BigTV English

Mobile Recharge Plans Hikes: యూజర్లకు బ్యాడ్‌ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు!

Mobile Recharge Plans Hikes: యూజర్లకు బ్యాడ్‌ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు!
Mobile Recharge
Mobile Recharge

Mobile Recharge Plans Price going to Hike Soon during the Elections 2024: టెలికాం కంపెనీలు యూజర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. బిజినెస్ రంగంలో తమ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారుల తాకిడిని కూడా పెంచుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాయి. అతి తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఐపీఎల్ సీజన్ వరకు మాత్రమే వర్తిస్తుందని కూడా పేర్కొంది. అయితే తాజాగా రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


లోక్‌సభ ఎన్నికలు 2024 సమీపిస్తున్న వేళ టెలికాం రంగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. లోక్ సభ ఎన్నికలు పూర్తవ్వగానే మరోసారి వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. టారీఫ్ ఛార్జీలను పెంచాలని టెలికాం రంగాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా, గత రెండేళ్లుగా టెలికాం కంపెనీలు ఛార్జీల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే తాజాగా ఎన్నికలు ముగిసాక ఒక్కో టెలికాం సంస్థ 15 నుంచి 20 శాతం వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: హీరో విడా స్కూటీపై క్రేజీ ఆఫర్‌.. రూ. 27,000 విలువైన ఫ్రీ సర్వీసెస్


కస్టమర్ నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు ఛార్జీలు పెంచనున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొంతకాలం నుంచి కంపెనీలు ఛార్జీలు పెంచాలని ఆలోచిస్తున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే ఇన్వెస్టర్లతో జరిగిన పలు సమావేశాల్లో కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్లు సమాచారం. 4జీ, 5జీ సేవలు వచ్చినప్పటి నుంచి టెలికాం సంస్థలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. అయితే ఈసారి పెంచే ధరల్లో కొత్తగా వచ్చే వినియోగదారులకు స్పెషల్ ప్లాన్స్ రెడీ చేస్తుంది.

5జీ సేవల కోసం టెలికాం కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టాయి. అప్పటి నుంచి ఎటువంటి ఛార్జీల పెంపులు చేయలేదు. అయితే పెట్టిన పెట్టుబడులతో కంపెనీలకు ఖర్చులు కూడా అంతే పెరిగిపోయాయి. దీంతో ఖర్చు పెట్టిన ఆదాయాన్ని తిరిగి సంపాదించుకునేందుకు వినియోగదారులపై భారాన్ని మోపనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×