Big Stories

T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టీమ్స్ ఇవే..

T20 World Cup 2024 Squad England and South Africa Name Their 15-Man Squad: టీ 20 పొట్టి ప్రపంచకప్ రెడీ అయిపోతోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మే ఫస్ట్ న, ప్రపంచకప్ లో ఆడుతున్న ప్రతి జట్లు తమ టీమ్ లను ప్రకటించాల్సి ఉంది. దీంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ తన టీ 20 ప్రపంచకప్ స్క్వాడ్ లను ప్రకటించింది.

- Advertisement -

ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 17లో వివిధ జట్లలో ఆడుతున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు చాలామంది అందులో ఉన్నారు. అయితే మార్క క్రమ్ ను టీ 20 ప్రపంచకప్ నకు సౌతాఫ్రికా కెప్టెన్ గా నియమించింది. హైదరాబాద్ జట్టుకి మొన్నటి వరకు ఉండి, సౌతాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ ను రెండు సార్లు ఛాంపియన్ గా నిలిపిన మార్క్రమ్ ని సౌతాఫ్రికా బోర్డు కెప్టెన్ గా నియమించింది. ఇది చూసి హైదరాబాద్ తల పట్టుకుంది.

- Advertisement -

సంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు, అనవసరంగా రూ.20 కోట్లు పెట్టి మరీ ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ని తెచ్చాం కదా అని మదనపడుతున్నారని సమాచారం. ఆ దేశం మార్క్రమ్ మీద నమ్మకం ఉంచింది. అదే నమ్మకాన్ని హైదరాబాద్ ఉంచలేదని నెటిజన్లు అప్పుడే తెగ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: 3 వేల పరుగుల మార్క్ దాటిన.. శ్రేయాస్

మార్క్రమ్ తర్వాత బార్ట్ మన్ , కొయెట్జీ, క్వింటాన్ డికాక్, ఫార్చ్యూన్, హెండ్రిక్స్, జాన్సన్, క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, నోర్ట్ జే, రబాడ, రికెల్టన్, షంసీ, స్టబ్స్ ఉన్నారు.

వీరిలో చాలామంది ప్రస్తుత మన దేశంలో జరుగుతున్న ఐపీఎల్ లో ఆడుతున్నారు. వారిలో కేశవ్ మహరాజ్ (రాజస్థాన్ రాయల్స్ ), కగిసో రబడా (పంజాబ్ కింగ్స్), స్టబ్స్ ( ఢిల్లీ క్యాపిటల్స్ ) మార్కో జాన్సన్, క్లాసెన్ ( హైదరాబాద్ ), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), డేవిడ్ మిల్లర్ ( గుజరాత్ టైటాన్స్), కొయెట్జీ (ముంబయి ఇండియన్స్) ఇలా పలువురు వివిధ టీమ్ ల్లో ఉన్నారు.

ఒకరకంగా చూస్తే ఐపీఎల్ లో ఆడుతున్న వీరినే సౌతాఫ్రికా కూడా టీ 20 ప్రపంచకప్ నకు ఎంపిక చేసిందని అంతా అనుకుంటున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు: మార్క్‌రామ్ (సి), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడ, షంసీ,ట్రిస్టన్ స్టబ్స్.

ఇక ఇంగ్లండ్ జట్టు విషయానికి వస్తే జాస్ బట్లర్ జట్టును ముందుండి నడిపించనుండగా.. ఆర్సీబీ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన విల్ జాక్స్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. స్పీడ్ గన్ జోఫ్రా ఆర్చర్‌‌కు ప్రపంచ కప్ స్క్వాడ్ లో చోటు దక్కింది.

ఇంగ్లండ్ జట్టు: జాస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News