E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఒక్కటైన ధీరజ్, ప్రేమ.. అందరికి సాగర్ గిఫ్ట్స్.. రామరాజు మాటతో దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episode: ఒక్కటైన ధీరజ్, ప్రేమ.. అందరికి సాగర్ గిఫ్ట్స్.. రామరాజు మాటతో దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 15th: సాగర్ కి డబ్బులు ఇచ్చిన సేటు భాగ్యం చెప్పడంతో రామరాజు దగ్గరికి వెళ్తాడు. ఆ రామరాజు మాత్రం తన కొడుకు చేసినప్పుడు నేనెందుకు తీరుస్తాను వెళ్లి తనని అడగండి అని ఎంత చెప్తున్నా సరే.. సేటు మాత్రం మీరు నన్ను మోసం చేయకండి అని అడుగుతాడు. మీ అబ్బాయి అని నమ్మకంతోనే నేను ఇచ్చాను అని అంటాడు. ఇక రామరాజు చేసేదేమీ లేక సాగర్ తో ఈ విషయం గురించి మాట్లాడాలి అని కోపంగా ఇంటికి వస్తాడు. అటు సాగర్ మాత్రం తనకి జీతం వచ్చిందన్న ఆనందంలో అందరికీ బట్టలు కొనుక్కొని తీసుకొని వెళ్తాడు.వల్లి చందు కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. చందు రిప్లై ఇవ్వకుండా ఉంటాడు. వల్లి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది.

ప్రేమ కు క్షమాపణలు చెప్పిన ధీరజ్..

ప్రేమ ఇదంతా చేయలేదని తెలుసుకున్న ధీరజ్ ఎలాగైనా సరే తనకు క్షమాపణలు చెప్పాలని అనుకుంటాడు. అయితే ప్రేమ దగ్గరికి వెళ్లి ఇది నేను చేయలేదు అని నువ్వు చెప్పొచ్చు కదా ఎందుకు నేను అన్న మాటలు అన్ని పడ్డావు అని అంటాడు. నేను ఇది చేయలేదు అని అంటే నువ్వు నమ్మవు.. నాకు నా చెల్లెలు మీద ఉన్న ప్రేమ నన్ను అలా మార్చేసింది. కానీ నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు అని ధీరజ్ అడుగుతాడు.. నా తప్పు లేదు అని నేను చెప్పాలి అంటే మీ వదిన గురించి ముందు బయట పెట్టాలి. నా వల్ల ఒక జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు అని ప్రేమ అనగానే నువ్వు ఎంత మంచి దానివే అని ధీరజ్ తనకి క్షమాపణలు చెప్తాడు. ఎందుకు ఇలా చేశావు అని ఇద్దరు మాట్లాడుకొని ఒకటైపోతారు.

కొత్త బట్టలు తెచ్చిన సాగర్..

Advertisement

రామరాజు సాగరా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సేటు నలుగురిలో ఉన్నాను నిలబెట్టి అడిగాడు అని రామరాజు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే అప్పుడే ఇంట్లోకి సాగర్ చాలా సంతోషంగా వస్తాడు.. ఇంట్లోని వాళ్ళందరిని పిలిచి అందరికీ బట్టలు ఇవ్వాలని అనుకుంటాడు. ఇక అందరికీ బట్టలు ఇవ్వగానే.. అయితే అందరూ కూడా చాలా సంతోషంగా బట్టలు చాలా బాగున్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటిసారి నేను నా జీతంతో అందరికీ బట్టలు తీసుకొచ్చాను అని నాకు చాలా సంతోషంగా ఉంది అని సాగర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. అయితే సాగర్ నాన్న కోసం కూడా నేను బట్టలు తీసుకొచ్చాను అని అంటాడు. ఇక నాన్నకి బట్టలు ఇస్తాను అని సాగర్ బయటకు వెళ్తాడు.

సాగర్ ను అవమానించిన రామరాజు..

సాగర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న నా మొదటి జీతం వచ్చింది మీకోసం నేను బట్టలు తీసుకొచ్చాను అని అంటాడు. పాపపు సొమ్ముతో నాకోసం బట్టలు తీసుకొచ్చావా అని రామరాజు అనగానే సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు ఎవరి దగ్గర అయితే వడ్డీ తీసుకొని జాబ్ తెచ్చుకున్నావో వాళ్లకి డబ్బులు ఇవ్వలేదు అని నన్ను అడిగారు. ఆ విషయం నీకు తెలుసా అని రామరాజు అంటాడు. ఆ వడ్డి విషయం నేను చూసుకుంటాను నాన్న మీరేం కంగారు పడకండి అని సాగర్ అంటాడు.. కానీ రామరాజు మాత్రం నడిరోడ్డులో ఆ సేటు నన్ను అడిగాడు నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అని రామరాజు అంటాడు.. సాగర్ ఎంత చెప్తున్నా సరే రామరాజు మాత్రం అస్సలు వినడు..

శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. 

Advertisement

పాపపు సొమ్ముతో తెచ్చిన బట్టలని నేను తీసుకోవాలా ఏం మాట్లాడుతున్నావ్ రా అని రామరాజు సాగర్ కి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. ఈ బట్టలు ఇంట్లో ఉన్న కూడా నాకు అదే గుర్తుకు వస్తుంది అని ఆ బట్టలని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు రామరాజు. అది చూసినా సాగర్ కోపంతో రగిలిపోతాడు. రామరాజు కోపానికి కారణం దొరికిపోయింది. ఆ నర్మదకు ఈ దెబ్బతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని శ్రీవల్లి భాగ్యం ఆనందరావు దొంగ చాటుగా చూస్తూ హ్యాపీగా ఉంటారు.. నర్మదకి ఎన్ని రోజులకి మంచి దెబ్బ కొట్టాము అని సంతోషంగా ఉంటుంది శ్రీవల్లి.

సాగర్ కు నర్మద క్లాస్..

సాగరు చూసావా నర్మదా ఆయన నేను ఎంతో ప్రేమతో తెచ్చిన బట్టల్ని కాల్చివేశాడు. నేను తెచ్చిన ఆ బట్టలను చూస్తుంటే ఆయనకు పదేపదే దొంగతనం గుర్తుకొస్తుందట. ఇంతగా అవమానాలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఆరోజు నువ్వు అడ్డుపడ్డావు కాబట్టి ఆగాను.. ఇప్పుడు నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి కదా పద వెళ్లిపోదామని సాగర్ ఎంత చెప్తున్నా సరే.. నర్మద మాత్రం ఏంటి సాగర్ కోపంలో ఏదో అంటే అది పట్టించుకుంటావా అని అంటుంది. నేనెంత బాధపడాలని ఆలోచించవా అని నర్మదా కూడా అంటుంది. ఏంటి నువ్వు కూడా నాకు క్లాస్ పీకుతున్నావా..? నాతో వస్తావా రావా అని సాగర్ నర్మదకు వార్నింగ్ ఇస్తాడు. అయితే సాగర్ మాత్రం ఎంత చెప్తున్నారు నర్మద వినదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి షాకిచ్చిన చక్రధర్.. భరత్ కు రాజేశ్వరి ఉద్యోగం.. శ్రీయ, పల్లవి వార్..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×