Big Stories

EC New Rules for Elections: పార్టీలకు ఈసీ లేఖ.. 48 గంటల ముందు అప్లై.. అలాగైతే ఛాన్స్!

EC New Rules for Elections:
EC New Rules for Elections:

EC New Rules for Elections: ఏపీలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. అధికార వైసీపీ – విపక్ష టీడీపీ మధ్య మాటలు, పరస్పర దాడులతో అధికార యంత్రాంగానికి ఇబ్బందులు తప్పలేదు. దీనికితోడు పార్టీలు చీటికి మాటికీ ఒకరిపై మరొకరు ఫిర్యాదు, అధికారులను పలిపించి సంజాయితీ అడగడం నేపథ్యంలో ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కొత్త రూల్స్‌ని తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో ఆయన పార్టీలకు ఓ లేఖ కూడా రాశారు.

- Advertisement -

అందులోకి ముఖ్యమైన కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్లు, స్టేట్ వైడ్ నాయుకులతోపాటు వీడియో కవరేజ్, వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలన్నది అందులోని సారాంశం. పార్టీల ప్రచార సామాగ్రి అనుమతులు కూడా సీఈవో వద్ద పొందాలన్నది రెండోది. ఇక ప్రచారానికి వస్తే.. ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి చేసింది. పర్మీషన్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారుల వద్ద దరఖాస్తులు లభిస్తాయని తెలిపింది.

- Advertisement -

సభలు, సమావేశాలతోపాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్నా సువిధ యాప్ ద్వారా కాకుంటే నేరుగా అనుమతులను తీసుకోవాల్సి ఉంటోంది పార్టీలు. అభ్యర్థులకు కీలకమైన పాయింట్ ఇది. సభలు, సమావేశాలకు 48 గంటల ముందు ఎన్నికల అధికారుల వద్ధ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటింటి ప్రచారం చేయాలన్నా అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల నుంచి పర్మీషన్ తప్పనిసరి చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల రోజు నియోజకవర్గంలో పర్యటించడానికి ఒక్కో అభ్యర్థికి ఒక వాహనంతోపాటు ఆయన తరపు ఎన్నికల ఏజెంట్‌కు అనుమతి ఇస్తారు.

Also Read: AP Elections: ఎలక్షన్ టైమ్.. రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ

అదే లోక్‌సభ అభ్యర్థులైతే నియోజవర్గంలో పర్యటించడానికి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ కార్యకర్త లేదా ఏజెంట్ వాహనానికి అనుమతి ఉంటుంది. డ్రైవర్‌తోపాటు ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ మంది అవకాశం లేదన్నది ఈసీ ప్రధానంగా ప్రస్తావించింది. ఇక పోలింగ్ ముగిసే సమయానికి రెండురోజుల ముందు ఎటువంటి ప్రచారాలకు అనుమతి ఇవ్వరు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News