Big Stories

Vizag MRO Murder Case : ఎమ్మార్వో రమణ హత్యకేసు.. చెన్నైలో నిందితుడు.. అసలు కారణం ఏంటంటే..

Vizag MRO Murder Case(Andhra news today): విశాఖ ఎమ్మార్వో రమణ హత్య కేసు సంచలనం రేపింది. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. రుషికొండలోని జ్యువెల్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్‌లను 22 ఏ నుంచి తప్పించేందుకు ఎమ్మార్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఎమ్మార్వో, రియల్టర్ గంగారాం మధ్య మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇరువురి మధ్య జ్యువెల్‌ అపార్ట్‌మెంట్స్‌ పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి. ఒప్పందం మేరకు పనులు పూర్తి కాకుండానే ఎమ్మార్వో రమణ బదిలీ కావడంతో గంగారాం ఆందోళనకు గురయ్యారు.

- Advertisement -

బెదిరించైనా పనులు చేయించుకోవాలన్న గంగారాం.. ఐరన్‌ రాడ్‌ తీసుకుని ఎమ్మార్వో ఇంటికి వెళ్లారు. ముందుగానే పథకం వేసుకున్న గంగారాం.. రెగ్యులర్ సిమ్ కాకుండా వేరే సిమ్‌తో ఎమ్మార్వో డ్రైవర్‌తో టచ్‌లో ఉన్నారు. విజయనగరం నుంచి ఎమ్మార్వో రమణ వచ్చే సమయాన్ని డ్రైవర్ ద్వారానే తెలుసుకున్నాడు గంగారాం. ప్రస్తుతం 4 సిమ్‌లు వాడుతున్నట్లు పోలీసులు నిర్దరించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫ్లైట్‌లో వెళ్లినట్టు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. గంగారాం పొరుగు రాష్ట్రంలో ఉన్నారన్న సమాచారంతో.. బెంగుళూర్, చెన్నైకు 10 ప్రత్యేక బృందాలు వెళ్లాయి. అక్కడ విస్తృతంగా గాలిస్తున్నారు. హంతకుడు దొరికితే.. హత్యకు దారి తీసిన పరిస్థితులపై మరింత సమాచారం వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

కాగా.. నిందితుడు హత్య జరిగిన మరుసటిరోజు 12 గంటల వరకూ విశాఖలోనే ఉండి ఆ తర్వాత విమానం ఎక్కి పరారయ్యాడు. ఎయిర్ పోర్టులో గంగారాం ఉండగానే గుర్తించకపోవడంపై సీపీ రవిశంకర్ తీవ్రంగా మండిపడ్డారు. సంబంధిత అధికారులపై ఫైర్ అయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News