Big Stories

Tdp Janasena Seats : పొత్తు లెక్కలు కొలిక్కి.. నియోజకవర్గాల ఇంచార్జ్‌లను ప్రకటించిన టీడీపీ

ap political news

Tdp Janasena Seats News(AP political news): టీడీపీ-జనసేన పొత్తు లెక్కలు ఓ కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు 27 నుంచి 32 MLA సీట్లు ఇవ్వబోతోంది టీడీపీ. అలాగే 3 ఎంపీ సీట్లను కేటాయించనుంది. నిన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రెండుసార్లు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలకు సీట్ల పంపకాలపై చర్చించారు. ఇప్పటికే జనసేనకు ఇచ్చే 25 ఎమ్మెల్యే స్థానాలపై స్పష్టత వచ్చింది.

తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, విశాఖ నార్త్ లేదా సౌత్, చోడవరం లేదా అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ, రాజోలు, గన్నవరం, రాజానగరం, రాజమండ్రి రూరల్‌, అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లేదా కైకలురు, దర్శి, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేక చిత్తూరు, గుంటూరు వెస్ట్, గజపతి నగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. వీటితో పాటు అనంతపురం, ధర్మవరం, ఆళ్లగడ్డ సహా నెల్లూరు జిల్లాలో ఓ స్థానాన్ని, గోదావరి జిల్లాలో మరో 3 స్థానాలను జనసేనాని అడుగుతున్నట్లు సమాచారం. ఇక ఎంపీ స్థానాల్లో కాకినాడ, మచిలీపట్నంతో పాటు అనకాపల్లి లేదా తిరుపతి లేదా నర్సాపురంలో ఏదో ఒక సీటును జనసేనకు కేటాయించనుంది టీడీపీ.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి 7 గురు అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ క్రమంలో టీడీపీ నెల్లూరు ఇంచార్జ్‌ల పేర్లను ప్రకటించింది. నెల్లూరు నుంచి పొంగూరు నారాయణ . నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,ఆత్మకూరు- ఆనం రామ నారాయణ రెడ్డి, సర్వేపల్లి- సోమిరెడ్డి వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ, గూడూరు -పాశం సునీల్ కుమార్, కావలి -కావలి కృష్ణారెడ్డి, కావలి టౌన్- గుత్తికొండ కిషోర్ బాబు లను ఇంచార్జ్‌లు‌గా నియమిస్తూ టీడీపీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

Latest News