E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్, నర్మదల రొమాన్స్.. ఇంట్లోవి దోచుకునేందుకు కామాక్షి ప్లాన్.. వేదవతి టెన్షన్..

Illu Illalu Pillalu Today Episode: సాగర్, నర్మదల రొమాన్స్.. ఇంట్లోవి దోచుకునేందుకు కామాక్షి ప్లాన్.. వేదవతి టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 16th: నిన్నటి ఎపిసోడ్ లో..  ప్రేమ తన పుట్టింటి నగలను పెట్టుకుని ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటుంది… మా అమ్మ చెప్పినట్లుగా నేను ఈ నగలతో ఎప్పుడు మహాలక్ష్మి లాగా సంతోషంగా ఉండాలి అని తెగ మురిసిపోతూ ఉంటుంది.. ప్రేమను నగల్లో చూసిన ధీరజ్ ఈ నగలు నా జీవితాన్ని మార్చేశాయి అంటూ తన జీవితంలో జరిగిన వాటిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమతో ఆ నగలు నా జీవితాన్ని మార్చేశాయి నువ్వు ముందు ఆ నగల్ని తీసేయని అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ షాక్ అవుతుంది.. ఎవరైన భార్య నగలను పెట్టుకొని అందంగా రెడీ అయింది అంటే చూసి మురిసిపోతారు.

కానీ నువ్వు మాత్రం ఆ నగలను తీసేయ్ అని అంటున్నావు నీకు కొంచమైనా ఉందా అని ప్రేమ తిడుతుంది.. ధీరజు ఆ నగలను చూస్తూ ఉంటే నాకు మాత్రం చాలా కోపంగా ఉంది ముందు నువ్వు ఆ నగల్ని తీసేస్తావా లేదా అని ప్రేమ పై సీరియస్ అవుతాడు. ఎందుకురా ఏమైంది అని అంటే ఆ నగల వల్ల నా జీవితం నాశనమైంది ఆ విషయం నువ్వు గుర్తుంచుకుంటే మంచిది అని ధీరజ్ అంటాడు. ఆ నగల కోసమే నేను నిన్ను ట్రాక్ చేసి పెళ్లి చేసుకున్నానని మీ వాళ్ళు నన్ను దారుణంగా అన్నారు. అంతే కాదు ఆ నగల వల్లే మా నాన్న ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ముందు ఆ నగలను తీసేయ్ అంటాడు. ప్రేమ ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్ నర్మదా రెడీ అవుతుంటే అక్కడికి వస్తాడు. మల్లెపూల వాసన వల్ల నర్మదా సాగర్ వచ్చాడని కనిపెడుతుంది. నేను వచ్చినట్టు కూడా నీకు తెలియదు కదా మరి ఎలా కనిపెట్టావు అని సాగర్ అడుగుతాడు. నీకు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా మల్లెపూలు తెస్తావ్ కదా స్వామి ఆ వాసనకి నువ్వు వచ్చావని కనిపెట్టాను అని నర్మదా అంటుంది. ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఏంటి నువ్వు మల్లెపూలు తీసుకురావడం ఏంటి అని నర్మదా అడుగుతుంది.. ఒకపక్క ఎంగేజ్మెంట్ జరుగుతుంటే తొందరగా కానీ ఇవ్వు అని అనగానే సాగర్ అవునా అయితే బెడ్ సర్దూతాను అని అంటాడు..

నర్మదా సాగని బయటికి తోసేస్తుంది. కామాక్షి బయట తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తిరుపతి వచ్చి ఏంటమ్మా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అంటాడు.. ఏం లేదు మావయ్య మా ఆయన వస్తున్నాడు అందుకే వెయిట్ చేస్తున్నానని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ ఇంటి గుమ్మం వరకి వచ్చినవాడు ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతాడు ఏంటి నీ పిచ్చి కాకపోతే అని తిరుపతి అంటాడు.. కానీ కామాక్షి మాత్రం నీకెందుకు మామయ్య నువ్వు వెళ్ళు మా ఆయన కోసం నేను వెయిట్ చేయాలి అని అంటుంది.

