Podarillu Today Episode April 7th : నారాయణ బయట తిరిగే ఇంటికి రావడంతో అక్కడికి వచ్చిన మాధవ్ ఇలా ఎండలో బయట తిరుగుతున్నామని చూస్తే మహాలక్ష్మి చూస్తే తీడుతుంది అని అంటాడు.. ఇంటికి ఒక ఆడపిల్లని తీసుకురండి అంటే పులి పిల్లను తీసుకుని వచ్చారు. చిన్నగా మాట్లాడు నాన్న ఒకవేళ మిగిలింది అంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు అని మాధవ్ అంటాడు.. అప్పుడే చక్రి వచ్చి నారాయణను లోపల పిలుస్తుంది రండి అని అడుగుతాడు.. ఇక నారాయణకు పెళ్లి సంబంధం గురించి చెప్తుంది. మీరు పెద్దరికం నిలబెట్టుకోవాలి అని మహాలక్ష్మి చెప్పడంతో నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. మీరు అన్ని మాట్లాడుకున్నారు కదా మధ్యలో నాతో ఏంటి పని అనేసి నారాయణ అంటాడు. నారాయణ ఎంత చెప్తున్నా సరే వినకుండా ఉండడంతో మహాలక్ష్మి మీరు ఆగండి పెళ్ళికొడుకు తండ్రి లాగా మీరు అన్ని మాట్లాడాలి అని అంటుంది..
మీరందరూ మాట్లాడుకున్న తర్వాత నేనే మాట్లాడాలమ్మ.. అని నారాయణ అంటుంటే చూశారా ఈయన పద్ధతి అంతే.. ఇక నారాయణను పెళ్లి వాళ్ళతో మాట్లాడాలి ఒకసారి ఎలా మాట్లాడుతారు చెప్పండి అని అందరూ అడుగుతారు. నారాయణ బెదిరించినట్టు మాట్లాడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మహాలక్ష్మి కన్నా ఇద్దరు కలిసి పెళ్లి వాళ్లతో ఎలా మాట్లాడాలి అని ఒకసారి చూపిస్తారు.. అయితే నారాయణ నాకు అర్థమైంది అని మర్యాదగా మాట్లాడి మహాలక్ష్మి దగ్గర ఇంప్రెస్స్ అవుతాడు.. ఇక అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన మాధవ్ ఏమైంది. ఎందుకు మీరందరూ ఇలా ఉంటున్నారు ఏదో జరుగుతుంది అని అడుగుతాడు..
ఇక మాధవ వచ్చి ఏం జరుగుతుంది మీరంతా ఏదో అభినందన సభ చేస్తున్నట్లు అర్థమవుతుంది.. అయితే ఏం లేదు చక్రి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని మహా అంటుంది.. చక్రి అందరి పేరు చెప్పడంతో లాస్ట్ కి నారాయణ వానికి చెప్పడానికి భయపడుతున్నారు ఏంట్రా.. అనేసి బాగా బిల్డప్ ఇచ్చి ఈ అమ్మాయిని ఏదో మాట్లాడుతాడు అంట అని అక్కడి నుంచి పారిపోతాడు.. ఇక మహాలక్ష్మి ఏంటి నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను మ్యాట్రిమోనీలో మీకు ఒక సంబంధం చూశాము. ఆ దానికి మనం వెళ్ళాలి ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోండి అనేసి పెద్ధికి చెప్తుంది. మీరు రావాల్సిందే ఇది నా మాట ఫైనలు మీరు మాత్రం మిస్ చేశారంటే నేను ఇంక నీతో మాట్లాడను అనేసి మహా అంటుంది..
ఇక అందరూ కూడా పెళ్లి చూపులకు వెళ్లడానికి రెడీ అయ్యి వస్తారు. ముఖ్యంగా నారాయణ గెటప్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అందరూ రెడీ అయి వచ్చిన తర్వాత మాధవ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.. మాధవ్ ఎంట్రీ ఇవ్వడంతో అన్నయ్య చాలా బాగున్నాడు అని అందరూ అనుకుంటారు. మహాలక్ష్మి చీరలో ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు.. చీరలు చాలా బాగున్నారు వదిన అని కన్నా అనగానే మహాలక్ష్మి ఫిదా అవుతుంది. ఇక అందరూ కలిసి పెళ్లి చూపులకి బయలుదేరుతారు.
