BigTV English

Upcoming Scooters in 2024-25: మచ్చా.. బ్రాండెడ్ కంపెనీల నుంచి 5 స్కూటర్లు దిగుతున్నాయ్.. వీటి ఫీచర్లు, లుక్‌ అదరహో!

Upcoming Scooters in 2024-25: మచ్చా.. బ్రాండెడ్ కంపెనీల నుంచి 5 స్కూటర్లు దిగుతున్నాయ్.. వీటి ఫీచర్లు, లుక్‌ అదరహో!

Upcoming Scooters In 2024-25: ప్రస్తుతం మార్కెట్‌లో స్కూటర్ల హవా నడుస్తోంది. వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కంపెనీలు అదిరిపోయే ఫీచర్లు, సరసమైన ధరలో స్కూటర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు తమ స్కూటర్లను మార్కెట్‌లో రిలీజ్ చేశాయి. అయితే 2024-25 సంవత్సరానికి సంబంధించి బ్రాండెడ్ స్కూటర్ కంపెనీలు తమ సరికొత్త స్కూటర్లను త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనున్నాయి. 2024-25 సంవత్సరంలో టీవీఎస్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, హోండా వంటి అగ్ర కంపెనీల నుంచి బడ్జెట్ ధరలో 5 కొత్త స్కూటర్లు రానున్నాయి. మార్కెట్‌లో ఉన్న ఇతర స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ కంపెనీల నుంచి రాబోతున్న 5 స్కూటర్ల గురించి తెలుసుకుందాం.


హీరో జూమ్‌ 125R & జూమ్‌ 160

హీరో మోటోకార్ప్ నుంచి త్వరలో Hero Zoom 125R & Zoom 160 స్కూటర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ స్కూటర్లు 125సీసీ విభాగంలోని స్పోర్టీ స్కూటర్లకు గట్టి పోటీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్కూటర్లు బెస్ట్ అడ్వెంచర్ స్కూటర్‌గా కూడా దుమ్ము దులిపేస్తాయట. ఈ రెండు మోడళ్లు అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో మార్కెట్‌లోకి రానున్నాయి. కాగా ఈ రెండు స్కూటర్లు 156 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్నాయి. 15.2 bhp వద్ద 14.1nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి మెరుగైన ఫ్యూయెల్‌ ఎఫిసెన్సీ కోసం ఐ3ఎస్ టెక్నాలజీని కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేకులు, ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బ్లాక్ ప్యాటర్‌ టైర్లతో 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మార్ట్ కీ వంటి ఫీచర్లు జూమ్‌ 160 స్కూటర్ ప్రత్యేకతలు.


Also Read: 137 కి.మీ మైలేజీ‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. కేవలం రూ.79,999లకే.. ఓ రేంజ్‌లో ఫీచర్లు!

హోండా ఎలక్ట్రిక్ స్కూటర్

హోండా ఇండియా స్కూటర్లలో తన హవా కనబరుస్తోంది. అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకేసింది. తన మొదటి Honda Electric Scooterని తీసుకురావడానికి సిద్ధమైంది. భారత్‌లో తొలిసారిగా కర్ణాటకలోని ఉత్పత్తి కేంద్రంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తయారు చేయనుంది. యాక్టివా స్ఫూర్తితో K4BA కోడ్ నేమ్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతుండటంతో హూండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే భారత మార్కెట్‌లో హోండా ప్రత్యేకంగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను అభివృద్ధి చేస్తోంది.

హీరో విడా

Hero Vida సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన స్కూటర్లు మంచి క్రేజ్ అందుకుని సేల్స్‌లో అదరగొట్టాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో బడ్జెట్ ధరలో కొత్త స్కూటర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హెడ్ లైట్, సీటు క్రింద భారీ స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. వీ1 మాదిరిగానే ఈ కొత్త స్కూటర్లు కూడా అదే ప్లాట్ ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: Top Selling Electric Scooters In April 2024: గత నెలలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. టాప్ 5లో ఇవే..

న్యూ బజాజ్ చేతక్ (New Bajaj Chetak)

బజాజ్ ఆటో చేతక్ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌‌ను వచ్చే ఏడాది అంటే 2025 ప్రారంభంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో చేతక్ ప్రీమియం, అర్బనే అనే రెండు వేరియంట్లు లభిస్తున్నాయి. ఇవి వరుసగా రూ. 1.47 లక్షలు, రూ. 1.23 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్త రకం స్కూటర్ మాత్రం మంచి ఫీచర్లతో మార్కెట్‌లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

Tags

Related News

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Big Stories

×