Big Stories

Driverless Tractor: డ్రైవర్ లేకుండా ట్రాక్టర్.. వ్యవసాయం కోసం..

Driverless Tractor: పెరుగుతున్న టెక్నాలజీ అనేది శాస్త్రవేత్తలను మాత్రమే కాదు.. విద్యార్థులను కూడా కొత్తగా ఆలోచించడానికి ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులను కనిపెట్టిన ఎన్నో కొత్త పరికరాలను ఉపయోగిస్తూ మనం రోజూవారి జీవితాలను సాఫీగా కొనసాగిస్తున్నాం అనడంలో ఆశ్చర్యం లేదు. ఇదే టెక్నాలజీని ఉపయోగించి రైతులకు కూడా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో పలువురు విద్యార్థులు ఒక కొత్త రకమైన ట్రాక్టర్‌ను కనిపెట్టారు.

- Advertisement -

వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) విద్యార్థులు డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్‌ను కనిపెట్టారు. ఇది వ్యవసాయ రంగంలోనే ఒక మర్చిపోలేని ఇన్నోవేషన్ అని రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఈ విద్యార్థులను ప్రశంసిస్తున్నారు. ఈ డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్‌ను ముందుగా వారు క్యాంపస్‌లోనే టెస్ట్ చేశారు. తాజాగా అయిదోసారి కూడా ఈ ట్రాక్టర్ టెస్టింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యింది. అందుకే ఈ ట్రాక్టర్ గురించి రాజకీయ నాయకులు సైతం మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

‘ఆటోమేషన్ ఆఫ్ ఫార్మింగ్ టూల్స్ ఫర్ స్మార్ట్ ఫార్మింగ్ యూజింగ్ యాండ్రాయిడ్ అప్లికేషన్’ పేరుతో డ్రైవర్ లేని ఈ ట్రాక్టర్ తయారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు విద్యార్థులు. ఈ ప్రాజెక్ట్‌కు ఇతర విద్యార్థుల దగ్గర నుండి మాత్రమే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్స్ దగ్గర నుండి కూడా మంచి ప్రోత్సాహం లభించింది. చాలామంది పేరున్న వ్యక్తులు ఉన్న పెట్టుబడుల విషయంలో విద్యార్థులకు సాయం చేశారు. వారి ప్రోత్సాహంతోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామని విద్యార్థులు బయటపెట్టారు. కేటీఆర్ సైతం ఈ ట్రాక్టర్ గురించి ట్వీట్ చేయడం విశేషం.

ఈ ట్రాక్టర్ వ్యవసాయం విషయంలో రైతులకు సాయంగా ఉంటూ, వారి ఖర్చులను తగ్గిస్తూ.. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో మనుషులను తగ్గించి టెక్నాలజీని పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా తయారైన ఈ ట్రాక్టర్ కంప్యూటర్ గేమ్‌ను గుర్తుచేస్తోంది. ఎన్నో సెన్సార్లతో తయారైన ఈ ట్రాక్టర్.. ఎప్పటికప్పుడు ఫీల్డ్ డేటాను కలెక్ట్ చేస్తూ పనిచేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News