Big Stories

Tuni: తుని రైలు దగ్థం కేసు.. సంచలన తీర్పు.. అసలేం జరిగిందంటే..

Tuni: తుని రైలు దహనం కేసు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని షేక్ చేసిందీ ఘటన. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో.. తునిలో.. కాపు రిజర్వేషన్ సాధన కోసం జరిగిన బహిరంగ సభ అదుపు తప్పింది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టింది. బోగీలు తగలబడిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడం ఒక్కటే ఊరట.

- Advertisement -

రైలును తగలబెడితే ఊరుకుంటారా? కాపు సభ పెట్టిన పెద్దలందరిపై కేసులు పెట్టారు. కేసులైతే పెట్టారు కానీ.. వాటిని కోర్టులో రుజువు చేయలేకపోయారు. ఫలితం.. ఆ కేసులన్నిటినీ కొట్టి వేసింది విజయవాడలోని రైల్వే కోర్టు. 41 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, నటుడు జీవీ.. లాంటి ప్రముఖులకు ఊరట లభించింది. 24 మంది సాక్షులుండగా.. 20 మందిని విచారించి తీర్పు ఇచ్చింది కోర్టు.

- Advertisement -

అయితే, కేసు అయితే కొట్టివేసింది కానీ.. తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది రైల్వే కోర్టు. దర్యాప్తు ప్రక్రియలో, నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. ఆధారాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేకపోయారని తప్పుబట్టింది. ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News