Big Stories

MP Prajwal Suspended From JDS: కర్ణాటకలో తీవ్ర దుమారం.. కీలక నిర్ణయం తీసుకున్న జేడీఎస్

MP Prajwal Suspended From JDS: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ కర్ణాటక రాజీకాయాల్లో తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా రాష్ట్రానికి చెందిన జేడీఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. తన పార్టీకి చెందిన ఎంపీని సస్పెండ్ చేసింది. అంతేకాదు.. ఆ ఎంపీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన హాసన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయమై కర్ణాటక రాజీకాయాల్లో తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జేడీఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.

- Advertisement -

అయితే, పార్టీ సస్పెండ్ చేయడానికి ముందుకు ప్రజ్వల్ బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివాదం వెనుక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉన్నదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి వెంటనే తొలగించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా.? ఆ వీడియోల్లో ఉన్నది అతడేనని ఆధారమేంటి? అయినా సరే నైతికత ఆధారంగా చర్యలుంటాయని ఆయన వ్యాఖ్యనించారు. అదేవిధంగా వీడియో క్లిప్పులు ఉన్న పెన్ డ్రైవ్ లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు పంపిణీ చేశారో అనే విషయాలపైనా కూడా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసుతో బీజేపీ, ప్రధాని మోదీకి ఏం సంబంధమంటూ ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా దేవేగౌడకు, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ కన్నడ నాట ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేగడంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకుంటామని జేడీఎస్ పార్టీ సోమవారం పేర్కొన్న విషయం విధితమే.

Also Read: అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం..

ఈ అంశంపై ఇటు కేంద్రమంత్రి అమిత్ షా కూడా స్పందిస్తూ కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇందుకు సంబంధించి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని.. ఈ అంశం ఆ రాష్ట్ర శాంతి భద్రతల అంశమని.. తాము విచారణకు అనుకూలంగా ఉన్నామని.. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఇటు జేడీఎస్ పార్టీ కూడా ఇప్పటికే చెప్పిందని ఆయన అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News