Advertisement

ఇక ఆటో వచ్చి ఆగగానే కామాక్షి వాళ్ళ భర్త అందులోంచి దిగుతాడు. అయితే కామాక్షి మాత్రం పెద్ద సూట్కేస్ తీసుకు రమ్మని చెప్పాను కదా ఈ చిన్న సూట్ కేస్ తీసుకొచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. ఈ సూట్ కేస్ కే మా అమ్మమ్మ నాన్న ఎక్కడికి రా ఈ సూట్ కేస్ అని అడిగారు. ఇంకా పెద్దది తెస్తే నా పరువు పోతుంది అని వాళ్ళ భర్త అంటాడు.. ఆ సూటుకేసు తో లోపలికి వస్తున్న కామాక్షిని తిరుపతి ఆపుతాడు. ఇదేంటమ్మా ఇంత పెద్ద సూట్కేస్ తెచ్చావ్ ఎంగేజ్మెంట్ అయిపోగానే వెళ్ళిపోతారు కదా.. ఈ ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసులో బట్టలు అని తిరుపతి అడుగుతాడు.

ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నావ్ నా చెల్లి ఎంగేజ్మెంట్ అంటే ఇంకా మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉండాలని అర్థం. ఆమాత్రం కూడా మీకు తెలియదా అని కామాక్షి అంటుంది.. వెళ్ళిపోతావని అనుకున్నాం కానీ నువ్వు వెళ్ళిపోలేదు కదా ఇది నా ఇల్లు నా ఇష్టం అని కామాక్షి అక్కడున్న వాటిని అన్నిటిని దాచుకొని దోచుకుంటుంది. ఎంగేజ్మెంట్లో ఏవి దొరికితే అవి నా వస్తువులే అని ఆ సూట్ కేస్ లో పెట్టుకుంటుంది. ఆఖరికి డెకరేషన్ చేసిన ఫ్లవర్స్ ని కూడా వదలకుండా కామాక్షి సంచిలో సర్దుకుంటుంది.

ఇక ఈ ఎంగేజ్మెంట్ అయిపోయేంతవరకు ఎవరు కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదు అని రామరాజు అంటాడు. అంతలోకే పెళ్లి వాళ్ళు వస్తారు. వాళ్లని తీసుకొని లోపలికి వెళ్ళిన రామరాజు ఇంట్లోని వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు. వేదవతి మాత్రం తన కూతురి ఎంగేజ్మెంట్ ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడున్న దీపాలన్ని ఆరిపోవడంతో ఇదేదో అపశకునం లాగా అనిపిస్తుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బయటకు వెళ్లిన వేదవతి భద్రను చూసి కంగారు పడిపోతూ ఉంటుంది.. మా కూతురి పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని అనుకున్నాము కానీ ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందో లేదో అని కంగారు పడిపోతూ ఉంటుంది.

ఇక రామరాజు తన కుటుంబ సభ్యుల్ని పెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తాడు. ఎదవతి ఇంట్లో లేకపోవడంతో నర్మదను వెళ్లి వేదవతిని తీసుకురమ్మని చెప్తాడు. బయటికి వెళ్లినా నర్మదాప్రేమ వేదవతిని తీసుకురావడానికి ఎక్కడుందని వెతుకుతారు. అయితే వేదవతి తన పుట్టింటిని చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అది చూసినా నర్మదా కూతురు పెళ్లి అంటే నువ్వు సంతోషంగా ఉండాలి కదా ఎందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతుంది.. నా కూతురు పెళ్లి జరుగుతుంటే నాకు ఆనందంగా ఉండాలి కానీ ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని భయంగా ఉంది అని వేదవతి అంటుంది.

Also Read :పల్లవి కోరికను తీర్చిన అక్షయ్..అవని పై పార్వతి సీరియస్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..

మీరేమీ భయపడకండి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు బాలు కూడా చాలా మంచి వాళ్ళు ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని నర్మద వేదవతిని తీసుకొని లోపలికి వెళుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ప్రేమను ధీరజ్ బ్రతిమలాడుతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×