E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తిరుపతికి షాక్… ధీరజ్ ను ఆడుకున్న ప్రేమ.. పెళ్లి సంబంధం చెడగొట్టిన భాగ్యం..

Illu Illalu Pillalu Today Episode: తిరుపతికి షాక్… ధీరజ్ ను ఆడుకున్న ప్రేమ.. పెళ్లి సంబంధం చెడగొట్టిన భాగ్యం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కదా.. వారందరినీ మళ్లీ సంతోషంగా ఉండేలా చేయాలని అంటుంది. నర్మదా ఇలా చేయకపోతే కచ్చితంగా నీ బండారం బయటపడుతుంది అని అనగానే.. శ్రీవల్లి చేసేదేమీ లేదు అని ఇంట్లోనే వాళ్ళని పిలిచి అమూల్య పెళ్లి కదా అందరం సంతోషంగా ఉందామని అంటుంది. అమూల్య కొద్ది రోజులు వెళ్ళిపోతుంది కదా మనం అందరితోపాటుగా సంతోషంగా ఉండాలి అని అంటుంది. మొదట వల్లి ఏమంటుందో అర్థం కాకపోయినా కానీ తర్వాత మాత్రం అందరూ వల్లి మాటే నిజమని అనుకుంటారు.. ఆ తర్వాత రామరాజు ఒప్పుకోవడంతో అందరితో శ్రీవల్లి అంతాక్షరి పెడుతుంది.

ఇంట్లోని వాళ్ళందరూ కూడా సరదాగా పాటలు పాడుతూ ఉంటారు. అమూల్య పెళ్లి కాబట్టి అందరూనవ్వుతూ ఉండాలని అనుకుంటారు.. ఆ తర్వాత వీళ్ళందరూ పాటలు పాడుతూ సరదాగా ఉంటుంటే భాగ్యం ఆనందరావు ఇంట్లోకి సడన్గా ఎంట్రీ ఇస్తారు. ఏంటి మీరిద్దరూ సడన్గా ఇలా ఊడిపడ్డారు అని శ్రీవల్లి అంటుంది.. అమూల్య పెళ్లి అయ్యేంతవరకు నిన్ను ఈ పక్కకు రావద్దని చెప్పాను కదా. మరి ఎందుకు మీరిద్దరూ ఇట్లా వచ్చారు అని శ్రీవల్లి సీరియస్ అవుతుంది.. ఒకసారి అటు చూడు అని విశ్వంను చూపిస్తుంది భాగ్యం.. మమ్మల్ని పట్టుకున్నాడు అందుకే మేము ఇలా మళ్లీ రావాల్సి వచ్చింది అని భాగ్యం జరిగిందంతా చెబుతుంది దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..కాలికి పోయే తీగని ఇలా తగిలించుకోవడం అంటే ఇదే.. నా నెత్తిన తెచ్చిపెట్టారు ఇప్పుడు నేను బాధపడాలి అని శ్రీవల్లి అంటుంది.. ఆ తర్వాత రామరాజు పెళ్లి చూపులు వాళ్ళు వస్తున్నారని వేదవతి తో అంటాడు. ఈ పెళ్లి జరిగితే అమూల్య జీవితం బాగుంటుంది అని అంటాడు.. అయితే అమూల్య సంతోషం కన్నా మనకు ఏం కావాలండి మీరు ఎలా చెప్తే అలానే చేద్దాం అని వేదవతి అంటుంది. ఆ తర్వాత తిరుపతి తన సౌందర్య లహరి తో ఫోన్ మాట్లాడుతాడు.. అతను మాట్లాడడం వినిన అల్లుళ్ళు ఆటపట్టిస్తారు.. ఒకసారి ఈ వీడియో కాల్ చేయవా అని సౌందర్యలహరిని తిరుపతి అడుగుతాడు.. కానీ సాయంత్రం కలుద్దాము అని తను చెప్తుంది.. మామ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నాడు అసలు ఎవరు ఆవిడ అనేది తెలుసుకోవాలి అని అనుకుంటారు.

