Big Stories

UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో సరికొత్త రికార్డులు

New records in UPI payments

New records in UPI payments

దేశంలో యూపీఐ పేమెంట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టీ తాగినా, సిగరెట్ కొన్నా, షాపింగ్ చేసినా… ప్రతీ చోటా యూపీఐ చెల్లింపుల విధానం సౌకర్యవంతంగా ఉండటంతో… అంతా దాని ద్వారానే పేమెంట్ చేస్తున్నారు. అందుకే… గత డిసెంబర్లో యూపీఐ పేమెంట్స్ ఏకంగా రూ.12.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఒక నెలలో నమోదైన యూపీఐ చెల్లింపుల్లో ఇదే ఇప్పటిదాకా అత్యధికం. డిసెంబర్లో 782 కోట్ల లావాదేవీల ద్వారా… రూ.12.82 లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి.

- Advertisement -

2022 అక్టోబర్లో తొలిసారి రూ.12 లక్షల కోట్ల మార్కును దాటాయి… యూపీఐ పేమెంట్స్. నవంబర్లో కాస్త తగ్గి రూ.11.9 లక్షల కోట్లకు పరిమితమైనా… డిసెంబర్లో 92 వేల కోట్లు పెరిగి… రూ.12.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022లో ఏడాది మొత్తం మీద… 7,400 కోట్ల లావాదేవీల ద్వారా… రూ.125.94 లక్షల కోట్ల యూపీఐ చెల్లింపులు జరిగినట్లు… నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా వెల్లడించింది. 2021తో పోలిస్తే ఈ విలువ ఏకంగా 76 శాతం ఎక్కువ.

- Advertisement -

2016లో ప్రారంభమైన యూపీఐ ప్లాట్‌ఫామ్‌… దేశీయంగా డిజిటల్‌ పేమెంట్స్‌ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత… 2019 అక్టోబర్లో తొలిసారి వంద కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత ఏడాదికి, 2020 అక్టోబర్లో యూపీఐ లావాదేవీలు ఒక నెలలో 200 కోట్ల మార్కును అందుకున్నాయి. మరో పదినెలల తర్వాత… 2021 ఆగస్టులో 300 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇవి మరో వంద కోట్లు పెరిగి 400 కోట్లకు చేరడానికి కేవలం 3 నెలలు మాత్రమే పట్టింది. అంటే 2021 నవంబర్ నాటికి. ఏడాది తిరిగే సరికి… దాదాపు రెట్టింపు సంఖ్యలో ఒక నెలలో యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. భవిష్యత్తులో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇంకా పెరుగుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. వచ్చే 3 నుంచి 5 ఏళ్ల కాలంలో… రోజుకు వంద కోట్ల యూపీఐ లావాదేవీలు జరగొచ్చని అంచనా వేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News