E-Paper
Advertisement

Satyabhama Today Episode : సత్య భాధను అర్థం చేసుకున్న క్రిష్.. తండ్రి అసలు స్వరూపం తెలిసిపోతుందా?

Satyabhama Today Episode : సత్య భాధను అర్థం చేసుకున్న క్రిష్.. తండ్రి అసలు స్వరూపం తెలిసిపోతుందా?
Advertisement

Satyabhama Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో సత్యను పక్కకు నెట్టేసి క్రిష్ ఎమ్మెల్యే కొడుకును చంపడానికి వెళ్తాడు. సత్య భయపడుతుంది. దీనికి కారణం మహదేవయ్య అని అతని దగ్గరకు వెళ్లి నిలదీస్తుంది. నీ కొడుకు క్రిష్ కాదని తెలిసిపోయిందని చెప్పింది. ఇక ఇద్దరి మధ్య వాదనలు ఎపిసోడ్ కు హైలెట్ అయ్యాయి.. మహదేవయ్య నుంచి ఎలాగైనా క్రిష్ ను దూరం చేస్తానని శపధం చేస్తుంది సత్య.. ఇక మహదేవయ్య కూడా సత్య ఓడిపోతుందని క్రిష్ ను నా నుంచి దూరం అవ్వడనీ చెబుతాడు. ఇక నందిని, మైత్రి మీద కోపం పెంచుకుంటుంది. హర్ష ను కడిగిపడేస్తుంది. తనను ఎందుకు పెళ్లి చేసుకున్నావని నిలదీస్తుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మైత్రి తో హర్ష సారీ చెబుతాడు. నువ్వు సారి చెప్పడం ఎందుకు.. నందిని అన్న మాటలు మనసులో పెట్టుకోవద్దని చెబుతాడు. దానికి మైత్రి కోపంగా ఉంటుంది. ఒక ఆడపిల్ల తన భర్త వేరే అమ్మాయి ముందే ఏదైన అంటే అలానే అంటారు. నువ్వు ఎదురించి పెళ్లి చేసుకున్నావు. తనని బాగా చూసుకోవడం నీ బాధ్యత అలాంటిది తనని ఇలాంటి అంటే ఫీల్ అవుతుంది. తన కోపానికి ఒక అర్థం ఉంది. నువ్వు వెళ్లి తనని అర్థం చేసుకొని సారీ చెప్పు అని అంటుంది. ఇక హర్ష లోపలికి వెళ్లి నందిని పడుకున్న మంచం పై కూర్చుంటాడు. అప్పుడు నందిని వెళ్లిపోతుంటే చెయ్యి పట్టుకొని ఆపుతాడు.. నువ్వు ఎందుకు మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటావు. నువ్వు అనుకున్న అది లేదు. అవును బయట తిట్టడం ఇక్కడ సారీ చెప్పడం ఆలోచించండి అని అంటుంది. తన ఇంట్లో వాళ్లకు నేనంటే ప్రేమ లేదు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి నువ్వు వచ్చి చేరావు అని ఫీల్ అవుతుంది..

Advertisement

సత్య క్రిష్ కోపంగా వెళ్లాడని టెన్షన్ పడుతూ ఉంటుంది. గొడవకు వెళ్లిన మనిషి ఇంకా రాలేదు ఏమైంది అంటూ గాబారా పడుతుంది. అప్పుడే క్రిష్ బాపు అని అరుస్తాడు. అది విని బయటకు వస్తుంది. క్రిష్ ఈ రక్తం ఏంటి ఏమైంది అంటుంది. అప్పుడే మహదేవయ్య, భైరవి అందరు బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు.. ఏమయిందిగా చిన్నా అంటే ఆ ఎమ్మెల్యే కొడుకుకు రంగు పడింది అంటాడు. ఇక ఎమ్మెల్యే పదవి పేరు వింటే వణికి పోతాడు. నువ్వు ఎమ్మెల్యే అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు అంటాడు. భైరవి చూసావా పెనిమిటి నేను ఎలాంటి కొడుకును కన్నానో అంటుంది. ఇక మహదేవయ్య సత్యను చూస్తూ నేనంటే నీకు ఎందుకు అంత అభిమానం, ఎందుకు అంత ప్రేమ అంటాడు. ఇక చాలురా నువ్వు ఈ బాపు గురించి మర్చిపోయి సంతోషంగా ఉండు అంటాడు. దానికి క్రిష్ గన్ తీసుకొని నన్ను చంపేయి అంటాడు. ఇక సత్య లోపలికి వెళ్తుంటే ఏడీకి వెళ్తున్నావ్ అని భైరవి అడుగుతుంది.

లోపలికి అంటుంది. చిన్నా నెత్తురుతో నడింట్లోకి వెళ్ళకూడదు.. శుభ్రం చేసి తీసుకురా అని అంటుంది. చిన్నా కు అంటుకున్న నెత్తుటీ మరకలను నీ చేత్తో కడుగు అంటాడు.. అప్పుడు సత్య క్రిష్ ను కడుగుతుంది. ఇక లోపలికి వెళ్తుంది. బెడ్ పై దిగులుగా కూర్చుంటుంది. క్రిష్ వచ్చి సత్య నీ బాధ అర్థం అయ్యింది కొన్ని దినాలు ఓపిక పట్టు అని అంటాడు. నాకు ఏమి కాదు దేవుడిని నమ్ముతావు కదా.. ఎలా రాసి పెట్టింటే అలా జరుగుతుంది అంటాడు. దానికి ఎన్ని రోజులు ఓపిక పట్టాలి చెప్పు కృష్ణ అంటుంది. మీ బాపు స్వార్థం కోసం చేయిస్తున్నాడనీ అంటుంది. దానికి సీరియస్ అయిన క్రిష్ సత్యను కొట్టాలని చూస్తాడు.. సత్యకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక మైత్రి వెళ్తుంటే హర్ష టాబ్లెట్ వేసుకో అంటాడు. నందిని గురించి పెద్దగా ఆలోచించకు తాను అమాయకురాలు అంటావ్ కదా అంటే అవును మీ మధ్య గొడవలకు కారణం నేను అవ్వకూడదు అని అంటుంది. ఇక క్రిష్ ఒక స్కెచ్ ను మహాదేయ్యకు చూపిస్తాడు. మొన్న నీ మీద ఆటాక్ జరిగింది కదా అందులో వీడు ఉన్నాడు. అంటే మహదేవయ్య రుద్ర షాక్ అవుతారు. ఆ స్కెచ్ ను నేను పోలీసులకు కూడా పంపించాను అరెస్ట్ చేస్తామని చెప్పారు అని సత్య అంటుంది. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×