Podarillu Today Episode May 8th : మనము వచ్చిన రిసార్ట్కే వాళ్ళు వచ్చారు కదా ఇది నా ఫ్రెండ్ రిసార్టు వాడిని అడిగిన తెలుసుకుంటాను అని ఆది అంటాడు. వాళ్లు వచ్చారని మన సంతోషాన్ని ఎందుకు వదిలేసుకుని వెళ్ళాలి. మనం ఇక్కడ సంతోషంగా ఉండడానికి వచ్చాం కదా అని అటువాళ్లు.. ఇటు వీళ్ళు అనుకుంటారు. మహాలక్ష్మి కూడా మన సంతోషంగా ఉండడానికి ఇక్కడికి వచ్చాము అని అంటుంది. ఈ ఇద్దరు ఫ్యామిలీలు ఇక్కడే ఉంటే ఎపిసోడ్లో ట్విస్ట్ లు మామూలుగా ఉండవు అని అర్థమవుతుంది.. ఇక చక్రిని మహా దారుణంగా అవమానిస్తుంది.. కానీ చక్రి మాత్రం నన్ను మీరు అర్థం చేసుకునేది ఇంతేనా అని బాధపడిపోతూ ఉంటాడు..
రాత్రి అయిన తర్వాత నారాయణ బార్ లోకి వచ్చే మందు కొట్టాలని అనుకుంటాడు.. అప్పటికే అక్కడ టేబుల్ మీద ప్రతాప్ కూర్చొని ఉంటాడు.. నారాయణని చూసి ఒక్కసారిగా రియాక్ట్ అవుతాడు. నేను అడగలేదే అయ్యో చుట్టం గారు అని పిలుస్తాడు. అతన్ని చూసిన నారాయణ ఇప్పుడే వస్తాను ఆగండి అని అంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రతాప్ అడుగుతాడు. మందు తీసుకొని వస్తాను అని నారాయణ అంటాడు. వేరే మందు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ మందు ఉంది. ఇది మనిద్దరికీ ఫుల్ అయిపోతుంది అని ప్రతాప్ నారాయణ అని కూర్చొని బలవంత పెడతాడు.. ఇద్దరు కూర్చుని మందు తాగుతూ బాధలు పంచుకుంటూ ఉంటారు. తన కూతురు గురించి మరోసారి గుర్తు చేసుకుని బాధపడిపోతాడు ప్రతాప్.. మీ పాప గురించి నేను చెప్పారు కదా ఆమె గురించి మీరు ఇంకా బాధపడుతున్నారా అని నారాయణ అంటాడు. నన్ను వదిలేసి పోయింది ఇప్పుడు నాన్న అంటూ నా దగ్గరికి వచ్చింది. కన్నప్రేమ చంపుకొని దూరంగా ఉంటున్నాను అని ప్రతాప్ బాధపడతాడు..
మీరు ఇంత బాధ పడే బదులు మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి తో పెళ్లి చేసి ఉంటే బాగుండేది కదా.. వాడొక డ్రైవరు వాడికి ఇచ్చి నేనెలా పెళ్లి చేయాలి అని ప్రతాప్ అంటాడు. ప్రేమించుకున్నప్పుడు వాళ్లకు అదంతా తెలియదండి పెద్దలు దూరం అవుతారు అన్న బాధ కూడా వాళ్ళకి లేదు అని నారాయణ అంటాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ఒక మందు బాటిల్ తో ఫ్రెండ్స్ గా మారిపోతారు.. ఇద్దరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ముచ్చట్లు చెప్పుకుంటారు. అంతేకాదు అక్కడున్న వెయిటర్ ని అడిగి ఇద్దరు ఫోటో తీసుకుంటారు. ఇక నారాయణ నా ఫోన్లో ఫోటో కనిపించదు మా కోడలు నెంబర్ చెప్తాను తనకి ఈ ఫోటోని సెండ్ చేయండి అని ప్రతాప్ ని అడుగుతాడు నారాయణ..
అందరూ ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. కన్నా కేశవ ఇద్దరు కూడా చక్రిని ఒక ఆట ఆడుకుంటారు. అయితే చక్రి అందరితోనూ మంచి ఉంటుంది నాతో మాత్రమే ఇలా ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటాడు.. ఇక చక్రిని అడ్డంగా ఇరికించిన కేశవ నవ్వుకుంటాడు.. అందరూ సరదాగా ఉన్నప్పుడు మహాలక్ష్మి ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి మా నాన్న నెంబర్ నుంచి నాకు ఏదో ఫోటో వచ్చింది అని ఆ ఫోన్ చూస్తూ ఉంటుంది.. అయితే నారాయణ ప్రతాప్ తో కలిసి మందు తాగుతూ దిగిన ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమైందమ్మా మహా ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని మాతో అడుగుతాడు. మీ నాన్న మా నాన్నతో కలిసి కూర్చొని మందు తాగుతున్నాడు ఫోటో తీసుకొని నాకు పంపించారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
అంత అయిన తర్వాత రూమ్ కి వచ్చిన నారాయణను అందరూ సీరియస్ గా చూస్తారు. ఇలా జరిగింది ఏంటి? ఆయనెవరో పెద్ద మనిషి లాగా కనిపించాడు. మందు పంచుకున్నాం.. మనసులోని బాధను పంచుకున్నాడు అని నారాయణ తిక్క తిక్కగా సమాధానం చెప్తాడు.. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా నారాయణ మీద పడిపోతారు. ఆయన ఎవరో తెలియకుండానే మందు తాగావా? మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు. నువ్వు వాళ్ళ నాన్నతోనే మందు తాగావని తెలిస్తే వీళ్ళు అన్నయ్య నిన్ను బతకనిస్తాడా చంపేస్తాడు అని చక్రి నారాయణ అని తిడతాడు. వాడికి అంత దమ్ముందా నేను చూసుకుంటాను అని నారాయణ అంటాడు. చక్రి వల్ల నాన్న ఇతనే అని తెలిస్తే మా నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది.
తర్వాత రోజు ఉదయం అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ మహాలక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని చూసి మౌనంగా ఉంటారు.. వాళ్ల గురించి ఆలోచించాల్సిన పనిలేదు మీరు తినండి ముందు అని చక్రి కూడా అంటాడు.. ఆ తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత గేమ్స్ ఉన్నాయని చెప్పగానే అక్కడికి వెళ్తారు. ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు. ఈ గేమ్ లో ఎవరైతే ఓడిపోతారో పల్లకి పనిష్మెంట్ ఉంటుందని అక్కడ చెప్తూ ఉండగా ఆది వీళ్ళని ఎలాగైనా పంపించాలి అని ప్లాన్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read:Intinti Ramayanam Today Episode: రమ్య భర్తతో అక్షయ్ బిజినెస్.. రాజేశ్వరికి షాక్..పల్లవి సూసైడ్…