Black Jalebi Preparation: వంటలకు భారతదేశం పెట్టింది పేరు. రుచికరమైన వంటలు తినాలంటే అది కేవలం భారత్ లోనే సాధ్యం మరి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం రుచికరమైన సాంప్రదాయ వంటలకు పెట్టింది పేరు. వంటలే కాదు అన్ని రకాల ఆహార పదార్థాలను తయారు చేయడంలో భారత దేశం నెంబర్ వన్ అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త పదార్థాలను అందుబాటులోకి తీసుకురావడంలోను ముందుటుంది. అయితే ముఖ్యంగా స్వీట్లలో ఇండియా ఫేమస్. రకారకాల రుచికరమైన స్వీట్లను తయారు చేయడంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందులోను జిలేబీ, బాదూషా వంటి ప్రాచీనకాలం స్వీట్ల తయారీలో ముందుటుంది.
అయితే జిలేబీలో చాలా రకాల జిలేబీలను చూసి ఉంటాం. కానీ నలుపు రంగు జిలేబీలను ఎప్పుడు చూసి ఉండరు. అసలు భారత దేశంలోని ఏ ప్రాంతంలోను ఇటువంటి జిలేబీలు ఇప్పటి వరకు తయారు చేసినట్లు అయితే దాఖలాలు లేవు. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ స్వీట్ షాపులో పని చేసే వ్యక్తి నలుపు రంగు జిలేబీలను తయారు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా అయితే జిలేబీలు ఎరుపు లేదా నారింజ రంగులో తయారు చేయడం చూసే ఉంటాం. కానీ జిలేబీలను నలుపు రంగులో తయారు చేయడం మాత్రం చాలా తక్కువగా చూస్తాం. అయితే నలుపు రంగు జిలేబీలను ఓ వ్యక్తి తయారుచేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి జిలేబీ పిండిని కలిపి సాధారణంగా కాల్చడానికి ప్రయత్నించాడు. ఈ తరుణంలో జిలేబీలను నూనెలో గుండ్రంగా వేశాడు. అనంతరం అవి మొదట ఎరుపు రంగులో కనిపించినా.. తర్వాత నలుపు రంగులోకి మారిపోయాయి. ఇలా నలుపు రంగులోకి కాల్చిన జిలేబీలను తీసి ఆ వ్యక్తి చక్కెర పానకంలో వేసి కాసేపు ఉంచాడు. అనంతరం వాటిని తీసి పక్కన పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read: Viral Video: ఇద్దరు లవర్స్‌తో కలిసి హోటల్‌లో భార్య రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..
బ్లాక్ జిలేబీలను మొదటి సారి చూసిన కొంత మంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్ స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్లు విభిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన బంగ్లాదేశ్ లో వెలుగుచూసినట్లు సమాచారం. బంగ్లాదేశ్ లోని సన్ ఫ్లవర్ జిలేబీని తయారు చేసే వ్యక్తి అని సమాచారం.
?utm_source=ig_web_copy_link">