Actress Rashi Khanna Latest Pics: అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ముద్దు గుమ్మ రాశీ ఖన్నా..
మోడలింగ్ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది ఈ భామ.
నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన “ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు స్థానాన్ని ఏర్పరచుకుంది.
చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా తొలి సినిమాతోనే కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.
ఆ తర్వాత బెంగాల్ టైగర్, సుప్రీమ్ , జై లవకుశ, తొలి ప్రేమ , వెంకీ మామ, ప్రతిరోజు పండగే, సర్దార్, శ్రీనివాస కళ్యాణం, వంటి సినిమాల్లో నటించింది.
రాశీ ఖన్నా సినిమాల్లో హారోయిన్ గా అరంగేట్రం చేయడమే కాకుండా వివిధ భాషల్లో పాటలు కూడా పాడింది.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాశీ ఖన్నా .. థాంక్యూ సినిమాతో మళ్లీ తెరప కనిపించింది. ఆ తర్వాత ఫర్జీవెబ్ సిరీస్ తో ఓటీటీలో ఈముద్దుగుమ్మ వార్తల్లో నిలిచింది.
ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా పట్టు చీరలో ఎంతో అందంగా ఒక్కో పోటోకి ఒక్కో ఫోజులిస్తూ కుర్రకారును మైమరిపించేలా చేసింది ఈ భామ.