E-Paper
Advertisement

Lakshmi V’s Anu: లక్ష్మీ వర్సెస్ అనూ.. దీపావళి పటాస్ లా పేలేదెవరు..?

Lakshmi V’s Anu: లక్ష్మీ వర్సెస్ అనూ.. దీపావళి పటాస్ లా  పేలేదెవరు..?
Advertisement

Lakshmi V’s Anu: ఈనెల 31వ తేదీన దీపావళి జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి పలు బుల్లితెర ఛానెల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు యాంకర్స్ కూడా తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలాగే మరి కొంతమంది యాక్టర్స్ బుల్లితెరపై సందడి చేసి క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాంటి వారిలో అనసూయ (Anasuya), మంచు లక్ష్మీ (Manchu Lakshmi)కూడా ఉన్నారని చెప్పాలి. తాజాగా వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండబోతోందని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అణుబాంబ్ Vs లక్ష్మీ బాంబ్..

Advertisement

ప్రతి పండుగకి పలు టీవీ ఛానల్స్ స్పెషల్ ఈవెంట్స్ ను చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ దీపావళి పండుగకి కూడా ఈటీవీ ఛానల్ ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయనుంది. అంతే కాదు ఈ దీపావళికి మోత మోగిపోద్ది అనే పేరుతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా అందుకు సంబంధించిన ప్రోమో ని కూడా తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈసారి ఈవెంట్ ని చాలా కొత్తగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ దీపావళి ప్రోగ్రాం కోసం మంచు లక్ష్మీ, అనసూయ ను స్పెషల్ గా పిలిపించి మరీ అనసూయ వర్సెస్ మంచు లక్ష్మీ అన్నట్టుగా స్క్రిప్ట్ రాసుకున్నారేమో అనిపిస్తుంది. అనసూయని అణు బాంబ్ , మంచు లక్ష్మి ని లక్ష్మీ బాంబ్ అంటూ సరదాగా చెప్పి, వీరిద్దరి మధ్య ఫైట్ అన్నట్టుగా ప్రోమోని కూడా డిజైన్ చేశారు. ఎప్పటిలాగే స్కిట్స్, సాంగ్స్, డాన్సులు ఇందులో ఉండబోతున్నాయి. దీనికి తోడు ప్రముఖ యాంకర్, శ్రీముఖి ఈ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేయనుండగా యూట్యూబర్ షణ్ముఖ్ కూడా వచ్చారు.

దీపావళి షో ప్రోమో వైరల్..

Advertisement

ఈ ప్రోమో కాస్త ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.. దీంతో ఈ దీపావళి ప్రోగ్రాం ఇంకా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మంచు లక్ష్మీ , అనసూయ కలసి ఈ ప్రోగ్రాం లో ఎంత రచ్చ చేశారో తెలియాలి అంటే దీపావళి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ ప్రోమో విషయానికి వస్తే.. బుల్లితెర సీరియల్స్ టాప్ సెలబ్రిటీలందరూ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మానస్ , పండు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా వచ్చేశారు. మొత్తానికైతే ఈసారి దీపావళికి నిజంగానే మోత మోగిపోద్ది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

మంచు లక్ష్మీ, అనసూయ సినిమాలు..

ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే.. తాజాగా ఆదిపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో యక్షిణి అనే వెబ్ సిరీస్ తో, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఆదిపర్వం సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరొకవైపు అనసూయ పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×