E-Paper
Advertisement

Avinash Reddy Mother : అవినాష్‌ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి సీరియస్.. హెల్త్ బులిటెన్ ఫుల్ డిటైల్స్..

Avinash Reddy Mother : అవినాష్‌ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి సీరియస్.. హెల్త్ బులిటెన్ ఫుల్ డిటైల్స్..
Advertisement

Avinash Reddy Mother : కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 4 రోజులుగా ఆ ఆస్పత్రిలోనే ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన ఇబ్బందులకు చికిత్స అందిస్తున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. అవినాష్‌ రెడ్డి కూడా తల్లితో ఆస్పత్రిలోనే ఉన్నారు. తాజాగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది.

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని విశ్వభారతి ఆస్పత్రి వెల్లడించింది. ఆమె నాన్‌ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌ గురయ్యారని తెలిపింది. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారని తేలిందని పేర్కొంది.

Advertisement

ప్రస్తుతం సీసీయూలో శ్రీలక్ష్మిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌పై ఉన్నారని వివరించారు. ప్రస్తుతం ఆమెకు వాంతులు అవుతున్నాయన్నారు. వాంతులు ఇలాగే కొనసాగితే ఆల్ట్రాసౌండ్ స్కాన్‌, మెదడుకు ఇమేజింగ్ స్కాన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. లోబీపీ ఉన్నందున మరికొన్ని రోజులు సీసీయూలో ఉంచాల్సిన అవసరం ఉందని విశ్వభారతి వైద్యులు స్పష్టం చేశారు.

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×