BigTV English

Intinti Ramayanam Today Episode : ఇంట్లో ఫంక్షన్ ను చెడగొట్టాలని పల్లవి ప్లాన్.. అవనిని ఇరికించిన పల్లవి..

Intinti Ramayanam Today Episode : ఇంట్లో ఫంక్షన్ ను చెడగొట్టాలని పల్లవి ప్లాన్.. అవనిని ఇరికించిన పల్లవి..

Intinti Ramayanam Today Episode October 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాక్షి, అవనిలు చక్రధర్ ను చూసి షాక్ అవుతారు. లోపలికి వెళ్లిపోతారు. ఇక పల్లవి,చక్రధర్ లు ఎందుకు వచ్చారో తెలుసుకున్న అవని షాక్ అవుతుంది. డాక్టర్ ను అబార్షన్ చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. అవని చెప్పినట్లు డాక్టర్ పల్లవికి విటమిన్ టాబ్లెట్ ఇచ్చి పంపిస్తుంది . ఇక కమల్ లాప్టాప్ లో మెగాస్టార్ చిరంజీవి చూస్తూ ఉంటాడు. రాజేంద్రప్రసాద్ అక్షయ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రిమైండర్ మెసేజ్ వస్తుంది. ఎల్లుండి అమ్మానాన్నల పెళ్లిరోజు అనేసి ఆ మెసేజ్ ను చూసి అమ్మ నాన్నల్ని ఎలాగైనా సరే అంటూ ఆలోచిస్తాడు. అందరికన్నా ముందు నేనే నాన్నని విషయాలనేసి బొకే తీసుకొని హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ అనేసి బొకే ఇస్తాడు. యూజ్లెస్ ఫెలో ఇడియట్ అనేసి తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇంట్లోని అందరూ అక్కడికి వస్తారు. అమ్మ నాన్నలు పెళ్లిరోజు కదా మనం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయాలని చెబుతాడు.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనికి తన అంతరాత్మ కనిపిస్తుంది. అవని నగల విషయం ఎలా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది .ఫంక్షన్ కి నేను నగలు పెట్టుకోకపోతే అందరికీ అనుమానం వస్తుంది. అసలు విషయం చెప్పాల్సి వస్తుందని తనలో తనే మదనపడుతూ ఉంటుంది. అప్పుడు తన అంతరాత్మ తనకొక సలహా ఇస్తుంది. ఇప్పటికిప్పుడు నువ్వు అంత డబ్బు కట్టి నగలను విడిపించుకు రావడం చాలా కష్టం అయితే వాటి ప్లేస్ లో ఫంక్షన్ అయిపోయే వరకు గిల్టు నగల్ని తీసుకొస్తే సరిపోతుందని సలహా ఇస్తుంది. మోసం చేయడం అవసరమా అని అవని అనుకుంటుంది. నగలు తాకట్టు పెట్టి ఇంట్లో ఎవరికీ తెలియకుండా మీ అమ్మకి హాస్పిటల్లో కట్టావు అది మోసం కాదా అమ్మకి చేయడం తప్ప వేరొకటి లేదు అమ్మని సరిగ్గా చూసుకోవడం నీ బాధ్యత అనేసి అంతరాత్మ అంటుంది . ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవి చక్రధర్ రెస్టారెంట్లో కలుసుకుంటారు. మీ అబార్షన్ విషయం ఇంట్లో తెలిసిపోయిందా అనేసి చక్రధర్ అంటాడు దానికి పల్లవి నేను ప్రెగ్నెన్సీ అన్న విషయమే ఇంట్లో తెలియదు అలాంటిది అబార్షన్ గురించి ఎలా తెలుస్తుంది. అత్తయ్య మామయ్య పెళ్లిరోజు వేడుకను ఘనంగా జరపాలని అనుకుంటున్నారు అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. దాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ప్లాన్ చేస్తారు. అప్పుడే కాఫీ ఆర్డర్ చేస్తారు. కాఫీ తీసుకొచ్చిన వెయిటర్ ఆ కాఫీ ని పొరపాటున చక్రధర్ మీద పోస్తాడు.

