీనా పోలీస్ స్టేష‌న్ ద‌గ్గ‌ర క‌నిపించ‌క‌పోవ‌డంతో మౌనిక కంగారుప‌డుతుంది. నువ్వు చేసిన అవ‌మానం త‌ట్టుకోలేక‌పోయింద‌ని, ఎక్క‌డికి వెళ్లిందో చూసిర‌మ్మ‌ని బాలుతో అంటుంది మౌనిక‌. కానీ బాలు అందుకు ఒప్పుకోడు.

Advertisement

అప్పుడే మీనా రవి శృతిలు రావడం చూస్తారు . ర‌వి, శృతిల‌ను తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తుంది మీనా. రవిని చూడ‌టంతోనే బాలు ఆవేశం ప‌ట్ట‌లేక‌పోతాడు. ర‌విని చిత‌క‌బాదుతాడు. ఎస్ఐ వ‌చ్చి బాలును ఆపుతాడు. మీనా మాట‌లు విని మ‌న కుటుంబం మొత్తం తీసేసావ‌ని, తండ్రిని జైలు పాలు చేశావ‌ని ర‌విపై ప్ర‌భావ‌తి ఫైర్ అవుతుంది. మనోజ్ , రోహిణి ఇలా అందరు కూడా తనని మాటలతో కోపడతారు.. మీనా ఏం చెప్పి మీ ఇద్ద‌రి పెళ్లి చేసింద‌ని, త‌ను ఇచ్చిన ధైర్యంతోనే ఈ పెళ్లిచేసుకున్నావా అని ర‌విని నిల‌దీస్తుంది ప్ర‌భావ‌తి. బాలు కూడా మీనానే వారి పెళ్లి చేసింద‌నే భ్ర‌మ‌ప‌డి భార్య‌ను త‌ప్పుప‌డ‌తాడు. మీనా ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ర‌వి, శృతి వాదించిన బాలు, ప్ర‌భావ‌తి విన‌రు.

ఇక శృతి వచ్చిన విషయం తెలుసుకున్న సురేంద్ర‌, శోభ‌న కూడా ర‌విపై కోప్ప‌డుతారు. నా కూతురికి మాయ మాట‌లు చెప్పి కిడ్నాప్ చేసిన‌ నిన్ను వ‌దిలిపెట్ట‌మ‌ని, మీ తండ్రితో పాటు నిన్ను జైలుకు పంపిస్తాన‌ని ర‌వికి వార్నింగ్ ఇస్తాడు. నీతో పాటు మీ ఫ్యామిలీలో ఎవ్వ‌రిని వ‌దిలిపెట్ట‌న‌ని అంటాడు. ఇంకోసారి మా నాన్న గురించి త‌ప్పుగా మాట్లాడితే ఊరుకోన‌ని సురేంద్ర‌కు బాలు వార్నింగ్ ఇస్తాడు. ఇక శృతి నన్ను ఎవరు కిడ్నప్ చెయ్యలేదని చెబుతుంది. స‌త్యాన్ని పోలీసులు విడుద‌ల‌చేస్తారు. జ‌రిగిన సంగ‌తి తండ్రికి చెప్ప‌బోతాడు ర‌వి. కానీ స‌త్యం కొడుకును దూరంగా తోసేస్తాడు. స‌త్యంతో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యులంద‌రూ కారు ఎక్కి వెళ్ళిపోతారు. ఇక మీనా రేపు ఇంటికి వెళ్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి ..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×