Big Stories

NDA Alliance Joint Manifesto: ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. అమరావతే రాజధాని..

NDA Alliance Joint Manifesto(Latest news in Andhra Pradesh): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.

- Advertisement -

ఇది కూటమి మేనిఫెస్టో అయినా సరే పూర్తిగా టీడీపీ-జనసేన మేనిఫెస్టోగానే తెలుస్తోంది. అయితే ఈ మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించిన హామీలను, వాగ్దానాలకు ప్రస్థావించలేదు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసినందున.. ప్రత్యేకంగా ఉమ్మడి మేనిఫెస్టోలో తమ అంశాలను చేర్చాల్సిన పని లేదని సిద్దార్థ్ నాథ్ సింగ్ వెల్లడించారు. టీడీపీ-జనసేన నేతలతో కలిసి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. తమకు స్థానిక మేనిఫెస్టోలు ఉండవని సిద్దార్థ్ నాథ్ స్పష్టం చేశారు. తాము జాతీయ స్థాయిలో మాత్రమే మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు.

- Advertisement -

మేనిఫెస్టో రూపొందినప్పుడు బీజేపీ సూచనలు తీసుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మేనిఫెస్టోకు బీజేపీ పూర్తి మద్దతు ఉందని తెలియజేశారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రధానాంశంగా దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో అమలు బాధ్యత టీడీపీ-జనసేనలదే అని చంద్రబాబు స్పష్టం చేశారు. రేపటి ఆకాంక్షలను సాకారం దిశగానే తమ మేనిఫెస్టోను తయారు చేశామని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఆడబిడ్డ పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు అందజేత.
మహిళందరికీ ఉచిత బస్సు ప్రయాణం.
దీపం పథకం కింద ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచిత పంపిణీ.
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.
ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
‘తల్లికి వందన’ కింద చదువుకున్న పిల్లలు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
రైతులకు ఏడాదికి రు.20 వేల చొప్పున ఆర్థిక సాయం.
ఆక్వారైతులకు రు.1.50కే యూనిట్ విద్యుత్.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకే రూ.20వేల ఆర్థిక సాయం.
బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.
ప్రతిపేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం. నాణ్యమైన సామాగ్రితో ఇంటి నిర్మాణం.
ఉచిత ఇసుక.
భూ హక్కు చట్టం రద్దు.
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.
వృద్ధాప్య పింఛను నెలకు రూ.4 వేలు, పెంచిన పింఛను ఏప్రిల్-2024 నుంచే అమలు.
బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4వేల పింఛను.
రాజధానిగా అమరావతి కొనసాగింపు.
కలలకు రెక్కల పథకం ద్వారా వడ్డీలేని రుణాలు.
ఎన్డీయే తెచ్చిన ఈబీసీల 10 శాతం రిజర్వేషన్ అమలు.
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు.
వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం.
కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్ల ఖర్చు.
ఆదరణ పథకం కింద రూ.5వేల కోట్ల ఖర్చు.
ఆలయాల్లో పనిచేసే నాయాబ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం.
గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు.
ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News