BigTV English

Offers on Gaming Laptops: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధరకే గేమింగ్ ల్యాప్‌టాప్‌‌లు.. ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

Offers on Gaming Laptops: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధరకే గేమింగ్ ల్యాప్‌టాప్‌‌లు.. ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

Offers on MSI GF63, Lenovo, ASUS ROG Strix Gaming Laptops: కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ప్రజలు తమ జీవితంలో విభిన్న గాడ్జెట్‌లను ఒక భాగంగా చేసుకుంటున్నారు. కాలక్రమేణా.. వినియోగదారులు కంప్యూటర్‌లను విడిచిపెట్టి ల్యాప్‌టాప్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కంపెనీలు మంచి ఫీచర్లతో, అదిరిపోయే లుక్‌ కలిగిన ల్యాప్ టాప్‌లను విడుదల చేస్తున్నాయి.


అంతేకాకుండా ఈ ల్యాప్‌టాప్‌లు వేర్వేరు ధరలు, ఫీచర్లతో వివిధ ప్రయోజనాల కోసం కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు గేమింగ్ కోసం మంచి ల్యాప్‌టాప్‌ల కోసం వెతుకుతున్నట్లయితే.. అనేక అద్భుతమైన ఫీచర్లతో కూడిన గేమింగ్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు సాధారణంగా రూ.80 వేలకు పైగా లభిస్తాయి. మీరు సేల్ సహాయంతో ఖరీదైన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను చౌకగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లలో సేల్ జరుగుతోంది. ఇక్కడ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 46 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

MSI GF63 Intel Core i5 Laptop


MSIకి సంబంధించిన GF63 Intel Core i5 ల్యాప్‌టాప్‌ను 43 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 12వ Gen 12450Hతో కూడిన ఈ ల్యాప్‌టాప్ రూ.97,990కి బదులుగా రూ.54,990కి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇది 16 GB RAM + 512 GB SSD తో వస్తుంది. Windows 11 మద్దతుతో ఈ ల్యాప్‌టాప్ 4 GB గ్రాఫిక్స్/NVIDIA GeForce RTX 2050ని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఇన్‌ఫినిక్స్ నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్.. మే 21న లాంచ్!

Lenovo IdeaPad Gaming 3 AMD Ryzen

Lenovo IdeaPad Gaming 3 AMD Ryzen ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) 44 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది 15.6 అంగుళాలు, 4 GB గ్రాఫిక్స్/ NVIDIA GeForce RTX 2050తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను రూ.77,990కి బదులుగా రూ.43,490కి కొనుగోలు చేయవచ్చు. ఇది 8 GB RAM + 512 GB SSDని కలిగి ఉంది. అలాగే Flipkart నుండి UPI లావాదేవీపై మొదటిసారిగా రూ.25 తక్షణ తగ్గింపును పొందుతారు. ఇది కాకుండా, Flipkart Axis బ్యాంక్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2000 తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.28,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

MSI GF63 Thin Laptop

సన్నని గేమింగ్ ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. MSI F63 మంచి ఎంపిక. ఇది Intel Core i5-11260H Up To 4.4 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 8GB DDR4 3200MHz RAM + 512GB NVMe PCIe Gen3x4 SSD నిల్వను కలిగి ఉంది. Nvidia Geforce GTX 1650, GDDR6 4GB గ్రాఫిక్స్ సపోర్ట్‌తో వస్తున్న ల్యాప్‌టాప్‌ను రూ.78,990కి బదులుగా రూ.42,990కి కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై 46 శాతం ప్రత్యక్ష తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Also Read: HMD Arrow Smartphone: హెచ్ఎండీ ‘యారో’ తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. బడ్జెట్ ధరలోనే కొనేయొచ్చు..!

ASUS ROG Strix G15 Laptop

ASUS ROG Strix G15 ల్యాప్‌టాప్‌ 15.6-అంగుళాల డిస్‌ప్లేతో, 16GB ర్యామ్+ 1TB SSD సపోర్ట్‌తో వస్తుంది. దీనిని 26 శాతం తగ్గింపుతో Amazon ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.1,17,990కి బదులుగా రూ.86,990కి సొంతం చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×