E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో.. వల్లి దొరుకుతుందా..? ధీరజ్ కు భద్ర షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్…

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో.. వల్లి దొరుకుతుందా..? ధీరజ్ కు భద్ర షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్…
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 8th: రెండు లక్షలు కావాలి అని ప్రేమ అంటుంది. మేనేజర్ స్టాఫ్ తో చెప్పి ప్రాసెస్ చేస్తుంటాడు.. అప్పుడే సడెన్గా భద్రవతి 2 లక్షలు సరిపోతాయా..?  ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది. అత్త నేను చెప్పేది వినండి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు. ప్రేమ ఎంత చెబుతున్న సరే భద్ర మాత్రం ఇది ఎవరి ప్లాను మాకు తెలుసు పద వెళ్దాం అని బలవంతంగా ప్రేమని తీసుకొని బయటికి వస్తారు. కార్లో ఎక్కించుకొని ప్రేమను ఇంటికి తీసుకోని వస్తారు.. నర్మద తీసుకొచ్చిన రిపోర్ట్స్  రామరాజు చాలా డెప్త్ గా చూస్తూ ఉంటాడు. తిరుపతి ఎంబిబిఎస్ చదివిన డాక్టర్లు కూడా మీ అంతగా రిపోర్టులను చూడరు. అని వెటకారంగా మాట్లాడతాడు. అదే ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. మీకేం తెలియదు టిఫన్ అని వేదవతి కూడా రిపోర్ట్ ని అలాగే చూడడంతో అక్క డాక్టర్ కన్న ఎక్కువగా చూస్తున్నావే అని తిరుపతి సెటైర్లు వేస్తాడు.

కన్నీళ్లు పెట్టుకున్న వల్లి..

అవి తన రిపోర్ట్లు కాకపోయినా వేరే వాళ్ళ రిపోర్ట్లో అయినా సరే… వీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళని నేను ఇలా మోసం చేస్తానని అస్సలు అనుకోలేదు.. నన్ను ఎంతో గొప్పగా చూసుకుంటున్న నా కుటుంబానికి నేను ద్రోహం చేస్తున్నాను అని వల్లి బాధ పడిపోతూ ఉంటుంది.. అది చూసిన వేదవతి ఏంటి వల్లి ఎండలో ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావ్..? అసలే వట్టి మనిషివి కూడా కాదు జాగ్రత్తగా ఉండాల్సిన పని లేదా..? ఉన్నానంటే అన్నాను అంటారు. మరి నువ్వు చేసేదేంటి? కడుపులో ఈ ఇంటి వారసుడిని మోస్తున్నావు.. డాక్టర్ ఏమని చెప్పారు అంతా బాగుందని చెప్పారా అని అడుగుతుంది వేదవతి. ఇక అందరూ కూడా వల్లి గురించి అడగడం చూసి మనసులో బాధ పడిపోతూ ఉంటుంది.

చందు ప్రేమను చూసి వల్లి కన్నీళ్లు..

Advertisement

రైస్ మిల్లుకు వెళ్లిన చందు వల్లి అడిగినట్టు హల్వా తీసుకొని ఇంటికి వస్తాడు. చందు వల్లిని చూసి ఏంటి ఏదో బాధ పడుతున్నావు అని అడుగుతాడు. అమ్మ వాళ్ళు చెప్పారు రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయని డాక్టర్ చెప్పారు అంట కదా.. నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. డాక్టర్లు చెప్పినట్టు వినాలి ఏది పడితే అది తినడానికి వీల్లేదు అని చందు అంటాడు. ఇంతగా మాట్లాడుతున్న నువ్వేంటి మౌనంగా ఉన్నావు అని చందు వల్లి ని అడుగుతాడు. నేను నీతోనే మాట్లాడుతున్నాను అర్థమవుతుందా అని చందు గట్టిగా అరగని ఆ బావ అర్థమైంది అని అంటుంది.. ఏమైంది ఎందుకలా ఉన్నావు? హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఇలా మారిపోయావా ఏం జరిగింది ఏదైనా సమస్య అని అడుగుతాడు.. నా పక్కన ఉండగా నాకేం సమస్య వస్తది బావ అని వల్లి అంటుంది.

చందును లొంగదీసుకోనేందుకు వల్లి ప్లాన్..

తను కడుపుతో లేదన్న నిజం బయటపడితే కచ్చితంగా మా ఆయన నన్ను చంపేస్తాడు అని వల్లి భయపడిపోతూ ఉంటుంది.. ఇక ఇంట్లో వాళ్లకి తెలియకుండా మళ్లీ నేను మా ఆయనతో చాలా సంతోషంగా ఉండాలి.. నా అందంతో మా ఆయన్ని సొంతం చేసుకోవాలి.. నెల తిరిగేలోగా నెల తప్పలి అని అనుకుంటుంది.. అదేవిధంగా వాళ్ళమ్మ చెప్పినట్లు బావతో సంతోషంగా ఉండాలి ఎలాగైనా సరే ఈ నెలలోనే నెల తప్పాలని అనుకుంటుంది. కానీ చందు మాత్రం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే నేను నీకు దగ్గరయ్యాను అని అంటాడు.. ఇలాంటి మొండోడితో నేను కాపురం ఎలా చేయాలి అని వల్లి బాధ పడిపోతూ ఉంటుంది.

రామరాజుకు షాకిచ్చిన భద్ర..

Advertisement

ఒరేయ్ రామరాజు అని భద్ర ప్రేమను తీసుకొని వెళ్లి అక్కడ అరుస్తుంది.. భద్ర అరుపులు విన్న రామరాజు కుటుంబం అంతా బయటకు వస్తుంది.. ప్రేమ అత్త వద్దని ఎంత చెప్తున్నా సరే వినకుండా భద్రావతి రామరాజు కుటుంబాన్ని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. ప్రేమ నగలని తాకట్టు పెట్టాలని అనుకున్న విషయాన్ని మొత్తానికి ధీరజ్ కి తెలిసేలా చేస్తుంది.. మీ ఫ్రెండ్ ని అడిగి డబ్బులు తెస్తాను అన్నావు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు.. ప్రేమ ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. భద్ర మాటలు విన్న రామరాజు ఇంకాస్త బాధ పడిపోతూ ఉంటాడు.. అందరితో నన్ను మాటలు పడేలా చేస్తున్నారు. పెద్ద కోడలు నా కుటుంబ గౌరవాన్ని పెంచేలా ఓ బిడ్డను కనబోతుంది.. కానీ మిగిలిన వాళ్ళు నా పరువు తీయడానికే ఉన్నారు అని అనగానే వల్లి బాధ పడిపోతుంది. ప్రేమ ధీరజుల మధ్య దూరం పెరుగుతుంది.. ప్రేమ ధీరజ్ని ఎంతగా బతిమిలాడినా కూడా తాను మాత్రం మాట్లాడడానికి ఇష్టపడడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×