ఇకపోతే తిరుపతి మాత్రం నా సౌందర్యలహరిని సాయంత్రం చూడబోతున్నాను నాకు సిగ్గేస్తుంది అబ్బా ఇప్పటినుంచే పౌడర్ కొట్టుకొని రెడీగా ఉంటాను అని అంటాడు.. ఆ తర్వాత అందరూ కలిసి తిరుపతి గర్ల్ ఫ్రెండ్ ని చూడాలని అనుకుంటారు. ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా గొడవ పడుతూనే ఉంటారు.. ధీరజ్ ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి ప్రేమ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది.. కానీ ధీరజ్ మాత్రం నువ్వు నా దగ్గరికి రావద్దు అన్నట్లుగా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.. ఉయ్యాల వెళ్లి ధీరజ్ కూచుంటే ప్రేమ కూర్చోబోతే ఉయ్యాల్ని వెనక్కి జరుపుతాడు.. ప్రేమ కింద పడిపోతుంది.. నన్నే కింద పడేస్తావా ఉండు నీ సంగతి చెప్తాను అని ప్రేమ ధీరజ్ కోసం రామరాజును పిలుస్తుంది..

Advertisement

మామయ్య చూడండి స్వీట్స్ కొనడానికి బయటకు వెళ్దామంటే ఇతను రాను నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని అంటున్నాడు అని ప్రేమ ధీరజ్ని రామరాజు దగ్గర ఇరికిస్తుంది.. ధీరజు అడ్డంగా ఇరుక్కున్ననే అని ఆలోచిస్తూ ఉంటాడు.. నువ్వు వెళ్లి ముందు స్వీట్లు తీసుకురావాలి అమ్మాయికి తోడుగా వెళ్ళు అని రామరాజు బలవంతంగా ధీరజ్ని పంపిస్తాడు.. బండి మీద వెళ్తుంటే ప్రేమ ధీరజ్ నీ కావాలని రెచ్చగొట్టేలా చేస్తుంది.. ధీరజ్ గమ్మున కూర్చోవచ్చు కదా అనేసి అరుస్తూ ఉంటాడు..

పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకోవడానికి దిగిన వీళ్లిద్దరూ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ప్రేమ డబ్బులు ఇవ్వదు. ధీరజు ఇవ్వమని చెప్తున్న సరే ఇవ్వకుండా ఉంటుంది. అక్కడినుంచి ధీరజు వచ్చేస్తాడు.. ప్రేమ బండిని తీసుకొని వస్తుంది. ధీరజ్ నేను రాను అని అంటాడు.. మావయ్య అని ఫోన్ చేస్తుంది దానితో ధీరజ్ బండి ఎక్కుతాడు.. ఇద్దరు కలిసి సరదాగా బండిమీద అలా వెళ్లి స్వీట్స్ కొనుక్కొని వస్తారు.. స్విచ్ షాప్ లో కూడా వీరిద్దరి గొడవతో ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది.. ఇంటికి రాగానే స్వీట్లు తెచ్చాము అని వేదవతితో అనగానే అక్కడ పెట్టి మీరు వెళ్లి రెడీ అవ్వండి అని అంటుంది.. భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా పెళ్లి వాళ్ళు ని రాకుండా అడ్డుకోవాలని అనుకుంటారు.. తప్పులు మార్చుకొని పెళ్లి వాళ్ళకు నిజం చెప్తారు..

Also Read :పల్లవికి షాకిచ్చిన అవని..ఘనంగా సంక్రాంతి సంబరాలు.. నగలను మార్చేసెందుకు పల్లవి కుట్ర..

శ్రీవల్లి మాత్రం పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదే అని చూస్తూ ఉంటుంది.. పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదు ఒకసారి ఎక్కడున్నారో చూడు అని శ్రీవల్లితో అంటారు. అయితే శ్రీవల్లి మాత్రం వాళ్లు ఇక రారు అని అనగానే వేదవతి షాక్ అవుతుంది. అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చారు లేదా వెళ్లి చూడు అని అంటుంది వేదవతి. ఇక శ్రీవల్లి బయటికి వెళ్లి రామరాజు వాళ్ళు టెన్షన్ పడుతుండడం చూసి పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదని అనుకుంటుంది.. వాళ్లు ఇక రారు అని సంతోష్ పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళు రాగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×