Big Stories

Brahmanandam Art: శ్రీశ్రీ పెయింటింగ్.. బ్రహ్మీ ఎంత బాగా వేశాడో చూడండి..!

Brahmanandam Drawing Sri Sri Picture: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్ని భాషల్లో ఆయన నటించి మెప్పించారు. 68 ఏళ్ల వయస్సులో ప్రస్తుతం బ్రహ్మీ చాలా సెలక్టెడ్ గా మూవీస్ చేస్తున్నాడు. కొంచెంసేపు కనిపించినా కూడా ఆయన ముఖం కనిపించగానే ప్రేక్షకులు నవ్వడం మొదలుపెట్టేస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

- Advertisement -

ఇక బ్రహ్మీ మల్టీ ట్యాలెంటెడ్ అన్న విషయం కూడా అందరికి తెల్సిందే. లెక్చరర్ గా కెరీర్ మొదలుపెట్టి నటనపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి.. సినిమాల వైపు అడుగులు వేసి ఇంత స్థాయికి వచ్చాడు. ఇక బ్రహ్మీ మంచి కళాకారుడు. పెయింటింగ్ వేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన చేతినుంచి జాలువారిన చిత్రాలు ఎన్నో. గతంలో శ్రీరాముడు ఆంజనేయుడిని హత్తుకున్న ఫోటో నెట్టింట ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

శ్రీ వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ కూడా అంతే వైరల్ గా మారింది. తన ఇంటికి వచ్చిన ప్రముఖులకు కూడా బ్రహ్మీ తన చేత్తో గీసిన చిత్రాలను గిఫ్ట్ గా ఇస్తాడు. ఈ మధ్యకాలంలో చిరుకు ఇలాంటి గిఫ్ట్ నే ఇచ్చాడు హాస్య బ్రహ్మ. ఇక తాజాగా నేడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని గీసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బ్రహ్మీ కొడుకు గౌతమ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

Also Read: Say no to Child Labour : శ్రమ విడిచిపెట్టాలి.. పుస్తకం పట్టాలి : 22 ఏళ్ల క్రితం వీడియో షేర్ చేసిన చిరంజీవి

శ్రీశ్రీ ముఖ చిత్రాన్ని బ్రహ్మీ గీస్తున్న ఫోటోతో పాటు శ్రీశ్రీ చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ.. తన తండ్రి గీసిన అద్భుతమైన స్కెచెస్ లో ఇది ఒకటని తెలుపుతూ శ్రీశ్రీగారి జయంతి సందర్భంగా అనే క్యాప్షన్ ఇచ్చాడు. అయితే గతేడాది గీసిన చిత్రంలా కనిపిస్తుంది. అయినా కూడా బ్రహ్మీలోని ఈ టాలెంట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇది హాస్య బ్రహ్మ గొప్పతనం అని కొందరు.. ఆర్ట్.. ఆర్టిస్ట్ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News