Lok Sabha Elections 2024 Highlights: సార్వత్రిక ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ వివరాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 గంట వరకు నమోదు అయినా పోలింగ్ శాతం..40.38. ఇక మిగతా జిల్లాల్లో ఓటింగ్ సరళి ఇలా ఉంది.
Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ
సికింద్రబాద్ కంటోన్మెంట్ బైపోల్ కు సంబంధించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 29.03 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధిక పోలిక నమోదైన పార్లమెంట్ సెగ్మెంట్ జహీరాబాద్ 50.71% కాగా అత్యల్పంగా హైదరాబాద్ 19.37 లో నమోదైంది.
ఇప్పటి వరకు 40% శాతం పోలింగ్ అయ్యిందని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటే 3, 4% ఎక్కువే ఉందని పేర్కొన్నారు. కాగా ఈ ఉదయం ఈవీఎంలలో ఒకట్రెండు ప్రదేశాల్లో ఇబ్బంది కల్గిందని చెప్పారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని.. హైదరాబాద్ అభ్యర్థి పై కేసు నమోదు అయ్యిందని చెప్పారు.
Also Read: ST SC Atrocity case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన, ఏం జరిగింది?
పాతబస్తీలో రెండు మూడు ఫిర్యాదులు వచ్చాయన్నారు వికాస్ రాజ్. జహీరాబాద్, నిజామాబాద్‌లో ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై విచారణ జరగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఫిర్యాదులు వచ్చాయిని.. వాటిపై కూడా సమగ్ర విచారణ జరగుతుందని పేర్కొన్నారు. ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుందని వికాస్ రాజ్ చెప్పారు.