Big Stories

Twitter:- ఆర్టికల్ చదవాలంటే డబ్బు కట్టాల్సిందే.. ట్విటర్ కొత్త పాలసీ…

- Advertisement -

Twitter:- సోషల్ మీడియాలో ట్విటర్ అనేది టాప్ ప్లేస్‌లో ఉండేది. కానీ గత కొన్నిరోజులుగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. తీవ్రమైన ట్రోల్స్‌తో ట్విటర్ నిండిపోయింది. ట్విటర్‌లో సైతం ట్విటర్‌పై ట్రోల్స్ వేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. దానికి తగినట్టుగా ట్విటర్ సీఈఓగా అధికారాన్ని అందుకున్న ఎలన్ మస్క్.. కొత్త కొత్త స్కీంలతో యూజర్లు ఆశ్చర్యపరుస్తున్నాడు. ట్విటర్ బ్లూ తర్వాత తాజాగా మరో కొత్త స్కీంతో మస్క్ ముందుకొచ్చాడు.

- Advertisement -

బ్లూ టిక్ కావాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.. నెలకు ఇంత ధరను కట్టాలి.. అనే రూల్‌తో ఒక్కసారిగా యూజర్లను ఒక్కసారిగా షాక్ గురిచేశాడు ఎలన్ మస్క్. ఇప్పుడు వార్తలు చదవాలంటే కూడా ధర కట్టాలి అనే కొత్త రూల్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్టికల్‌కు ఎంత ఛార్జ్ చేయాలి అనే నిర్ణయాన్ని మీడియా హౌజ్‌లకే వదిలేసింది ట్విటర్ యాజమాన్యం. వచ్చే నెల నుండి ఈ కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందని ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించాడు.

ఒక్క క్లిక్‌తో వార్త చదవాలి అనుకునేవారు ఆర్టికల్‌కు కొంత వెల కట్టాల్సి ఉంటుందని ఎలన్ మస్క్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. దీని ద్వారా యూజర్లు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదని, ఏ ఆర్టికల్ చదవాలనుకుంటే ఆ ఆర్టికల్ వరకు డబ్బులు కట్టి చదవవచ్చని తెలిపారు. ఇది ప్రజలకు, మీడియా సంస్థలకు కూడా ఉపయోగకరమైన పాలసీ అని అన్నారు. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అనేది తొలగిపోయిన రెండు రోజుల్లోనే మస్క్ ఇలాంటి ప్లాన్‌తో ముందుకు రావడం ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది.

ఇప్పటికే క్రియేటర్లు కూడా తమ టాలెంట్‌ను బయటపెట్టవచ్చని యాజమాన్యం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లను అందరికీ పరిచయం చేయాలి. దాని ద్వారా వారికి ఆదాయం, చూసేవారికి ఎంటర్‌టైన్మెంట్ అందించాలని ట్విటర్ అనుకుంటుందని మస్క్ ఇప్పటికే బయటపెట్టాడు. అంతే కాకుండా కంటెంట్ క్రియేటర్స్‌కు వచ్చే ఆదాయం నుండి 10 శాతం కట్ తీసుకోవాలని ట్విటర్ నిర్ణయించుకుంది. ఇవి విన్న తర్వాత ట్విటర్ బాగా కమర్షియల్ అయిపోయిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News