E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహా.. మాధవ్ కు నిజం చెప్పిన మహా.. గాయత్రి మాటతో మహా షాక్..

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహా.. మాధవ్ కు నిజం చెప్పిన మహా.. గాయత్రి మాటతో మహా షాక్..
Advertisement

Podarillu Today Episode February 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. నారాయణ ఇంట్లోంచి బయటికి వచ్చి  చాలా సంతోషంగా ఉంటాడు. డాన్స్ వేస్తూ సంతోషంగా ఉండడం చూసినా అక్కడ వాళ్ళందరూ పెళ్ళికొడుకన్నా నువ్వే చాలా అందంగా కనిపిస్తున్నావు ఏంటి అని అడుగుతారు.. కొడుకు తండ్రి అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. నన్ను ఫోటోలు తీసి ఆ ఫోటోలు నాకు పంపించు అని నారాయణ గొప్పగా ఊర్లో వాళ్ళందరికీ చెప్పుకుంటాడు. ఇంటికి వెళ్దామని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు.. అయితే రోడ్లో మహా చక్రిల రిసెప్షన్ అని బ్యానర్ కట్టి ఉండటం చూసి షాక్ అవుతారు. ఏంటండీ మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మనిద్దరికీ పెళ్లి అయిందని ఊరంతా చెప్పాలనుకుంటున్నారా? ఏంటి అని మహా చక్రిపై సీరియస్ అవుతుంది.. నేను మా వాళ్ళకి ఇలా చేయమని చెప్పానా ఏంటి? నేను కూడా మీతోనే ఉన్నాను కదా అని చక్రి అంటాడు.. కానీ మీ వాళ్ళకి నిజం చెప్పండి లేకపోతే ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా మనిద్దరికీ పెళ్లి అయిందని అనుకుంటారు అని మహా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మాధవ్ ఎంత చెప్తున్నా సరే చెక్రి మాత్రం వినడు కానీ చివరికి నేను ఒప్పిస్తాను అన్నయ్య అని లోపలికి వెళ్ళిపోతాడు.. లోపలికి వచ్చిన చక్రి మహాని అడుగుతాడు. ఈ రిసెప్షన్ గురించి మీకు తెలియదా ఏంటి అని మహా సీరియస్ అవుతుంది. ఈ పెళ్లి నిజం పెళ్లి కాదని మీ వాళ్లకు చెప్పేయండి ఈ ఏర్పాట్లు గనుక ఎక్కువైతే ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. మా వాళ్ళు ఎలాగైతే అపార్థం చేసుకున్నారు మీ వాళ్ళు కూడా దీని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి అంటుంది. కానీ మహాలక్ష్మి మాత్రం ఎంత చెప్తున్నా చక్రి మాత్రం మౌనంగా ఉంటాడు. ఇది నిజం పెళ్లి కాదని మీ వాళ్ళకి చెప్పండి అని మహాలక్ష్మి అంటుంది.. ఈ ఫంక్షన్ గనక జరిగితే పర్మినెంట్గా మీ భార్యని అయిపోతాను ఇది ఉంచుకోండి అని మహా చక్రితో అంటుంది..

Advertisement

మహా చక్రి లోపలికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇంట్లో ఇలా ఫంక్షన్ గురించి చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేశారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అని మహా చక్రిపై సీరియస్ అవుతుంది.. కానీ చక్రి మాత్రం నాకేం తెలుసండి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు చేశారు కానీ మనం ఇప్పుడు బయటకు వెళ్లకుండా మా ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది.. ఇంట్లో వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని నాకు అసలు తెలియదు.. అయితే మీ పక్కన నేను మీ భార్యగా నిలుచుని ఫోటోలకి ఫోజులు ఇవ్వమంటారా అని మహా సీరియస్ అవుతుంది.. మీకోసం నేను మీ భర్తగా మెడలో తాళి కట్టాను. మీరు నాకోసం ఒక అరగంటసేపు బయట నిలబడలేరా అని చక్రి అడుగుతాడు..

