E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు రింగ్ పెట్టిన ధీరజ్.. శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన విశ్వక్.. ఎంగేజ్మెంట్ జరుగుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు రింగ్ పెట్టిన ధీరజ్.. శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన విశ్వక్.. ఎంగేజ్మెంట్ జరుగుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ఇదంతా చేసిందని కోపంగా ఉంటాడు ధీరజ్.. అప్పుడు అక్కడికి వచ్చిన వేదవతి వాడిని ఎందుకురా ఆడుకుంటున్నారు. మీరంతా ఇంకా ఇలా ఉన్నారేంటి పెళ్లి వాళ్ళు వస్తుంటే అని వేదవతి అరుస్తుంది. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా వేదవతి చెప్పిన మాట విని వెళ్లిపోతారు. మీ నాన్న పిలుస్తున్నారు వెళ్ళండి అని వేదవతి చెప్పగానే ముగ్గురు అక్కడికి వెళ్లిపోతారు. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రామరాజుని ఏంటి పిలిచారు అంట అని అడుగుతారు. నిన్ను పిలవలేదు కదరా నా కొడుకులు మాత్రమే పిలిచాను కదా అని రామరాజు అంటాడు.. మూడు గంటలకి రామరాజు మూడు పనులు చెప్పాడు..

సాగరు కొట్టు వాడికి లక్ష రూపాయలు ఇవ్వలేదని రామరాజు అడుగుతాడు.. ఎందుకు ఇవ్వలేదు రాణి రామరాజు ఎంతగా అడిగినా సరే సాగర్ మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటాడు. వేదవతి వాడు ఏమన్నా చిన్నపిల్లడా ఎందుకు వాడిని అలా అంటున్నారు.. మీరు ముందు నిశ్చితార్థం గురించి ఆలోచించండి అని వేదవతి అనగానే సాగర్ అమ్మ వచ్చినాను బతికించింది అని అనుకుంటాడు. ఇక ప్రేమ నేనిచ్చిన టీ షర్టు కి ధీరజ్ రియాక్షన్ మారిపోయి ఉండాలి. కానీ ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే చాలా కోపంగా ధీరజ్ అక్కడికి వస్తాడు.. ప్రేమ ధీరజ్ వస్తున్నాడని తెలుసుకొని నిద్రపోయినట్లు నటిస్తుంది.. సీరియస్ గా వచ్చిన ధీరజ్ ప్రేమను నీళ్ళు కొట్టి మరీ లేపుతాడు.. ఇద్దరు గొడవపడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. టీ షర్ట్ పైన నువ్వు రాసింది ఏంటి అని అడుగుతున్నాడు.. నువ్వు మాత్రం నేను రాసిందని ఎందుకు చించేసావు అని అనగానే ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు.. ఆ తర్వాత ప్రేమ మాత్రం ధీరజ్ ని ఒక ఆట ఆడుకుంటుంది.. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని ప్రేమని అడిగితే మనిద్దరిని ఎవరు విడగొట్టలేరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు అని ప్రేమ. అయితే నువ్వు వెంటనే నాకు సారీ చెప్పాలని ప్రేమ అనగానే సారీ చెప్తాడు. తర్వాత ప్రేమ ను తీసుకుని షాప్ కి వెళ్ళమని రామరాజు గెట్టిగా అరుస్తాడు.. వెళ్తున్నాను నాన్న అని ధీరజ్ అంటాడు.. నాన్న లక్ష రూపాయలు గురించి అడగడం నాకు చాలా భయమేసింది. నిజం చెప్తాను అని కంగారు పడిపోయాను. కానీ నేను అమ్మ రావడం వల్ల తప్పించుకున్నాను అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే నర్మద వచ్చి మావయ్య గారు లక్ష రూపాయల గురించి అడిగారు కదా నీకు అంత డబ్బులు ఏమి అవసరం వచ్చింది అని అడుగుతుంది. సాగరు మా ఫ్రెండ్ కి అవసరమైతే ఇచ్చాను వాడు ఇంకా నాకు ఇవ్వలేదు అది ఎలాగైనా సరే తీసుకొని నాన్నకు ఇస్తాను అని అంటాడు. నర్మదకు మాత్రం సాగర్ అబద్దం చెప్తున్నాడని అనుమానిస్తుంది.

ఇక ప్రేమ ధీరజ్ లు ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం షాప్ కు వెళ్తారు. ఇద్దరు గొడవ పడుతూ వెళ్తారు.. ఆఖరికి షాప్ లోకి వెళ్లిన తర్వాత కూడా ఉంగరాల కోసం కొట్టుకుంటారు. షాప్ అతను కూడా వీరిద్దరూ గొడవ పడటం చూసి షాక్ అవుతాడు.. కోసమని ఒక రింగు ని సెలెక్ట్ చేసిన ధీరజ్ ప్రేమ వేలుకి పెడతాడు. దాంతో ప్రేమ చాలా సంతోషంగా ఉండిపోతుంది. ఈ రింగ్ ని ఎట్టి పరిస్థితులను నా వేలు నుంచి తీయకూడదు అంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ధీరజ్ మాత్రం ఆ వేలుకు పెట్టిన ఉంగరం తీసి షాప్ అతనికి ఇవ్వాలి అని అనుకుంటాడు.. ప్రేమ షాప్ అతన్ని మేనేజ్ చేస్తుంది ఉంగరం రావట్లేదని అతను కూడా చెప్పడంతో ధీరజ్ ఉండనివ్వండి వేరే తీసుకుంటాను అని అంటాడు..

Advertisement

శ్రీవల్లి ఏ చీర కట్టుకోవాలని చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటుంది.. కానీ అప్పుడే విశ్వం తనకి ఫోన్ చేసి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తాడు. ఎంగేజ్మెంట్ కి నువ్వు కూడా రెడీ అవ్వడానికి ట్రై చేస్తున్నావా ? నువ్వు ఎంగేజ్మెంట్ గనుక ఆపలేదనుకో నీ బండారు మొత్తం బయట పెడతాను అని విశ్వం అంటాడు.. మాట వినగానే షాక్ అయిన శ్రీవల్లి ఏదో ఒకటి చేస్తాను నా ఫోన్ పెట్టరా బాబు అని అంటుంది.. వెంటనే భాగ్యంకి ఫోన్ చేసి ఆ విశ్వం గాడు ఒక ఆట ఆడుకుంటున్నాడు అందరు రెడీ అవుతున్నారు నేను మాత్రం రెడీ అవ్వలేకపోతున్నాను అని అంటుంది. ఆ తర్వాత భాగ్యం నువ్వేం కంగారు పడక మడవు నువ్వు మంచిగా రెడీ అవ్వు.. నేను వచ్చి అక్కడ చక్రం తిప్పుతాను అని అంటుంది..

Also Read : అవనిని అవమానించిన భానుమతి.. కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి..నెక్స్ట్ ఏంటి..?

ఇక ప్రేమ తన పుట్టింటి నగలను పెట్టుకుని ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటుంది… మా అమ్మ చెప్పినట్లుగా నేను ఈ నగలతో ఎప్పుడు మహాలక్ష్మి లాగా సంతోషంగా ఉండాలి అని తెగ మురిసిపోతూ ఉంటుంది.. ప్రేమను నగల్లో చూసిన ధీరజ్ ఈ నగలు నా జీవితాన్ని మార్చేశాయి అంటూ తన జీవితంలో జరిగిన వాటిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమతో ఆ నగలు నా జీవితాన్ని మార్చేశాయి నువ్వు ముందు ఆ నగల్ని తీసేయని అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×