BigTV English

Astrazeneca Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ కు గడ్డకడుతున్న రక్తం.. నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా..!

Astrazeneca Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ కు గడ్డకడుతున్న రక్తం.. నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా..!

Astrazeneca accept that Covishield Vaccine Will Cause Blood Clots: ఒక వార్త.. కోట్లాది ప్రజలను ఆందోళనకు గురిచేసింది. చేస్తోంది. అదే కోవిడ్ వ్యాక్సిన్ గురించిన న్యూస్. కరోనా నుంచి విముక్తి పొందడానికి కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను రెండు, మూడు డోసులు తీసుకున్నాం. వ్యాక్సినేషన్ తర్వాత చాలా మందికి రెండ్రోజులు జ్వరం, తీవ్రమైన ఒళ్లునొప్పులు వచ్చాయి. అయితే.. వ్యాక్సిన్ శరీరానికి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి.. అలాంటి ప్రతికూలతలు కనిపించడం సాధారణమేనని చెప్పారు. అయితే.. ఇప్పుడీ వ్యాక్సిన్ గురించి ఆస్ట్రాజెనెకా కంపెనీ చెప్పిన విషయం అందరినీ ఆందోళనలోకి నెట్టేసింది. కోవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతుందని స్వయంగా అంగీకరించింది.


తొలుత కోవిడ్ వ్యాక్సిన్ కు, రక్తం గడ్డకట్టడానికి సంబంధం లేదని చెప్పిన సంస్థ.. లండన్ నుంచి వచ్చిన రిపోర్ట్ తో అది నిజమేనని ఒప్పుకుంది. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లండన్ లో చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో జామీ స్కాట్ కూడా ఒకరు. వ్యాక్సినేషన్ తర్వాత అతని మెదడు దెబ్బతింది. దాంతో లండన్ హైకోర్టులో కేసు వేశారు. దీంతో ఆస్ట్రాజెనెకా కంపెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కోర్టు ముందు అంగీకరించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టడం వంటి దుష్ర్పభావాలు కలుగుతాయని అంగీకరించింది.

Also Read: Columbia University tension: కొలంబియా వర్సిటీలో టెన్షన్, అదుపులో కొంతమంది..


శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కు గురయ్యే ప్రమాద శాతం పెరుగుతుంది. దీనినే థ్రోంబో సైటోపెనియా సిండ్రోమ్ (TTS) అంటారు. దీనివల్ల శరీరంలో ప్లేట్ లెట్స్ పడిపోవచ్చు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా ఈ విషయం తెలిసి టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే పేరు వేరైనా.. మెడిసిన్ ఫార్ములా అదే ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ను యూకేలో వాడటం లేదు.

భారత్ లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఆస్ట్రాజెనెకా నుంచి లైసెన్స్ తీసుకుని టీకాను ఉత్పత్తి చేసింది. ఆస్ట్రాజెనెకా అంగీకరించిన దానిపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇంతవరకూ స్పందించలేదు. కొన్ని నెలల క్రితం దేశంలో ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా.. కోవిడ్ వ్యాక్సిన్ తో గుండెపోటులు సంభవించవని ప్రభుత్వం వెల్లడించింది.

Tags

Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×