BigTV English

CM Revanth Reddy Casts Vote: కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

CM Revanth Reddy Casts Vote: కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

Telangana CM Revanth Reddy Casts Vote In Kodangal: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అతని భార్య, కూతురు ఓటేశారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, కూతురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని., ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖయమని సీఎం అన్నారు. దేశంలో అబ్ కీ బార్ 400 అంటున్నారు.. 336 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి 400 సీట్లు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని అన్నారు.

దేశంలోమ మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి పేరుతో ప్రజలను తాము ఓట్లు అడుగుతుంటే బీజేపీ మాత్రం మోదీ పేరుతో ఓట్లు అడుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ప్రశ్నించారు సీఎం. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. రైతు బంధు ఎలా ఇచ్చామో.. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.


Also Read: Voters: హైదరాబాద్ బాట పట్టిన ఓటర్లు.. రహదారుల్లో వాహనాల రద్దీ

కేసీఆర్ పై తనకు సానుభూతి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారన్నారు సీఎం. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×