మహా ఎంత చెప్తున్నా సరే వినకుండా ఉంటుంది.. అప్పుడే గదిలోకి మాధవ వచ్చి మీకోసం కొత్త బట్టలు కొన్నాము ఇవి తీసుకొని రండి అని అంటాడు.. మీరు ఇప్పుడు మీ వాళ్ళకి చెప్తారా లేదా.. మీ వాళ్ళని మోసం చేయాలని నాకు లేదు అని మహా అంటుంది. మీరు మీ వాళ్ళని మోసం చేస్తున్నారు కానీ నాకు మాత్రం మోసం చేయాలనిపించట్లేదు.. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా మామయ్య ఉండేవాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన చనిపోయారు ఆయన ప్రేమని మీ అన్నయ్యలా చూస్తున్నాను.. అలాంటి ఆయనను నేను ఇప్పుడు మోసం చేస్తున్నానని నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు అర్జెంటుగా వెళ్లి మీరు ఈ నిజం చెప్తారా లేదా అని మహా అడుగుతుంది..

Advertisement

బయటికి వెళ్లిన చక్రి అందరిని చూసి షాక్ అవుతాడు. ఆయరు అలాగే రమణయ్య రావడం చూసి అక్కడున్న నారాయణ ఈ గుంట నక్కలు వచ్చాయి కదా.. మనం వీళ్ళని ఆశ్చర్యపరిచేలా చేయాలి అని అనుకుంటారు.. తాయారు మాత్రం ఈ ఫంక్షన్ జరుగుతుందా లేదా అని చూడడానికి వచ్చినది. ఇకపోతే గాయత్రి వెనక గుమ్మం నుంచి లోపలికి వచ్చి ఇంకా చక్రి రెడీ అవ్వలేదు అని అంటుంది. పెళ్లికూతురు ఎక్కడుంది ఆమెను నేను రెడీ చేస్తాను అని లోపలికి వెళ్తుంది.. కానీ అక్కడ పరిస్థితిని చూసి గాయత్రి ఏం జరిగిందో కనుక్కోకుండా మాట్లాడేస్తుంది..

మహా గాయత్రి మాటలు విని చిరాకు పడుతుంది.. మీ పెళ్లి ఎలా జరిగింది అని గాయత్రి అడగడంతో మహా సీరియస్ అవుతుంది మీరు అక్కడ పెట్టేసి వెళ్లిపోండి అని అంటుంది. గాయత్రి మాత్రం నేనేం తప్పు చేశాను ఏమైనా తప్పుగా అన్నానా? తప్పుగా మాట్లాడానా అని అడుగుతుంది.. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని మహా దండం పెడుతుంది.. గాయత్రి బయటకు వెళ్ళగానే.. ఆ పెళ్లికూతురుకి కోపం ఎక్కువ అనుకుంటాను నాకు దండం పెట్టి బయటికి వెళ్ళమని మంచి మర్యాద చేసింది అని అంటుంది. వాళ్ళ నాన్నకి సీరియస్ గా ఉందట అందుకే అలా మాట్లాడి ఉంటుంది నువ్వు ఏమీ అనుకోవద్దు అని గాయత్రీ ని మాధవ్ అంటాడు.

Also Read :శ్రీవల్లికి టెన్షన్.. నర్మదకు నిజం చెప్పిన ప్రేమ.. అమూల్యకు దిమ్మతిరిగే షాక్..

ఇక బయట ఫోన్లో ఒక మెసేజ్ రావడం అందరూ చూస్తారు. వార్తల్లో చక్రి మహాల పెళ్లి గురించి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా చక్రి చాలా ధైర్యం చేసి ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది అని అంటూ కేశవ అంటాడు.. ఇక చక్రి మహాతో నేను మాట్లాడతాను అని లోపలికి వెళ్తాడు. మహాలక్ష్మి మాత్రం మీరు ఇంకా నిజం చెప్పలేదు కదా నాకు అర్థం అయిపోయింది నేనే ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని బయటకు వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Tags

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×