చక్రధర్ షర్ట్ మీద పడుతుంది చెయ్యి కాలుతుంది. ఇక వెయిటర్ సారీ చెప్తాడు. ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా చక్రధర్ వినకుండా వెయిటర్ ని చంప పగలగొడతాడు. ఇంకా చూస్తావ్ ఏంటి వెళ్లి వాటర్ తీసుకురా ఇడియట్ అనేసి పల్లవి అంటుంది. డాడ్ బాగా కాలిందంటే లేదమ్మా షర్ట్ ఉంది కదా అందుకే ఎక్కువ కాల్ లేదు అనేసి చక్రధర్ అంటాడు .అప్పుడు షర్ట్ బటన్ తీసి షర్ట్ ని పైకి మడత పెడతాడు హ్యాండ్ మీద ఎమ్మెస్ అనే టాటూ ని చూస్తుంది ఎం ఎస్ అంటే నీ మాజీ లవర్ పేరు డాడ్ అని చక్రధర్ను పల్లవి అడుగుతుంది. అదేం లేదమ్మా ఏదో అప్పుడు వేయించుకున్న ఏదో మేనేజ్ చేస్తాడు. ఇక రెస్టారెంట్ నుంచి పల్లవి బయటకు రాగానే అవని కనిపిస్తుంది. అవని ఎందుకు వచ్చిందని ఆలోచిస్తూ కార్ ఎక్కుతుంది. ఇక అక్కడికి వచ్చిన అవని తనకు ఇలాంటివి గిల్టు నగలు కావాలని చూపించి డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవని వెళ్లిపోయిన తర్వాత పల్లవి వెళ్లి ఆ షాప్ అతన్ని అడుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఆవిడ నగలు చేస్తుందంటే లేదమ్మా ఇలాంటివి గిల్టు నగలు కావాలంట ఇంట్లో ఫంక్షన్ ఉందంట అని ఆ షాప్ అతను నిజం చెప్పేస్తాడు. ఇంట్లో కూర్చున్నా పల్లవి అవనిని అలానే చూస్తూ ఉంటుంది. తన దగ్గర నగలు ఉన్నాయి కదా మరి గిల్టు నగలు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది. తన నగలు ఏమయ్యాయో తెలుసుకోవాలంటే తన దగ్గర ఉన్న లాకర్కిని ఎలాగైనా తీసుకోవాలని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి వాళ్ళ అమ్మమ్మ ఏంటి అవనీని కలర్ చూస్తున్నామని అడుగుతుంది. దానికి పల్లవి ఏం లేదమ్మా నాకు నీళ్లు కావాలి లోపలికి వెళ్లి తీసుకుందామని ఆలోచిస్తున్నాను.


ఇక పల్లవి నీ వాళ్ళ అమ్మమ్మ లోపలికి తీసుకెళ్తుంది. పల్లవి నీళ్లు తాగుతూ అవని మీద నీళ్లు పోస్తుంది. అవనికి సారి చెప్తూ టవల్ ఇస్తుంది. అవనికి పల్లవి ప్లాన్ తెలియక తాళాలు టేబుల్ మీద పెట్టేసి బట్టల్ని ఆర్పుకునేందుకు బయటకు వెళ్తుంది. ఇంట్లో ఎవరూ చూడకపోవడంతో ఆ తాళాల నుంచి లాకర్తాలన్నీ పల్లవి తీసుకుంటుంది. లోపలికి వెళ్లి లాకర్లో నగలు లేవన్న విషయం తెలుసుకొని తాకట్టు పెట్టిన రసీదును తన దగ్గర పెట్టుకుంటుంది. అప్పుడే అవని లోపలికి వస్తుంది తాళం కింద పడటం చూసి మొదట అనుమానపడిన ఏదో కింద పడింది అనేసి బ్రమ పడుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ మ్యారేజ్ డే వేడుకలను అందరూ గ్రాండ్గా చేస్తారు. మరి పల్లవి అవని గురించి నిజం చెప్తున్నా లేక అవని పల్లవి గర్భం గురించి నిజం చెబుతుందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×