E-Paper
Advertisement

Pawan Kalyan Grant Road: వేదికపై రోడ్డు కోసం గిరిజన యువకుడు విన్నపం.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎంపై సర్వత్రా ప్రశంసలు

Pawan Kalyan Grant Road: వేదికపై రోడ్డు కోసం గిరిజన యువకుడు విన్నపం.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎంపై సర్వత్రా ప్రశంసలు
Advertisement

Pawan Kalyan Grant Road: కానిస్టేబుల్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వేదికగా ఓ అభ్యర్థి విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని సీఎం చంద్రబాబును కోరారు. బాబూరావు కోరిక మేరకు గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న డిప్యూటీ సీఎంకు అప్పగించారు సీఎం.

సభ ముగిసేలోగా నిధులు గ్రాంట్

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పవన్ కు అందించారు.

Advertisement

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో అల్లూరి జిల్లా కలెక్టర్ రోడ్డు అనుమతికి పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Also Read: Kollikpudi Srinivasarao: పార్టీని డ్యామేజ్ చేస్తూ.. అధినేతకే సవాల్

అంధ క్రికెటర్ ఊరికి రోడ్డు

Advertisement

ఇటీవల అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక వినతి మేరకు ఆమె గ్రామానికి సైతం రోడ్డు మంజూరు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఉదయం ఆమె రోడ్డు కోసం విజ్ఞప్తి చేయగా, సాయంత్రానికి ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేశారు. అలాగే క్రికెట్ జట్టు సభ్యులకు సొంత డబ్బులతో ఆర్థిక సాయం చేసి శభాష్ అనిపించుకున్నారు.

పోలీస్ వ్యవస్థకు మూలస్థంభం

కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కానిస్టేబుళ్లపై గౌరవాన్ని ఎవరి ముందూ తగ్గించుకోవద్దన్నారు. ‘శాంతి భద్రతలను పరిరక్షించే మీరు… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఓ చోదక శక్తి. సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ మీరంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. గత ప్రభుత్వ నిర్వాకంతో మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు. కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామకాలు చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి పోలీసులకు హెచ్చరికలు చేస్తున్నారు. ⁠పోలీసులని బెదిరించేవారిని ఉపేక్షించం. మీరు ప్రజలకు రక్షణ కల్పించండి.. అండగా మేము ఉంటాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×