BigTV English

Bangalore Reve Party- AP Minister Aid Arrest: బెంగుళూరు రేవ్ పార్టీ.. ఈసారి రాజకీయ మద్దతుదారుల వంతు!

Bangalore Reve Party- AP Minister Aid Arrest: బెంగుళూరు రేవ్ పార్టీ.. ఈసారి రాజకీయ మద్దతుదారుల వంతు!

Bangalore Reve Party- Ap Minister Aid Arrest: బెంగుళూరు రేవ్ పార్టీలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయవాడకు చెందిన వాసుతోపాటు మొత్తం ఆరుగుర్నిఅదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.


అందులో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాని గోవర్థర్‌రెడ్డి అనుచరుడు కూడా ఉన్నాడు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అనుచరుడు అరుణ్‌ కుమార్ అదుపులోకి తీసుకున్న బెంగుళూరు పోలీసులు, అతడి ఫోన్ ఆధారంగా కొంతమంది వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. వారికి రేపు మాపో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమాచారం. వారిలో కీలక వ్యక్తులున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కేసులో విజయవాడకు చెందిన వాసును ఏ 1గా చేర్చారు. అరుణ్‌కుమార్‌గా ఏ2, ఏ3గా విజయవాడ వన్ టౌన్ కు చెందిన నాగబాబు పేర్లను ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు పోలీసులు. ఈ ముగ్గురిలో అరుణ్‌కు వైసీపీతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అరుణ్‌కుమార్ అరెస్టయిన బెంగుళూరు సెంట్రల్ జైలుకి తరలించారు.


Also Read: 7 సెగ్మెంట్లు.. 600 కోట్లు.. కడప గడపలో టెన్షన్

ఇక మంత్రి కాకాని అనుచరుడు విషయానికి వద్దాం. పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్‌ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ వెంకటేశ్వరరావు పేరు మీద ఉంది.
దాని ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన పూర్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఈయన మంత్రి అనుచరుడేనని పోలీసులు దాదాపు ఓ అంచనాకు వచ్చారు. పోలీసుల దాడుల సమయంలో అక్కడి నుంచి పూర్ణారెడ్డి ఎస్కేప్ అయ్యారు. పార్టీలో రనధీర్‌బాబు, అరుణ్ కుమార్ క్రూషియల్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తోంది.

ఏపీతోపాటు తెలంగాణ నుంచి అనేక మందిని బెంగుళూరు పార్టీకి వాసు రప్పించినట్టు సమాచారం. గతవారం బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో వాసు బర్త్ డే పార్టీ పేరిట రేవ్ పార్టీ జరిగింది. దీనికి దాదాపు 150 మంది సినీ, రాజకీయాలకు సంబంధించి వ్యక్తులు హాజరయ్యారు. పోలీసులు దాడుల సమయంలో 47 మంది పరారయ్యారు. టాలీవుడ్ నుంచి నటి హేమతోపాటు ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×