BigTV English

TDP MP Candidate Srikrishna’s Vehicles Attacked: పల్నాడులో వైసీపీ కేడర్ దాడులు.. ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్‌పై దాడి!

TDP MP Candidate Srikrishna’s Vehicles Attacked: పల్నాడులో వైసీపీ కేడర్ దాడులు.. ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్‌పై దాడి!

YCP Leaders Attack on TDP MP Candidate Srikrishna’s Vehicles in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌లో వైసీపీ విధ్వంసం కొనసాగుతోంది. ముఖ్యంగా కడప, అనంతపురంతోపాటు పల్నాడులో వైసీపీ కేడర్ రెచ్చిపోయింది. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.


టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్ వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకుని ఆయన బయటపడ్డారు. పోలింగ్ బూత్‌లో ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయ.

పోలింగ్ స్టేషన్ వచ్చేవారిని వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయ. తన కాన్వాయ్ వాహనాలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడులు చేయడం కరెక్ట్ కాదని, ఈ విషయంలో పోలీసులు చోద్యం చూస్తున్నారన్నాని మండిపడ్డారు. దొండపాడులో కచ్చితంగా రీపోలింగ్ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.


Also Read: పోలింగ్ బూత్ వద్ద దారుణం, ఓటర్‌ని కొట్టిన వైసీపీ అభ్యర్థి శివకుమార్

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో వైసీపీ- టీడీపీ వర్గాల ఘర్షణ చోటు చేసుకుంది. దాదాపు అరగంట పాటు పోలింగ్ కేంద్రం ఎదుట ఇరువర్గాల నేతలు దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. సమీపంలో ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చివరకు తమ లాఠీలతో ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో ప్రస్తుతానికి అక్కడి వాతావరణం నార్మల్‌గానే ఉందన్నది పోలీసుల మాట.

Ysrcp cadre evms damage at palnadu
Ysrcp cadre evms damage at palnadu

మరోవైపు పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పలుచోట్ల పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. 205, 206, 207, 216 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆగిపోయింది.

Also Read: ST SC Atrocity case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన, ఏం జరిగింది?

Tags

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×