E-Paper
Advertisement

కొత్తింట్లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ కమెడియన్… వైరల్ అవుతున్న వీడియో..

కొత్తింట్లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ కమెడియన్… వైరల్ అవుతున్న వీడియో..
Advertisement

Jabardasth Dorababu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమం ఇండస్ట్రీకి ఎంతో మంది కమెడియన్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో దొరబాబు ఒకరు. దొరబాబు హైపర్ ఆది టీంలో కొనసాగుతూ ఉండేవారు తన అద్భుతమైన పంచ్ డైలాగులతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తున్న దొరబాబు తాజాగా కొత్తింట్లోకి అడుగు పెట్టారు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న దొరబాబు..

తాజాగా ఈయన తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. చాలా సంప్రదాయబద్ధంగా వీరి గృహప్రవేశ కార్యక్రమం జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ (Jabardasth Comedian)మొత్తం హాజరయ్యారు. హైపర్ ఆది,ఫైమా, పొట్టి నరేష్, బుల్లెట్ భాస్కర్ వంటి పలువురు జబర్దస్త్ కమెడియన్స్ ఈ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా దొరబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

హైపర్ ఆది టీంలో కమెడియన్..

Advertisement

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అలాంటిది దొరబాబు కూడా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారని తెలుస్తుంది. ఇక దొరబాబు విషయానికి వస్తే ఈయన.. పెద్దిరేల దొరబాబు. విశాఖపట్నం కి చెందిన దొరబాబు నటుడు అవ్వాలనే కోరికతో హైదరాబాద్ వచ్చారు. ఇలా హైదరాబాద్ వచ్చి నటుడిగా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. అనంతరం జబర్దస్త్ కార్యక్రమం వైపు అడుగులు వేస్తూ హైపర్ ఆది (Hyper Aadi)టీంలో చేరారు. ఇలా హైపర్ ఆది టీంలో కమెడియన్ గా కొనసాగుతున్న దొరబాబు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

?igsh=NTRqaWp6ZGl6bzVx

Advertisement

ఇలా కమెడియన్గా కొనసాగుతున్న ఈయన అమూల్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ప్రస్తుతం కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక దొరబాబు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో బి గ్రేడ్ సినిమాలలో నటించడంతో హైపర్ ఆది టీంలో స్కిట్ చేసిన ప్రతిసారి వీరిపై ఆది పెద్ద ఎత్తున సెటైర్లు వేయడంతో హైలైట్ గా నిలిచారు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ దొరబాబు జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కమెడియన్లుగా కొనసాగుతున్నారు. ఒకవైపు కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన అప్పట్లో శ్రీనిక అనే పేరుతో రెస్టారెంట్ బిజినెస్ కూడా ప్రారంభించారు. ఇండస్ట్రీలోనూ బిజినెస్ లో దొరబాబు బిజీగా ఉన్నారు.

Also Read: రీల్ లైఫ్ లో సీఎం ఛాన్స్ మిస్.. రియల్ లైఫ్ అధికారం అందుకున్న విజయ్..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×