E-Paper
Advertisement

Godzilla x Kong The New Empire: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. కానీ..

Godzilla x Kong The New Empire: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. కానీ..
Advertisement

Godzilla x Kong The New Empire OTT Streaming: హాలీవుడ్ మూవీలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం. హాలీవుడ్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే థియేటర్లకు పరుగులు తీస్తారు. అందులోనూ ప్రాంచైజీ మూవీలకు మంచి క్రేజ్ కూడా ఉంది. అందువల్ల ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన హాలీవుడ్ ఓ సూపర్ హిట్ మూవీ తాజాగా ఊహించని విధంగా ఓటీటీలోకి వచ్చేసింది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ మూవీ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కూడా భారీ కలెక్షన్లను సైతం ఈ మూవీ రాబట్టింది.

Advertisement

అయితే థియేటర్ల‌లో రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ గాడ్జిల్లా vs కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ బుక్ మై షో యాప్ ద్వారా ఈ మూవీని చూడొచ్చు.

Also Read: పవన్ కల్యాణ్‌కే నా సపోర్ట్.. నంద్యాల టూర్‌పై అల్లు అర్జున్ క్లారిటీ.. వీడియో వైరల్

Advertisement

అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ప్రస్తుతం ఈ మూవీని ఫ్రీగా చూసే అవకాశం లేదు. కేవలం కొనడం లేదా రెంట్ విధానంలో మాత్రమే చూసే వీలుంది. ఈ చిత్రం కోసం టికెట్లు కొనుగోలు చేసే అవకాశంతో పాటు.. స్ట్రీమింగ్‌ను కూడా అందించే ఛాన్స్‌ను బుక్ మై షో ఓటీటీ ఇచ్చింది.

అయితే దీనిని ఓటీటీలో చూడాలంటే భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. రెంట్ విధానంలో రూ.549 చెల్లించాలి. ఇక కొనాలంటే రూ.799 చెల్లించక తప్పదు. ఈ మూవీ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది.

Also Read: Ramayanam: హైప్ పెంచేస్తున్న ‘రామాయణం’.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

కాగా ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఇంకా థియేటర్లలో అదరగొడుతూనే ఉంది. ఐమ్యాక్స్ 3డీ వెర్షన్‌తో పాటు 4డీఎక్స్, 3డీ, 2డీ వెర్షన్లలోనూ ఈ మూవీ చూడొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు యూట్యూబ్‌లో మే 14 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే వీటిలోనూ రెంటల్ విధానంలోనే చూసే వీలుంటుంది. ఈ సినిమాను 15 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.52.4 కోట్ల డాలర్ల కలెక్షన్లను రాబట్టి అదరగొట్టింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×