E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భరత్ కు అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవి మాస్టర్ ప్లాన్.. నిజం బయటపడుతుందా..?

Intinti Ramayanam Today Episode: భరత్ కు అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవి మాస్టర్ ప్లాన్.. నిజం బయటపడుతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode April 27th : రాజేశ్వరి తన కొడుకు భరత్ అని తెలుసుకున్న తర్వాత నుంచి తనకి దగ్గర ఎందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఎటువంటి అర్హతలు లేని భరత్ కి తన ఆఫీసులో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడంతో పాటుగా ఖరీదున కారు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా గౌరవం పెరిగి కన్నీళ్లు పెట్టుకుంటాడు. చక్రధర్ భరత్ ని మెల్లగా తన వైపు తిప్పుకునేందుకు రాజేశ్వరి ప్రయత్నాలు చేస్తుంది అని అనుకుంటాడు. తనకు దూరంగా ఉండమని ఎంతగా చెబుతున్నా సరే నువ్వు ఎవడు చెప్పడానికి అని భరత్ ఇంకా దగ్గరవుతాడు. రాజేశ్వరి అనుకున్నట్లుగానే బావబామ్మర్దుల మధ్య చిచ్చు పెడుతుంది. తన ప్లాన్ సక్సెస్ అయ్యింది కానీ అవని తన తమ్ముడిపై కోపంగా తన ఇంటికి వెళ్తుంది.

భరత్ కు దిమ్మతిరిగే షాక్..

అర్చన తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిన అవని భరత్ ని చూసి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. నా భర్తని నువ్వు కొడతావా నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్తని కొడతావు అని చెంపలు వాయిస్తుంది. నా భర్తని కొట్టే అంత ధైర్యం నీకు ఎవరు ఇచ్చారు రా అని భరత్ ని కొడుతుంది. బావని కొట్టినందుకు ఇంత ఫీలవుతున్నావే కన్న కొడుకు లాగా పెంచిన రాజేశ్వరి అమ్మని బావ తిట్టాడు దారుణంగా మాట్లాడాడు అందుకే కొట్టాను అని భరత్ అంటాడు.. ఎంత చెప్తున్నా సరే భరత్ మాట వినకపోవడంతో అవని అనాధనైన నన్ను పెళ్లి చేసుకున్న నా భర్తని కొట్టావు నిన్ను నేను ఎలా కొట్టాలి అని ఇంకాస్త కోపంగా మాట్లాడుతుంది..

భరత్ మాటతో అవని మైండ్ బ్లాక్..

Advertisement

నువ్వేం చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా భరత్ అని అవని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. నేను చేసింది తప్పు అని అంటే బావ చేసింది తప్పేంటి ఆలోచించవా అక్క అనేసి భరత్ అంటాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న రాజేశ్వరి అమ్మని కొట్టడానికి ప్రయత్నించారు. రాజేశ్వరి అమ్మనా ఇంత దగ్గర ఎందుకు అయ్యావు రా.. నిన్న కాక మొన్న వచ్చిన జాబ్ చూసుకుని నువ్వు ఇంత రెచ్చిపోతున్నావా అని అవని అడుగుతుంది. భరత్ చెప్తున్న మాటలు విని అవని మైండ్ బ్లాక్ అయిపోతుంది. రాజేశ్వరి పిన్ని నేను అనుకునే దానికి ఇంకా ముందుగా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అవని దగ్గరకొచ్చిన అక్షయ్ చక్రధర్లు మనం అనుకున్న దానికంటే రాజేశ్వరి ఎక్కువగానే భరత్ తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అని అనుకుంటారు.

భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి..

భరత్ అవనితో మాట్లాడుతుండగా పల్లవి ఫోన్ చేస్తుంది.. భరత్ అవని తో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడితే ఏదైనా అనుకుంటారేమో అని కట్ చేస్తాడు. ఆ తర్వాత పక్కకు వెళ్లి పల్లవి తో ఫోన్ మాట్లాడుతాడు. అక్క బావ ఇంటికి వచ్చారు. గొడవ జరుగుతుంది అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు సిస్టర్ అని భరత్ అంటాడు. నేను ఊహించాను పర్వాలేదు నువ్వు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఉండాలో తెలుసుకో ముందు. అప్పుడే నిన్ను నువ్వు ఒక దారిలోకి రాణించుకునే ప్రయత్నం చేస్తావు అని పల్లవి భరత్ నేను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. భరత్ పల్లవి నీ గుడ్డిగా నమ్మేస్తాడు.

రాజేశ్వరి పై పల్లవికి అనుమానం..

Advertisement

అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాజేశ్వరి పల్లవికి ఫోన్ చేస్తుంది. పల్లవి మన ఊహించినట్లు జరుగుతుంది మామ్ అని చెప్పగానే రాజేశ్వరి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. భరత్ గురించి కాదు కానీ నువ్వు ఎందుకు వాడి చేత అమ్మ అని పిలిపించుకుంటున్నావు అని పల్లవికి అనుమానం వస్తుంది. రాజేశ్వరుని ఆ మాట అడగ్గగానే తాను ఎక్కడ పల్లవికి నిజం చెప్పేస్తాను అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. వాడు ఒక సెంటిమెంటల్ ఫుల్ మనం మంచిగా మాట్లాడితే నిజంగానే కరిగిపోతున్నాడు అందుకే అమ్మ అని పిలుస్తున్నాడు అని రాజేశ్వరి ఏదో ఒకటి చెప్పి పల్లవిని డైవర్ట్ చేస్తుంది.

శ్రీకర్ ఎంట్రీ తో పార్వతి హ్యాపీ..

శ్రీకర్ ఇంట్లోకి రాగానే పార్వతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నువ్వు ఇంటికి రావాలని దేవుడిని ఇలా మొక్కుకున్నానో లేదో నువ్వు అప్పుడే ఇంటికి వచ్చేసావ్ రా నా మొక్కు ఫలించింది అని పార్వతి ఎమోషనల్ అవుతుంది. కానీ శ్రీకర్ అన్నయ్య అని గట్టిగా పిలవడంతో కమల్ శ్రీకర్ అనే వచ్చాడు అని బయటికి వస్తాడు. ఈ దెబ్బలు ఏంట్రా అని అడగ్గానే పార్వతి ఏంట్రా ఈ దెబ్బలు అని అడుగుతుంది ఏం లేదమ్మా బైక్ మీద వెళుతుండగా కింద పడ్డాను అని కమలంటాడు. అయితే కమల్ ఎంత చెప్తున్నా సరే శ్రీకర్ మాత్రం మాట్లాడడంతో పార్వతికి అనుమానం వస్తుంది. ఏం జరుగుతుంది రా ఇక్కడ అని అడుగుతుంది అప్పుడే ఇంటికి వచ్చినా అక్షయ అవనీలు శ్రీకర్ ను చూసి షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు అవుట్?

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×