E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Srivalli : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ మూవీ నుంచి వల్లక్క అవుట్.. ఎందుకంటే..?

Illu Illaalu Pillalu Srivalli : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ మూవీ నుంచి వల్లక్క అవుట్.. ఎందుకంటే..?
Advertisement

Illu Illaalu Pillalu Srivalli : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కుటుంబ కథ స్టోరీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఒక అనాధగా ఉన్న ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు.. ఆ కుటుంబాన్ని దూరమవ్వకుండా ముక్కలు చేయాలనుకున్న వాళ్ళ భరతం పడుతూ కాపాడుకుంటూ వస్తున్నాడు రామరాజు.. అందరూ బాగానే ఉన్నారు కానీ ఆ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన శ్రీవల్లి మాత్రం ఎప్పుడూ తనదే పై చేయి కావాలని అందరిని ఇరికిస్తూ సంతోషపడుతూ వస్తుంది.. అయితే ఆ ఇంటి ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్న శ్రీవల్లి గురించి అందరికీ తెలిసిపోతుంది..

రామరాజుకు మాత్రమే ఈ విషయం గురించి తెలియదు.. ఇదిలా ఉండగా ఈ సీరియల్ లో రామరాజు చిన్న కోడలు పాత్రలో ప్రేమ నటించింది. అందులో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లావణ్య నటించింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఇటీవలే ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు సీరియల్ ని మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్న శ్రీవల్లి గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే శ్రీవల్లి ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పబోతుందా? లేదా? అన్నది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సీరియల్ కు శ్రీవల్లి గుడ్ బై.. 

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీ రోజురోజుకీ ఆసక్తిగా మారుతుంది. మొన్నటి ఎపిసోడ్ లు మాత్రం ప్రేక్షకులకు విపరీతంగా విసుగు పుట్టించాయి. ప్రస్తుతం ఈ సీరియల్ జనాలకి బాగా రీచ్ అవుతుందని టిఆర్పి రేటింగ్ అని చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ సీరియల్ కి హైలెట్గా నిలిచిన శ్రీవల్లి గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే శ్రీవల్లి అలియాస్ త్రివేణి యాదవ్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా? వేరే ఏదైనా కారణాలవల్ల సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

త్రివేణి యాదవ్ బ్యాగ్రౌండ్.. 

శ్రీవల్లి ఒరిజినల్ పేరు త్రివేణి యాదవ్.. జెమినీ టీవీలో ప్రసారం అయిన సుందరి సీరియల్ హీరోయిన్ త్రివేణి. ఈమె పూర్తి పేరు త్రివేణి యాదవ్ . జీ తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్‌తో ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాలు సీరియల్స్ చేసి బాగా బిజీగా మారిన ఈ అమ్మడు ఒక్క రోజుకి దాదాపు 20 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ లెక్కన నెలకు లక్షల్లో సంపాదిస్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అక్కడ కూడా బాగానే సంపాదిస్తూ వస్తుంది.

Advertisement

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×