అందరూ కలిసి ఇక కారులో బయలుదేరగానే మహాలక్ష్మిని చూసి చక్రి తెగ ఫీలైపోతుంటాడు. మహాలక్ష్మి చీరలో చాలా అందంగా ఉంది. మహాలక్ష్మికి లైన్ వేస్తూ ఉంటాడు చక్రి అది చూసిన కేశవ కన్నా ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి ఇంత అందంగా ఉంది కదా పూలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని చక్రి ఒకచోట కార్ ఆపి మల్లెపూలు తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు కానీ నాకు పువ్వులు అంటే ఇష్టం లేదని ఎంత చెప్తున్నా సరే.. నారాయణ చెప్పడంతో ఆ మల్లెపూలను పెట్టుకుంటుంది. అది చూసిన అందరూ కూడా చక్రినీ ఆడుకుంటారు.
పెళ్లిచూపులు కోసమని పెళ్లికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే.. తండ్రిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు.. పెళ్లికూతురు తండ్రికి ఉన్న ట్రెండ్ పిచ్చితో అందరూ కూడా ఒక్కసారిగా ఈ సంబంధం క్యాన్సల్ అయిపోయేలా ఉంది అని మనసులో అనుకుంటారు. ఇక అతని గోల భరించలేక పెళ్లికూతురుని తీసుకురమ్మని అనగానే.. పెళ్లికూతురు వచ్చి కూర్చోగానే అందరు కూడా చాలా బాగుంది అని సంతోషంగా ఫీల్ అవుతారు. సొసైటీలో ఒక మాధవ్ ని చూసిన పెళ్లికూతురు సిగ్గుపడుతూ తలదించుకుంటుంది.. అందరూ కలిసి మీరిద్దరు వెళ్లి మాట్లాడుకోండి అని అనగానే వెళ్లి మాట్లాడుకోవడానికి అందరూ చెప్పగానే వెళ్లి మాట్లాడడానికి ఒప్పుకుంటాడు.
పెళ్లికూతురుతో ఒంటరిగా మాట్లాడడానికి వచ్చిన మాధవిని చూసి ఆమె సిగ్గుపడుతుంది. అయితే ఇద్దరు కలిసి కాసేపు కన్ఫ్యూషన్ లో ఒకరినొకరు పలకరించుకుంటారు. ఇక అమ్మాయి చెప్పండి మీతో మాట్లాడాలి అని అంటుంది. ఇక మాధవు సిగ్గుపడుతూ నేనేం చెప్పలేను మీరు మాత్రమే ఏదైనా చెప్పండి అని అంటాడు. ఇక తన గురించి అమ్మాయి చెప్పగానే మాధవ్ సిగ్గు పడిపోతూ ఉంటాడు. మీరు మాత్రం ఏం మాట్లాడట్లేదు ఏంటి నేను కాకిలాగా మాట్లాడుతున్నాను అని పెళ్లికూతురు అంటుంది. కానీ మాధవ్ మాత్రం గాయత్రిని తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకునే లోపలికి వచ్చేస్తారు.
వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కదా మరి మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని నారాయణ అంటాడు.. కానీ ఇప్పుడే పెళ్లి సంబంధం పెళ్లి చూపులు అన్ని అంటే కుదరదు కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఆ తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి ఫిక్స్ చేసుకుందాము అని అంటారు.. ఇక మాధవ్ నెంబరు ఇవ్వగానే మేము వెళ్లి వస్తామని మహాలక్ష్మి అంటుంది. కానీ అతను ఫ్రెండ్ పిచ్చితో మరోసారి అందరినీ షాక్ కు గురై ఎలా చేస్తాడు..
నీకు మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాను కదా అక్కడికి వెళ్ళమని చెప్పాను కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని హారిక అడుగుతుంది. ఇంట్లో నేను చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి అవేం తర్వాత నేను వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అంటుంది.. కానీ హారిక మాత్రం ఆ ఇంటిని చక్కదిద్దాల్సిన అవసరం నీకు లేదు కదా.. ఒకప్పుడు నాకు లేదు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళతో ఉన్న తర్వాత నాకు ఆ ఫీలింగ్ కలిగింది. వీళ్ళు నన్ను అంత బాగా చూసుకున్నారు అని అంటుంది. మన ఇంట్లో కన్నా నాకు ఇక్కడే బాగా సేఫ్ గా అనిపిస్తుంది. ఇక సరే అని మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. హారిక ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది అని అనుకుంటుంది.. అందరూ కలిసి భోజనం చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి…