Jio Plans: భారతీయ టెలికాం దిగ్గజం జియో.. వినియోగదారులకు కళ్లు చెదిరే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్ లో తన ఫీచర్ ప్యాక్డ్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. అపరిమిత వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా సహా ఎన్నో ఉచిత ప్రయోజనాలను అందిస్తోంది. అపరిమిత 5G డేటా నుంచి ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ల వరకు ఆకట్టుకునే ఆఫర్లను పరిచయం చేసింది. జియో అందిస్తున్న బెస్ట్ రీఛార్జ్ ఆఫర్లు, వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ అపరిమిత వాయిస్ కాలింగ్
జియో బెస్ట్ ఫీచర్లలో ఒకటి అపరిమిత వాయిస్ కాలింగ్. ఇది అన్ని ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో ఉచితంగా లభిస్తోంది. లోకల్, STD, రోమింగ్ కాల్స్ చేస్తున్నా, జియో అదనపు ఛార్జీలు లేకుండా దేశంలోని ఏ నెట్ వర్క్ కైనా కనెక్టివిటీ అందిస్తుంది. రూ.189 (28 రోజులు), రూ.489 (84 రోజులు), రూ.1899 (336 రోజులు) లాంటి ప్లాన్స్ తో ఈ ప్రయోజనం పొందవచ్చు.
⦿అపరిమిత 5G డేటా
దేశంలోని 7,000 కంటే ఎక్కువ నగరాలను కవర్ చేస్తోంది జియో 5G నెట్ వర్క్. జియో రూ.239, అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్ లపై అదనపు ఖర్చు లేకుండా అపరిమిత 5G డేటాను అందిస్తుంది. రూ. 239 (రోజుకు 1.5GB 4G + అపరిమిత 5G), రూ. 2999 (రోజుకు 2.5GB 4G + 365 రోజులకు అపరిమిత 5G) లాంటి ప్లాన్స్ అందరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తాయి.
⦿ ఫ్రీ OTT సబ్ స్క్రిప్షన్లు
ప్రీమియం OTT ప్లాట్ ఫామ్‌లకు జియో ఉచిత సబ్ స్క్రిప్షన్లను అందిస్తుంది. చాలా ప్లాన్లలో JioTV (లైవ్ టీవీ ఛానెళ్లు), JioCinema(సినిమాలు, షోలు, ప్రత్యేకమైన కంటెంట్) పొందే అవకాశం ఉంది. JioHotstar రూ.349, రూ.999, రూ.3599 ప్లాన్లతో 90 రోజుల సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. Netflix, Amazon Prime రూ.1299 లాంటి ప్రీమియం ప్లాన్లతో లభిస్తాయి. SonyLIV, ZEE5 సహా ఇతర ఓటీటీలు రూ.1049 లాంటి ప్లాన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఫ్యాన్ కోడ్, డిస్కవరీ+, సన్ NXT, ఇతర OTT సేవలు కూడా ఉన్నాయి.
⦿ ఉచిత ఎస్సెమ్మెస్ లు
అదనపు ఖర్చులు లేకుండా మీరు ఎస్సెమ్మెస్ లు కూడా పంపుకోవచ్చు. రూ. 189 ప్లాన్తో 28 రోజులకు 300 SMS, రూ. 489 ప్లాన్తో 84 రోజులకు 1000 SMS, రూ. 1899 ప్లాన్ తో 336 రోజులకు 3600 SMS, రూ. 349, రూ. 3599 వంటి ప్రీమియం ప్లాన్లతో రోజుకు 100 SMSలను పొందే అవకాశం ఉంది.
⦿ జియో క్లౌడ్ స్టోరేజ్
జియోలోని పలు ప్లాన్లు ఉచిత 50GB వరకు JioAICloud స్టోరేజ్ పొందే అవకాశం ఉంది. వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైల్స్ ను సురక్షితంగా బ్యాకప్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ రూ. 349, రూ. 999, రూ. 3599 లాంటి ప్లాన్స్ తో అందుబాటులో ఉంది.
⦿ ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ప్లాన్స్
జియో ప్లాన్స్ కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి. రూ. 1028 స్విగ్గీ-బండిల్డ్ ప్లాన్ తో 3 నెలల స్విగ్గీ వన్ లైట్ మెంబర్ షిప్ లభిస్తుంది. 10 ఫ్రీ ఫుడ్, ఇన్‌స్టామార్ట్ డెలివరీలు లభిస్తాయి. సర్జ్ చార్జీలు ఉండవు. రెస్టారెంట్ డిస్కౌంట్లను అందిస్తుంది.జియో వితౌడ్ డేటా ప్లాన్స్ కూడా అందిస్తోంది. రూ.1748 (336 రోజులు), రూ.448 (84 రోజులు) లాంటి ప్లాన్స్ డేటా లేకుండా అపరిమిత కాల్స్, SMSలను అందిస్తాయి,
⦿ ఫ్రీ కాలర్ ట్యూన్స్, జియో యాప్స్
ఎంపిక చేసిన ప్లాన్లలో పర్సనల్ కాలర్ ట్యూన్ల కోసం జియో ట్యూన్స్ కు ఉచిత యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. అదనంగా మై జియో, జియోమార్ట్, జియో న్యూస్ లాంటి యాప్స్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది.
⦿ అత్యవసర డేటా వోచర్లు
ప్రతి రోజు పరిమితికి దాటి డేటా వినియోగిస్తే రోజువారీ వోచర్లను పొందే అవకాశం ఉంటుంది. తక్కువ ధరతో అంతరాయం లేని డేటా యాక్సెస్ ను పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఉచిత రోమింగ్
జియోతో దేశం అంతటా కాల్స్, డేటా వినియోగానికి ఎటువంటి రోమింగ్ ఛార్జీలు లేవు. మీరు పని కోసం, లేదా వెకేషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే హ్యాపీగా కాల్స్ చేసుకోవచ్చు. డేటా వాడుకోవచ్చు.
Read Also: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?
⦿ జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
❂రూ. 189 (28 రోజులు): 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMS, JioTV, JioCinema, JioCloud.
❂రూ. 349 (28 రోజులు): 2GB/రోజు 4G, అపరిమిత 5G, 100 SMS/రోజు, JioHotstar, JioTV, JioCinema, 50GB JioAICloud.
❂రూ. 2025 (200 రోజులు): 2.5GB/రోజు 4G (మొత్తం 500GB), అపరిమిత 5G, 100 SMS/రోజు, JioHotstar, Rs 2150 కూపన్లు.
❂రూ. 3599 (365 రోజులు): 2.5GB/రోజు 4G (మొత్తం 912.5GB), అపరిమిత 5G, 100 SMS/రోజు, JioHotstar, 50GB JioAICloud.
❂రూ. 999 పోస్ట్ పెయిడ్: అపరిమిత 5G డేటా, 100 SMS/రోజు, Amazon Prime, Netflix, JioTV, JioCinema.
Read Also: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?