E-Paper
Advertisement

Muslim Voters: ముస్లిం ఓటర్లపై మాధవీలత, ధర్మపురి అరవింద్ అభ్యంతరం.. వీడియో వైరల్

Muslim Voters: ముస్లిం ఓటర్లపై మాధవీలత, ధర్మపురి అరవింద్ అభ్యంతరం.. వీడియో వైరల్
Advertisement

Lok Sabha Elections 2024 Arvind, Madhavilatha Objection on Muslim Votes: లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినయోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో మహిళా ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రానికి వచ్చిన ముస్లిం మహిళా ఓటర్లను పరిశీలించారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ కూడా బుర్ఖా ధరించి వచ్చిన ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ముస్లిం మహిళా ఓటర్లను తనిఖీ చేశారు. బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారిని పరిశీలించారు. అంతే కాకుండా వారి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను చూసారు. అనంతరం కొందరి పట్ల ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై మండిపడ్డారు. అసలు ప్రభుత్వం తరపున ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులను నమ్మకూడదు అన్నారు.

Advertisement

Also Read: 11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..?

నిజామాబాద్ లో పోలింగ్ కేంద్రానికి ముస్లిం మహిళా ఓటర్లు ఓటు వేయడానికి వచ్చారు. అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఓటు వేయడానికి ఎవరు వచ్చారు ? అనేది ఎలా గుర్తిస్తారని ఓటర్లను ఉద్దేశించి ప్రిసైడింగ్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు బెదిరిస్తే అనుమతిస్తారా అంటూ నిలదీశారు.

Advertisement

Tags

Related News

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

Big Stories

Advertisement
×