E-Paper
Advertisement

Mla Dance On Road: నడిరోడ్డుపై దురంధర్ మ్యూజిక్ కు ఎమ్మెల్యే స్టెప్పులు.. వీడియో వైరల్

Mla Dance On Road: నడిరోడ్డుపై దురంధర్ మ్యూజిక్ కు ఎమ్మెల్యే స్టెప్పులు.. వీడియో వైరల్
Advertisement

Mla Dance On Road: గ్రీన్ ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే రీల్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్.. జంగారెడ్డిగూడెం మార్గంలో వెళ్తూ.. రోడ్డుపై కారు ఆపి దురంధర్ మ్యూజిక్‌కు డాన్స్ వేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రజలను, పాలనను గాలికి వదిలేసి రోడ్లపై రీల్స్ చేస్తున్న ప్రజా ప్రతినిధి అంటూ వైసీపీ మద్దతుదారులు రీట్వీట్లు చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తే తప్పేముందని కూటమి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో.. అంబటి రాంబాబు డ్యాన్స్ లు చేయలేదా? అంటూ పాత వీడియోలు ట్యాగ్ చేస్తున్నారు.

Advertisement

 

ప్రజాప్రతినిధులు చాలా అరుదుగా కాళ్లు కదుపుతుంటారు. అధికారిక కార్యక్రమాల్లో సంప్రదాయ నృత్యాలు చేస్తే.. వారితో కలిసి కాసేపు డ్యాన్స్ చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు సైతం ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న ప్రజాప్రతినిధులు ట్రెండ్ కు తగ్గట్టు.. ప్రజల్లో ఉంటున్నారు. యువతను ఆకట్టుకునేలా లెటెస్ట్ మ్యూజిక్ కు రీల్స్ చేస్తున్నారు. ఇటీవల భీమవరం బీట్స్ సాంగ్ లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డ్యాన్స్ తో అలరించారు.

రఘురామ డ్యాన్స్

Advertisement

సంక్రాంతి సందర్బంగా పాప్ సింగర్ స్మిత రూపొందించిన.. భీమవరం బీట్స్ స్పెషల్ ఆల్బమ్‌లో రఘురామ స్టెప్పులు వేశారు. ఇటీవల భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఆయన స్టేజ్‌పై రఘురామకృష్ణంరాజు స్టెప్లులు వేసి వీక్షకులను ఆనందింపజేశారు.

Also Read:  భోగాపురంపై ప్రాణం పెట్టిన టీడీపీ.. కాదు కాదు ఆ ఘనత మాదే! 

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో డ్యాన్స్ అదరగొట్టారు. డాన్స్ స్టెప్పులతో దుమ్ము రేపారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేశారు. ఎమ్మెల్యే డ్యాన్స్ వీడియో వైరల్ అయింది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×