E-Paper
Advertisement

Actress Sandra: విడాకుల తర్వాత నరకం చూశా…ఎమోషనల్ అయిన సాండ్రా!

Actress Sandra: విడాకుల తర్వాత నరకం చూశా…ఎమోషనల్ అయిన సాండ్రా!
Advertisement

Actress Sandra: బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్న వారిలో నటి సాండ్రా ఒకరు. ముద్దమందారం కలవారి కోడళ్ళు ఆటో శాంతి వంటి సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సాండ్రా ఇటీవల మరొక బుల్లితెర నటుడు మహేష్ కాళిదాసు అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సాండ్రా ఇదివరకే పెళ్లి చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చి రెండోసారి నటుడు మహేష్ ను పెళ్ళి చేసుకున్నారు.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గా మహేష్ సాండ్రా..

వీరి వివాహం గత ఏడాది అక్టోబర్ నెలలో అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో జరిగింది. ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ జంట మొదటిసారి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ (Mad For Each Other)అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమోలో భాగంగా నటి సాండ్రా తన విడాకుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా శ్రీముఖి సెకండ్ ఛాన్స్ ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్న వేస్తుంది.

Advertisement

విడాకుల జీవితం చాలా కష్టం..

ఈ ప్రశ్నకు సాండ్రా సమాధానం చెబుతూ.. అందరికీ తెలిసిందే నేను ఇదివరకే పెళ్లి చేసుకున్నాను కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయాము. విడాకుల తర్వాత నా జీవితం చాలా కష్టంగా మారిపోయిందని నాకు ఇంకా ఎవరు దొరకరని భావించాను. అలాంటి సమయంలోనే ఈయన వచ్చారు. ఈయన రావడం కూడా ఆ భగవంతుడి అనుగ్రహంతోనే జరిగింది అంటూ మొదటి పెళ్లి తర్వాత విడాకుల జీవితం గురించి అలాగే రెండో పెళ్లి గురించి ఈ సందర్భంగా సాండ్రా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె మొదటి భర్త ఎవరు ఎందుకు విడిపోయారు అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.

Advertisement

సాండ్రా 19 సంవత్సరాల వయసులోనే తనకు మొదటి పెళ్లి అయ్యిందని గతంలో పలు సందర్భాలలో తెలియచేశారు. మహేష్ మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మహేష్ సాండ్ర ఇద్దరు జంటగా శుభస్య శీఘ్రమ్ అనే సీరియల్లో కలిసి జంటగా నటించారు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక సాండ్రా కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించి వెండితెరపై సందడి చేశారు.

Also Read: Haritha Harish: భార్య కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్.. తప్పు చేశానంటూ

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×