E-Paper
Advertisement

Vizag North Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. విశాఖపట్నం నార్త్ లో విజయం సాధించేదెవరు ?

Vizag North Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. విశాఖపట్నం నార్త్ లో విజయం సాధించేదెవరు ?
Advertisement
AP Politics

Bigtv Survey in Vizag North Assembly Constituency(AP Politics): విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్ పొలిటికల్ గా హాట్ డిబేట్ కు కారణమవుతోంది. ఇక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2021లో రాజీనామా చేస్తే.. స్పీకర్ ఇన్నాళ్లకు ఆమోదించారు. నిజానికి గంటా శ్రీనివాసరావు ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలైన భీమిలి, చోడవరం, అనకాపల్లి ఇలా ఏ పార్టీ నుంచి ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వస్తున్నారు. బలమైన నేతగా గుర్తింపు ఉంది. అయితే విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్ లో గత మూడు ఎన్నికల సినారియో చూస్తే ఒక్క బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు తప్పించి.. ఏ పార్టీ కూడా పెట్టిన అభ్యర్థినే పెట్టలేదు. కొత్తవారిని దింపుతూ వస్తున్నాయి. మరి ఈసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

కమ్మిల కన్నపరాజు వైసీపీ VS గంటా శ్రీనివాసరావు (టీడీపీ గెలుపు)

Advertisement

2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ సెగ్మెంట్ నుంచి టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి 38 శాతం ఓట్లు సాధించారు. వైసీపీ నుంచి కమ్మిల కన్నపరాజు పోటీ చేసి 37 శాతం ఓట్లు రాబట్టారు. ఇక జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్ పోటీ చేసి 11 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 14 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖపోరు నడిచింది. ఈ ఉత్కంఠ పోరులో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు. 2014లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాసరావు, 2019లో మాత్రం విశాఖ నార్త్ నుంచి బరిలో దిగి గెలిచారు. మరి ఈసారి ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కమ్మిల కన్నపరాజు (కే.కే.రాజు) (YCP) ప్లస్ పాయింట్స్

Advertisement

2019లో ఓడినప్పటికీ సెగ్మెంట్ లో యాక్టివ్

సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడడంలో కీలక పాత్ర

గడప గడప ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం

వైసీపీ క్యాడర్ నుంచి బలమైన సపోర్ట్

కమ్మిల కన్నపరాజు మైనస్ పాయింట్స్

టీడీపీ, జనసేన కూటమిని ఎంత వరకు ఎదుర్కొంటారన్న డౌట్లు

గంటా శ్రీనివాసరావు (TDP) ప్లస్ పాయింట్స్

ఉత్తరాంధ్రలో బలమైన నేతగా గుర్తింపు

కాపు సామాజికవర్గంలో మంచి ఇమేజ్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయడం

పార్కుల సుందరీకరణ, రోడ్ల నిర్మాణం

గంటా శ్రీనివాసరావు మైనస్ పాయింట్స్

భీమిలి నుంచి పోటీ చేస్తారని జనంలో అభిప్రాయం

సింగరాయకొండ వంటి ప్రాంతాల అభివృద్ధి జరగకపోవడం

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగా లేకపోవడం

పసుపులేటి ఉషాకిరణ్ (JSP) ప్లస్ పాయింట్స్

పవన్ ఇమేజ్, కాపు సామాజిక వర్గం ఓట్లపై నమ్మకం

పార్టీ కార్యక్రమాల నిర్వహణ

జనంలోకి జనసేన ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం

పసుపులేటి ఉషాకిరణ్ మైనస్ పాయింట్స్

పార్టీ కార్యక్రమాల్లో కొంత వరకే పాత్ర

కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ కరువు

ఇక వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

కమ్మిల కన్నపరాజు VS గంటా శ్రీనివాసరావు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విశాఖ నార్త్ సెగ్మెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నుంచి బరిలో దిగే కమ్మిల కన్నపరాజుకు 48 శాతం ఓట్లు, గంటా శ్రీనివాసరావుకు 42 శాతం ఓట్లు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైసీపీ నేత కమ్మిల కన్నపరాజుకు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ ఈ సెగ్మెంట్ లో మరింతగా పని చేశారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో టీడీపీ జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారడం కూడా జనం మైండ్ సెట్ వైసీపీ అభ్యర్థివైపు మళ్లేందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఈ సెగ్మెంట్ లో టీడీపీకి సహజమైన ఓటు బ్యాంకు ఉంది.

కమ్మిల కన్నపరాజు VS పసుపులేటి ఉషాకిరణ్ (జనసేన)

ఇక మరో సినారియో ప్రకారం విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కమ్మిల కన్నపరాజు, జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థికి 47 శాతం ఓట్లు, జనసేన అభ్యర్థిని ఉషాకిరణ్ కు 45 శాతం ఓట్లు, ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. వైసీపీ అభ్యర్థి కన్నపరాజు కష్టపడి పని చేయడం, జనానికి అందుబాటులో ఉండడం ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. మరోవైపు బలహీనమైన ప్రత్యర్థులు కూడా ఉండడం వైసీపీకి ప్లస్ అవుతోంది. మరోవైపు జనసేనకు ఓట్ షేర్ రావడానికి కారణం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం, సామాజిక సమీకరణాల మార్పులతో ఓట్లు వచ్చే ఛాన్స్ ఉండడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×