Big Stories

YS Sharmila Vs YS Jagan: జగనన్న వదిలిన బాణం ఆయనకే ఎదురెళ్తోంది.. షర్మిల చీల్చే ఓట్లు ఇవే..!

- Advertisement -

YS Sharmila focus on Jagan’s Defeat: వైఎస్‌ షర్మిలా రెడ్డి.. తెలంగాణపై జెండా పాతేస్తనని.. అది వీలుకాక.. ఇప్పుడు ఏపీని ఏలేయ్యాలని రెడీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ చీఫ్‌ పదవి తీసుకున్నారు. బాగుంది.. అంతా బాగుంది. కానీ ఏపీలో కాంగ్రెస్‌కు అంత సీన్‌ ఉందా? అసలు ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎఫెక్ట్‌ ఉంటుందా? షర్మిల టార్గెట్‌ అధికారమా? లేక అన్నను కూల్చడమా?

- Advertisement -

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీలో కాంగ్రెస్‌ పదవి దక్కించుకున్నారు వైఎస్ షర్మిల. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అన్న వైఎస్ జగన్‌ పాలనపై విరుచుకుపడుతున్నారు. నానా తిట్లు తిడుతూ ముందుకు వెళుతున్నారు షర్మిల. ఇప్పటికే ఉత్తరాంధ్రను చుట్టేశారు. రాయలసీమలో పర్యటించారు. కానీ ఎన్నికల్లో గెలిచే సత్తా కాంగ్రెస్‌కు ఉందా? అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపే సత్తా షర్మిలకు ఉందా? ఇప్పుడీ ప్రశ్నలు ఏపీ ప్రజల మదిలో ఉన్నాయి.

ఏపీలో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఇది కాదు ప్రశ్న. ఎన్ని ఓట్లను చీలుస్తుంది? ఇదీ అసలు ప్రశ్న. ఎందుకంటే షర్మిల వచ్చిన టైమింగ్‌. ప్రచారశైలి చూస్తుంటే కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ సీట్లు వచ్చే అవకాశాలు లేవు. కానీ చాలా ఓట్లను చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

మరి షర్మిల చీల్చేది ఎవరి ఓట్లను? షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అంటే ముమ్మాటికి వైసీపీకే నష్టమని చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఎస్సీ, క్రిస్టియన్ ఓట్లలో వైసీపీకే మెజార్టీగా పడతాయి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు.. వైసీపీకి ఆయువుపట్టైన ఎస్సీ ఓట్లనే టార్గెట్ చేశారు షర్మిల. ఎస్సీ సామాజికవర్గ నేతలను టార్గెట్ చేస్తున్నారు. క్రిస్టియన్‌ ఓటర్లను కాంగ్రెస్‌ వైపు తిప్పేందుకు.. భర్త అనిల్‌ కుమార్‌ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కనుక షర్మిల సక్సెస్‌ అయితే వైసీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

Also Read: ఇంటిపేరు కల్వకుంట్ల.. కేరాఫ్ అడ్రస్ స్కాములంట..

లాస్ట్‌ వీక్‌లో జరిగిన పొలిటిలక్‌ డెవలప్‌మెంట్స్‌ను అబ్జర్వ్‌ చేస్తే.. వైసీపీ నందికొట్కూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్థర్‌ కాంగ్రెస్‌లో చేరారు. చింతలపూడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలిజా.. లేటెస్ట్‌గా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పరిగెల మురళీకృష్ణ కూడా.. కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. పూతలపట్టు సిట్టింగ్‌ ఎమ్మెల్యే MS బాబు కూడా ఇప్పటికే షర్మిలతో టచ్‌లో ఉన్నారు. చూస్తుంటే వైసీపీకి గట్టిపట్టున్న ఎస్సీ నియోజకవర్గాల్లో మకాం వేయాలని చూస్తున్నారు షర్మిల. నిజానికి దశాబ్ధాలుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌గా ఉన్నాయి. అయితే వైసీపీ ఎంట్రీతో ఆ ఓట్లన్ని వైసీపీకి మళ్లాయి. ఇప్పుడు మళ్లీ వాటిని తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు షర్మిల.

వైఎస్‌ఆర్‌ కూతురుగా ఉన్న చరిష్మా, ఎస్సీల్లో పెరుగుతున్న మద్దతు, క్రిస్టియన్ ఓటర్లను మచ్చిక చేసుకోవడం, ఇవన్నీ జరిగితే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి దారుణంగా పడుతుంది దెబ్బ. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకొని కాపు ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు.. టిడిపి స్కెచ్ వేసింది. ఇక షర్మిల ఎస్సీలపై కాన్సన్‌ట్రేట్‌ చేస్తే.. వైసీపీ అంచానాలు, సీట్ల లెక్కలు తలకిందులవడం తథ్యం.

Also Read: ఖాకీలు కాదు వాళ్లు.. ఖతర్నాక్ రౌడీలు.. తెరపైకి బీఆర్ఎస్ పెద్దల పేర్లు

వైసీపీలో ఉన్నది చాలా మంది పూర్వపు కాంగ్రెస్‌ నేతలే.. ఇప్పుడు వారందరినీ టచ్‌ చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. వైసీపీలోనూ షర్మిల అభిమానులు ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు వీరి డెస్టినేషన్‌ కాంగ్రెస్‌. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే షర్మిల ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా అనౌన్స్‌ చేయలేదు. అసలు అభ్యర్థులు ఉన్నారా? లేరా? అన్నది కూడా డౌటే. కానీ తెర వెనుక చేయాల్సిందంతా చేసేస్తున్నారు షర్మిల. ప్రస్తుతం చూస్తుంటే తాను నెగ్గడం కంటే.. అన్నను కూల్చడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది షర్మిల. ఇదైతే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి కలిసొచ్చేదే అని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ డ్యామ్‌ షూర్‌ సీట్లు అని లెక్కేసుకున్న స్థానాల్లో.. షర్మిల మంత్రాంగం పనిచేస్తే మాత్రం కూటమి నేతలు ఫుల్‌ హ్యాపీ.

కానీ ఏపీ ప్రజల్లో కాంగ్రెస్‌ నేతలపై ఇంకా పూర్తిగా పోలేదు. చాలా మంది కాంగ్రెస్‌ను అంతగా కన్సిడర్ చేయడం లేదు. దీనికి తోడు షర్మిల్ పొలిటికల్‌ కాండాక్ట్‌ను వ్యాలీడేట్ చేస్తే.. అంతగా గొప్పగా మార్కులు పడవు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నప్పుడు ఆ ప్రాంత కొడలినని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రా అమ్మాయినంటూ తిరుగుతున్నారు. ఏపీ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఏదేమైనా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. చెల్లె వేసే బాణాలు.. గట్టిగా కాకపోయినా.. కాస్తైనా అన్నకు గుచ్చుకోవడం ఖాయమన్న టాకైతే ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News