Big Stories

Toyota Rumion Launch: టయోటా రూమియన్ MVP వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?

Toyota Rumion New Variant Launch: జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా భారత మార్కెట్లో అనేక శక్తివంతమైన వాహనాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కంపెనీ బడ్జెట్ ఎమ్‌పివిగా రూమియన్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇందులో పవర్‌ఫుల్ ఇంజన్ అందించారు. అనేక లేటెస్ట్ ఫీచర్లను తీసుకొచ్చారు. అంతే కాకుండా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ MPV కొత్త వేరియంట్‌లో టయోటా ఏ ఫీచర్లను విడుదల చేసింది? ధర ఎంత? తదితర విషయాలను తెలుసుకోండి.

- Advertisement -

టయోటా రూమియన్ కొత్త వేరియంట్ భారతదేశంలో బడ్జెట్ MPVగా అందించబడే Rumion, G-AT కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ తన కొత్త వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది. దీనితో పాటు కొత్త వేరియంట్‌లలో మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఈ కొత్త వేరియంట్ ఫీచర్ల విషయానికి వస్తే G-AT ఆఫ్ రూమియన్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, 17.78 సెం.మీ స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, రిమోట్ కంట్రోల్ క్లైమేట్, లాక్/అన్‌లాక్, హజార్డ్ లైట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, హిల్ హోల్డ్, ESP, బ్రేక్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్లతో తీసుకొచ్చారు.

Also Read: 1980-90లలో ప్రజల హృదయాలను గెలుచుకున్న కార్లు ఇవే.. వీటి క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది!

టయోటా G-AT వేరియంట్‌లో 1.5 లీటర్ K సిరీస్ ఇంజన్‌ను అందించారు. ఇది 75.8 కిలోవాట్ల పవర్, 136.8 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్‌లో కంపెనీ ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. దీనితో నియో డ్రైవ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు.

టయోటా రూమియన్ కొత్త G-AT వేరియంట్‌ను కంపెనీ రూ. 13 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. అలానే ఈ వేరియంట్‌ను రూ.11 వేలతో బుక్ చేసుకోవచ్చు. మే 5, 2024 నుండి ఈ వేరియంట్ డెలివరీని ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.

Also Read: యాక్టివా, జూపిటర్.. ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్..? ఏది కొనాలి..?

టయోటా రూమియన్ కొత్త G-AT వేరియంట్‌ మారుతి ఎర్టిగా, కియా కేరెన్స్‌లతో పోటీ పడుతుంది. దీనిలో AMT, DCT, IMT వంటి మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో రూమియన్ ఈ రెండు MPVలతో నేరుగా పోటీపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News